పాటతో పరమార్ధం- పీనాసి అయినా సన్నాసి అయినా (పేరడీ) - అహ నా పెళ్లంట - రాజేంద్ర ప్రసాద్, రజని - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,894,058; 104 తత్వాలు (Tatvaalu) and views 227,243.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Peenasi Aina Sannasi ayina (Parody) - Aha Naa Pellanta - Rajendra Prasad, Rajani, Kota Srinivasa Rao, కోట శ్రీనివాసరావు - Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

మన ఒంటికి బట్టలు కట్టే విషయములో, వేమన యోగికి వారసులం? కాదా చెప్పండీ, ఇంట్లో మగవారికి నిండు బట్టలు ఉండలు, సినిమాలో క్లబ్బులలో తిరణాల డాన్సులలో ఆడవారికి అలాగే కురచ బట్టలు లేనిదే ప్రేక్షకులు ఆదరించరు.

కాలేజీ పిల్లలు కూడా అదే పద్దతి పాటిస్తూ, కురచ బట్టలు లేదా చింపుకున్న కంతల బట్టలు వాడుతున్నారు, (కు)సంస్కార తల్లి దండ్రుల మద్దతుతో, అర్ధరాత్రి మజ్జిగ మత్తు అంటూ బారుల చుట్టు తిరుగుతూ.

పొట్టకి తిండి పెట్టే పాయింట్ లో, బాలయోగికి అనుచరులం కొంత మందిమి. లావు అవుతామని లేదా అయ్యామని, సొంత ఇంట్లో తిండి తగ్గించినా, పరాయి ఇంట భోజనం అంటే మాత్రం ఆపుకోలేకపోతున్నారు.

ఇక మిగతావారిని చెప్పక్కరలేదు, వారానికి 14 రోజులు జీవ హింస ముక్క లేనిదే కూడు దిగదు, అనారోగ్యం ఉండదు, ఆస్తులు మిగులుతాయి, ఆసుపత్రులు మూతపడతాయి, డాక్టర్లకు నర్సులకు జీతాలు ఉండవు అని వారి భావన. హోటల్ ల లో కుళ్ళిన దైనా, వారం పాచినదైనా, కల్తీ మసాలా కలిపితే, 10 సార్లు వాడిన పాత నూనె వాడితే, లొట్టలు వేసుకుని తింటారు.

పీనాసి అయినా, సన్నాసి అయినా, ఉన్నవాడే మనిషీ డబ్బు/ జబ్బు ఉన్నవాడే మనిషీ, పీనాసీ సంఘం జిందాబాద్, పిసినారి సంఘం జిందాబాద్, అని ప్రాపంచిక మోహ దాసులు అనుకుంటారు. వీరికి బుద్ది వచ్చే విధముగా ఈ 50 ఏళ్ళలో పెద్దలు ఎంత మంది స్వయముగా చెప్పినా, వీరు మారరు.

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి.

పీనాసి అయినా, సన్నాసి/ సన్యాసి అయినా, ఉన్నవాడే మనిషీ మనశ్శాంతి ఉన్నవాడే మనిషీ, శాంతుల సంఘం జిందాబాద్, త్యాగాల సంఘం జిందాబాద్, అని ఆధ్యాత్మిక దైవ దాసులు అనుకుంటారు.

సహనం ఓర్పు చిత్తశుద్ది గుణం త్యాగం సజీవ గురువు సేవ లేనిదే శాంతి రాదు. ముదుసలి తల్లి దండ్రుల అత్త మామల సేవ లేనిదే మోక్షం రాదు. నక్క పాము పులి కి ఓటు వేస్తే కూడా మోక్షం రాదు. వీటిలోనూ పీనాసి పిసినారి తనమే.

వెన్నుపోటు గుండెపోటు కపటం నటన మోసం ద్రోహం లేకుండా, ధర్మ బద్దముగా, సంపాదించిన ప్రతి రూపాయి ని, పాపాయి లాగా పెంచాలి, అహంకారముతో సినిమాలకు, హోటళ్ళకు, మత్తుకు, మందుకు, మంచం కు వ్రుధా చేయకూడాదు.

అతిధులు వస్తే మైలొచ్చిందని రోగమొచ్చిందని నిండుకున్నదని, అబద్దమాడక తగినంత ఉన్నంత తిండి పెట్టాలి, సాత్వికులను ఆహ్వానించాలి. ప్రాపంచి సంపదలు ఆనందాలు ఎంత కలిగినా, ఇంకా లేదో అని నిత్యం ఏడ్వక, ఆశాంతి తో నిండక, ఎప్పుడు నవ్వి నవ్విస్తూ, అంతో ఇంతో పరులకు ఇస్తుండాలి.

కుటుంబ సభ్యులు పోయినా సరే, మనకు ఉన్నది కదల్చి, దహన సంస్కార తరలింపు ప్రయత్నాలు కార్యక్రమాలు జరపాలి, అంతే గానీ గోఫండ్ లేదా చేతులు చాచి, శవానికి చందాలేవద్దు, కుటుంబ ప్రతిష్టను నేల రాస్తూ, ఎన్ని ఆస్తులు ఉన్నా. చూసారు కదా, మొన్న ఇద్దరు 24 ఏళ్ళ పిల్లలు, షాప్ లో దొంగతనము చేస్తూ దొరికింది.

అరికాళ్ళకే నాడా వేస్తే, చెప్పుల ఖర్చు తగ్గుతుంది అనే మూర్ఖులు ఉన్నారు, కానీ రోగాల ఖర్చు తగ్గదుగా అని వారు గ్రహించలేరు. మేకప్ లేకుండా, సొంత మొఖాలనే చూసుకోలేని నిర్భాగ్యులు. అంత గా కావాలి అంటే, నూనె షాంపు క్రాఫింగ్ ప్రయాణం సమయం ఖర్చు, గుండుతో ఉంటే పొదుపేగా? తిరుపతి మొక్కు కింద బాగానే ఉంటుంది. ప్రాపంచిక మోహాలకు దూరం అవుతాము కదా?

మంగళ సూత్రం పసుపు కొమ్ము దైతే, ఆలుమగల ప్రాణం పోదు గా? ధనం, బంగారం కోసం, సొంత బిడ్డలే చంపుతున్నారు. బయట స్కూటర్ మీద వచ్చిన అగంతకులు, మెడలో గొలుసు కోసం, రోడ్ మీద ఈడ్చుకుంటూ పోతున్నారు. మగ వారికి కనీసం దుస్తులు గా లుంగీ బన్నీ డ్రాయర్ బెస్ట్, మరీ పీనాసిలాగా పేపర్ గోచీ వేస్ట్.

బట్టలు కట్టే విషయములో., వేమన యోగికి వారసులం
పొట్టకి పెట్టే పాయింట్ లో., బా.లయో.గికి అనుచరులం..

పీనాసి అయినా, సన్నాసి అయినా 2
ఉన్నవాడే మనిషీ శాంతి ఉన్నవాడే మనిషీ
శాంతుల సంఘం జిందాబాద్, త్యాగాల సంఘం జిందాబాద్ 2

సంపాదించిన ప్రతి రూపాయి ని, పాపాయి లాగా పెంచాలి,
అతిధులు వస్తే మైలొచ్చిందని, అబద్దమాడక పెట్టాలి.
ఎంత కలిగినా లేదో అని ఏడ్వక.. ఎప్పుడునవ్వి ఇస్తుండాలి.
కుటుంబ సభ్యులు పోయినా సరే, ఉన్నది కదల్చి జరపాలి, శవానికి చందాలేవద్దు.. || పీనాసి||

అరికాళ్ళకే నాడా వేస్తే., రోగాల ఖర్చు తగ్గదుగా.
నూనె షాంపు క్రాఫింగ్ ఖర్చు, గుండుతో ఉంటే పొదుపేగా..
మంగళ సూత్రం పసుపుదైతే, ఆలుమగ ప్రాణం పోదు గా ..
లుంగీ బన్నీ డ్రాయర్ బెస్ట్, పేపర్ గోచీ వేస్ట్ .. ఆ||పీనాసి||

Original

బట్టలు కట్టే విషయములో., వేమన యోగికి వారసులం
పొట్టకి పెట్టే పాయింట్ లో., బా.లయో.గికి అనుచరులం..

పీనాసి అయినా, సన్నాసి అయినా 2
ఉన్నవాడే మనిషీ డబ్బున్నవాడే మనిషీ
పీనాసీ సంఘం జిందాబాద్, పిసినారి సంఘం జిందాబాద్ 2

సంపాదించిన ప్రతి రూపాయి ని, పాపాయి లాగా పెంచాలి,
అతిధులు వస్తే మైలొచ్చిందని, అబద్దమాడి పంపాలి.
ఎంత కలిగినా లేదో లేద అని.. ఎప్పుడు ఏడుస్తుండాలి.
కుటుంబ సభ్యులు చచ్చినా సరే, ఉన్నది కదల్చ కుండాలి, శవానికి చందాలడగాలి.. ||పీనాసి||

అరికాళ్ళకే నాడా వేస్తే., చెప్పులు ఖర్చు తగ్గునుగా.
నూనె షాంపు క్రాఫింగ్ ఖర్చు, గుండుతో ఉంటే ముడుపేగా..
మంగళ సూత్రం ఇత్తడిదైతే, మొగుడుకి ప్రాణం పోదు గా ..
పాంటు షర్ట్ డ్రాయర్ వేస్ట్ , పేపర్ గోచీ పెట్టు.. ఆ||పీనాసి||

1987  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,894,058; 104 తత్వాలు (Tatvaalu) and views 227,243
Dt : 24-Apr-2024, Upd Dt : 24-Apr-2024, Category : Songs
Views : 73 ( + More Social Media views ), Id : 2092 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Peenasi Aina sannasi ayina , Parody , Aha Naa Pellanta , Rajendra Prasad , Rajani , Kota Srinivasa Rao
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content