To avail the living Guru Seva, need Sattvic parents who are above 60 years of age - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,978; 104 తత్వాలు (Tatvaalu) and views 226,376.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

సజీవ గురువు సేవ పొందడానికి, 60 ఏళ్ళు దాటిన సాత్విక ముదుసలి తల్లి దండ్రులు కావలెను.

అమ్మ ఎవరికైనా అమ్మే. అలాగే నాన్న కూడా. మనందరం భగవంతుని సంతానం అయితే, అందరికీ చేయలేకపోయినా, కనీసం సాత్వికులకు సేవ చేయలేమా?

Mom is Mom to anyone. Simlary the Dad. If we are all children of God, we may not serve all, but at least the righteous/ Satva guna folks?

సజీవ గురువు సేవ పొందడానికి, 60 ఏళ్ళు దాటిన సాత్విక ముదుసలి తల్లి దండ్రులు కావలెను. లేదా 2 వ వారు గతించి లేదా ఒంటరివారై, ఒక్కరు ఉన్నా పర్లేదు. ఎందుకంటే, మీకు సహనం, ఓర్పు, మన తన, నిస్వార్ధం, క్రుతజ్ఞత, విశ్వసనీయత, సర్దుబాటుతనం, ఆచరణ భక్తి ఉంటుంది.

To avail the living Guru Seva, sattvic parents who are above 60 years of age are needed. Or if the 2nd person has passed away or alone and there is only one, still no problem. Because you have patience, endurance, selflessness, gratitude, trustworthiness, adjustability, practical devotion.

మానవ సేవ మాధవ సేవ అని మీరు నమ్ముతారు. దేహమే దేవాలయం, జీవుడే దైవం అని మీరు నమ్ముతారు. అప్పులు, ప్రాపంచిక మోహాలు ఉండవు. మానసిక బలం నియంత్రణ మీకు ఉంటుంది.

You believe that Manav Seva is Madhva Seva. You believe that the body is the temple and the soul is God. No debts, no worldly lusts. You have control over mental strength.

అధర్మానికి ఎప్పుడు మీరు సహాయం చేయరు, అండగా ఉండరు, ఆశ్రయం ఇవ్వరు. ఒకవేళ చెయ్యాల్సి వచ్చినా, అందరికీ చెప్పి, మన్నించమని కోరతారు.

You will never help, support, or shelter iniquity(for bad folks). If you have to do it, you will tell everyone and ask for forgiveness.

మా అంతట మేము ముందుకు వచ్చి, మీకు సేవ చేస్తాం అని పలురకాలుగా అన్నట్లుగా, మీరూ అన్ని సేవలు అడిగి మరీ చేస్తారు, మనస్పూర్తిగా. అలాంటి వారికి, అండగా ఉంటే, దైవం మనకు మంచి చేస్తుంది అన్న స్వార్ధం, తప్పు కాదు కదా?

As we have said in many ways that we will come forward and serve you, you also ask for all services and do them wholeheartedly. If we stand by such people, the selfishness that God will do us good is not wrong, right?

రజో, తమస గుణ దాసులు అయినా పర్లేదు. కాని మన దగ్గర, ఒక్క రోజు/ వారం/ నెల కూడా ఉండలేరు, ఎందుకు అనవసరపు తలనొప్పి ఇద్దరకు. ఎందుకంటే వారికి సాధన కుదరదు. కనీస సౌకర్యాలతో ఉండడము నచ్చదు. వారి కోరికలు మనము తీర్చలేము. వారికి సహనం, ఓరుపు, నిస్వార్ధం, క్రుతజ్ఞత, విశ్వసనీయత, స్తిరత్వం, ఉండవు. పారిపోతారు, నేడో రేపో, మన మీద నిందలు వేసి, ఇంకా పాపం పెంచుకుంటూ.

Even for Rajo and Tamasa guna slaves also, no problem. But they can't stay even one day/ week/ month, why unnecessary headache for both. Because they cannot practice. They don't like living with minimum facilities. We cannot fulfill their desires. There is no patience, endurance, selflessness, gratitude, loyalty,
constancy for them. They will run away, today or tomorrow, accusing us and increasing their sin.

మనల్ని చూసి, ఇలాగే, రజో తామస గుణ వారు కూడా, వారి గుణాలకు సరి పోయే వారికి, సేవ మొదలు పెడితే, మంచిదే కదా.

Seeing us, similarly, those of Rajo Tamasa Guna, who are suitable for their qualities, start Seva, isn't it good.

మీరు వచ్చేటప్పుడు, ఒక్క రూపాయి తీసుకుని రావాల్సిన అవసరము లేదు. మొత్తము మీ సాత్విక పిల్లలకో లేదా వారు రాక్షసులు/ నిర్దయులు అని మీరు తలిస్తే, సమాజానికి/ లేదా ఇతర సాత్విక పనులకు దానం చేసి, కావాలంటే కొంత ఉంచుకుని, ఉత్త చేతులతో మాత్రమే మా వద్దకు రావలెను. అప్పులు కూడా ఉండకూడదు.

When you come, there is no need to bring a single rupee. Donate the entire amount to your sattvic children or if you think they are demons/ heartless then donate to society/ or other sattvic works, keep some if you want and come to us with clean/ empty hands only. There should also be no debts.

మీ పిల్లలు సాత్వికులు అయితే, ఇంక మా దగ్గరకు ఎందుకు రావడం? వివరణ చెప్పాలి, ఎందుకంటే అక్కడ అనుమానం వస్తుంది కదా. పిల్లలు చెడ్డవారు అన్నప్పుడు, వారికి ధనం ఇవ్వకూడదు. బంధం నిలుపుకో కూడదు, కదా? వారు మీ బంధం వద్దు అంటుంటే, మీరు మాత్రమే బంధం కావాలి అనడం, అర్ధం లేనిది. అర్ధం ఉన్నది అనుకుంటే, వారితోనే ఉండాలి కదా.

If your children are sattvic, why come to us? An explanation must be given, because there will be doubt. When kids are bad, don't give money to them. Shouldn't hold bond, right? If they say they don't want your relationship, but you only want them, that's nonsense. If you think there is meaning, you should be with them.

అటొక కాలు, ఇటొక కాలు, తప్పు - అది రజో, తమో గుణ లక్షణం. మరలా పండక్కి వెళతాము, వారు ఫోన్ చెయ్యాలి అని మీరు కపట నాటకాలు మొదలుపెడితే, ఇక్కడి దాకా రావడం ఎందుకు? వారి ఇంటి పక్కనే షెడ్ వేసుకుని ఉండవచ్చుకదా, రోజు చూడవచ్చు. మిమ్మల్ని బంధం వీడమని ఎవరు అన్నారు? స్తిర ధర్మం ముఖ్యమా, అవసర అవకాశ బంధం ముఖ్యమా మీకు త్రికరణ శుద్దిగా? నిర్ణయం మీదే. ఆశ్రమాలకు వెళ్ళేది, అన్ని మోహాలు బ్రమలు బంధాలు తెంచుకునే కదా?

One leg this side, one leg that side is wrong - it is Rajo Tamo guNa character. If you start hypocritical dramas that you will go to festival again, they will call you, why come here? Maybe you can have a shed next to their house, each day you can see. Who said to untie you? Stira dharma is important or needy oppertunistic bond is important to you by trikaran suddi? The decision is yours. Going to ashrams by leaving all lusts, illusions and bonds, correct?

మీకున్న అన్ని బాధలు, రోగాలు, సమస్యలు, విషయాలు దాచకుండా, ముందే చెప్పాలి. చాటు, కపటం, నాటకం, అహంకారం, లెక్కలేని తనం, 2 నాల్కల ధోరణి ఉండ కూడదు.

All your pains, diseases, problems, things should be told beforehand without hiding them. There should be no hiding, hypocrisy, drama, arrogance, incalculableness, 2 words tendency.

మీ రుజువులు చూపిన తర్వాత, మా అన్నీ విషయాలు ముందే అడిగి తెలుసుకోండి. తర్వాత మేము అలా అనుకున్నాం, ఇలా అనుకోలేదు, అన్న వ్యర్ధ మాటలు వద్దు. ఎవరినీ నిందించడం వద్దు. ఇష్టం లేకపోతే, మౌనముగా మీ ఇంటికి వెళ్ళిపోవడమే. నచ్చితే, చివరి దాకా మనతో ఉండడమే.

After showing your proofs, ask everything about us beforehand. Then don't say, we thought like that, we didn't think like that. Don't blame anyone. If you don't like it, just go to your house in silence. If you like, stay with us till the end.

ప్రతి మనిషికి, సత్వ రజో తమో గుణాలు, మూడు ఉంటాయి. మన ఆలోచనలు మాటలు చేతలలో, అంటే త్రికరణ శుద్దిగా, సత్వ గుణం కనపడాలి ఎప్పుడూ.

Every human being has sattva rajo tamo, three gunas. In our thoughts, words and deeds, by trikaran suddi, should always be pure and sattva should be seen.

ప్రభుత్వ ఉద్యోగం, లక్షల ఆదాయం పించను, వదిలిన మాకు, మీ దగ్గర నుంచి ఏమీ వద్దు. మీరూ ఒక్క రూపాయి ఇవ్వాలి అన్నా, మీ అరిషడ్వర్గ అష్టవ్యసన జయం గురించి సాక్ష్యాలు చూపాలి, అది మీకు కష్టం అని మేము ఏళ్ళుగా అందరికీ చెప్పి ఉన్నాము.

We, who have left the government job and lakhs of income, do not want anything from you. We have been telling everyone that if you want to give one rupee to us, show the evidence about your Arishadvarg Ashtavyasan Jayam, that is difficult for you.

కానీ దానికి ముందు, మీకు గత 5+ ఏళ్ళుగా, మీరు అరిషడవర్గ అష్టవ్యసన బానిసత్వం లో లేరు అని లేదా సాధన చేస్తున్నారని రుజువులు చూపించాలి. ముదుసలి వారికి, సజీవ గురువు సేవ చేసి ఉండాలి, కనీసం 1+ ఏళ్ళు. అప్పుడు మీకు సాధక బాధకాలు తెలిసి ఉంటాయి. మానవత్వం విలువు తెలుస్తుంది. మీకు తెలుగు లేదా ఇంగ్లీష్ వచ్చి ఉంటే, కనీసం అర్ధం అయితే, బాగుంటుంది సమాచార మార్పిడికి.

But before that, you have to show evidence that you are not in Arishadvarg Ashtavyasan slavery or practicing for the last 5+ years. For seniors, should do Seva as living guru Seva, at least 1+ years. Then you will know the pros and cons. Humanity is valued. If you have got Telugu or English, at least understand it, good for communication.

మా సజీవ గురువు సేవ అలాగే అరిషడ్వర్గ అష్టవ్యసన జయ సాధన అర్హత, మీరు ఇంటెర్నెట్ లో వెతకవచ్చు, ఏళ్ళుగా కనపడుతుంది. ArishadVargasadhana.pdf. 10+ ఏళ్ళు పైగా, మేము సజీవ గురువు చేస్తున్నది, ఎక్కడైనా అడిగి తెలుసుకోవచ్చును.

Our living Guru Seva as well as Arishadvarg Ashtavyasan Jaya Sadhana details, which you can search on the internet, is available for years. ArishadVargasadhana.pdf. For more than 10+ years, we are doing living guru Seva, you can ask anywhere.

కనీసం మీ పనులు మీరు చేసుకునేటట్లు ఉండాలి, ముందు మనము అలవాటు పడిందాకా, మీ సాత్వికత అర్ధం అయ్యినదాకా. ఆ తర్వాత, ఇబ్బంది లేదు ఎటూ. తెలిసిన వారి ద్వారా మాత్రమే రావాలి.

At least you should do your work, until we get used to it and understand your sattva Guna. After that, no problem. Should come only through those who know.

అమ్మకు కల్పించే, అన్ని కనీస సౌకర్యాలు కల్పించబడును, సమానముగా. మధ్యతరగతి, గ్రామీణ కనీస సౌకర్యాలతో, పోల్చవచ్చు. మాతో పాటే ఉంటారు, ఎక్కడ అయినా. మేము తిన్నదే తింటారు. మనశ్శాంతితో ఉంటారు, దేవునికి, ఆత్మకు దగ్గరగా ఉంటారు. ధర్మాన్ని మనం కాపడితే, ధర్మం మనల్ని కాపాడుతుంది.

All the minimum facilities provided to the mother are provided, equally. Middle class, with rural minimum facilities, comparable. Stay with us, wherever we are. You eat what we eat. You will be with peace of mind, close to God and soul. If we protect Dharma, Dharma will protect us.

మాతో పాటుగా, ఆరోగ్య, శారీరక, మానసిక సాధనలు చేసేందుకు సిద్దముగా ఉండాలి. మీకు సజీవ గురువు సేవ, అమ్మకు చేసినట్లే అన్ని సేవలు అందును. అమ్మ చేసినట్లే, మీరూ మీకు వీలైన నిత్య సేవ లో, పనులలో, సొంత ఇల్లు మనుషులు అన్న భావనతో పాల్గొనాలి.

Along with us, should be ready to do health, physical and mental exercises. You will receive the living Guru Seva, all the services as done to Mother. Just like mother did, you should participate in daily Seva and work as much as you can, with the feeling that you are the people of your own house.

మైలు దూరం చెయ్యి పట్టి నడిపించడం, గౌరవం మర్యాదా ఆప్యాయత అనురాగం క్రుతజ్ఞత విశ్వసనీయతతో జీవనం, బూట్లు సాక్స్ లు తొడగడం తీయడం, మెతుకులు ఎత్తి తిన్న పళ్ళాలు కడగడం, దేవాలయాలకు కార్యక్రమాలకు తీసుకుని వెళ్ళడం, కాళ్ళు వత్తడం, బీపీ షుగర్ చూడటం, పౌష్టిక మిత ఆహారం, 1 మరియు 2 ఎత్తి పోయడం, ధైర్యం చెప్పడం, జోకొట్టి పాట పాడుతూ జోల పాడడం నిద్రపుచ్చడం, మీరు స్టవ్ లైట్ టాప్ ఆపకపోయినా తలుపు వేయకపోయినా, నడకలో బొట్లు పడినా ఏమీ అనము, మీ బాధలు గాధలు ఓపికగా వినడం, ఆయుర్వేదం, లాంటివి ఎన్నో..

Leading by the hand for a mile walk, respect courtesy affection gratitude faithfulness living, having removing shoes socks, picking up food and cleaning plates, taking people to temples events, pressing legs, watching BP sugar, nutritious food in moderation, lifting 1 and 2, saying courage, Singing jolapata song to make you fall asleep, if you don't turn off the light tap stove, even if you get drops while walking no scolding, listening patiently to your sorrows stories, Ayurveda, etc..

సమయానికి మందులు వేసుకోకపోయినా, సరైన తిండి, కాకర రసాలు లాంటివి తాగక పోయినా, సంస్కారం బాధ్యత మానవత్వం మరచిపోయినా, మందలించడం ఉంటుంది, సంస్కారం బాధ్యత గుర్తు చేయడం జరుగుతుంది.

If the medicine is not taken on time, if the right food and kakara juices are not drunk, if forgets Samskara responsibility humanity, there will be scolding, the Samskara responsibility will be reminded.

ఎన్ని సార్లు చెప్పినా, చేయగలిగి ఉండీ నిర్లక్ష్యముతో బద్దకముతో అహంకారముతో చెయ్యకుండా ఉంటే, వారిని వెనక్క పంపించడం తప్ప ఇంకో మార్గము లేదు కదా? సాత్వికులు అలా ఉండరు, కాబట్టే మీ 5 ఏళ్ళ సాధన అలాగే సజీవ గురువు సేవ మీకు ఆ ఆత్మ బలాన్ని కలిగిస్తాయి. ఇప్పటి నుంచి, మీరూ ఆ ప్రయత్నములో ఉంటారు కదూ?

No matter how many times we say it, if you can't do it because of negligence, laziness and arrogance, there is no other way but to send them back. Sattvic are not like that, so your 5 years of sadhana and living Guru Seva will give you that soul strength. From now on, will you be in that effort?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,978; 104 తత్వాలు (Tatvaalu) and views 226,376
Dt : 24-Mar-2024, Upd Dt : 24-Mar-2024, Category : General
Views : 144 ( + More Social Media views ), Id : 2064 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : avail , living , Guru , seva , satvika , parents , 60 , years , age , needed
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content