కార్యేషు దాసీ శ్లోకం లాగ, ఉత్తమ భర్త కార్యేషు యోగీ, శ్లోకం కూడా మనకు ఉందా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,069; 104 తత్వాలు (Tatvaalu) and views 226,385.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మన పూర్వికులు, మనకు ఎన్నో మంచి మాటలు చెప్పారు, అందరు సమముగా బుద్దిగా ఉండాలని, ఇద్దరికీ చెప్పారు సుమా. కానీ, మగవారి శ్లోకానికి ప్రచారం లేదు ఎక్కువగా. ఎందుకంటే, మనము నీతి గా లేకపోయినా, మహిళలు మాత్రమే ఉండాలి అనే, తప్పుడు భావనతో. నీతి శాస్త్రాను సారం, ఉత్తములైన భార్యా భర్తల లక్షణాలు చూడండి. మన ఇంట్లో మగవారికి, అంటే భర్త (లేదా కొడుకు/ తమ్ముడు/ అన్న) ఈ లక్షణాలు ఉన్నాయేమో చూడండి మరి.

** శ్లో॥ కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః - ఉత్తమ భర్త లక్షణాలు ఇవి

-- కార్యేషు యోగీ - పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
-- కరణేషు దక్షః - కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
-- రూపేచ కృష్ణః - రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషం గా ఉండాలి.
-- క్షమయా తు రామః - ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె, క్షమించే గుణం కలిగి ఉండాలి.
-- భోజ్యేషు తృప్తః - భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా, వంకలు పెట్టకుండా తినాలి.
-- సుఖదుఃఖ మిత్రం - సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.

ఈ 6 పనులు సక్రమంగా చేస్తే, ఉత్తమ భర్త/ పురుషునిగా గుర్తింపు పొందుతారు.

** శ్లో॥ కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,
రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,
భోజ్యేషు మాతా, శయనేషు రంభా
షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ. (ఉత్తమ భార్య లక్షణాలు)

-- కార్యేషు దాసీ -వ్పనులు చెయ్యడంలో దాసి లాగా బద్ధకించకుండా పొందికగా, ఒద్దికగా, నిదానంగా పనులు చెయ్యాలి.
-- కరణేషు మంత్రీ - మంచి సలహాలు, సూచనలు అందించడంలో మంత్రిలాగా ఉండాలి.
-- రూపేచ లక్ష్మీ - రూపంలో లక్ష్మీ దేవి లాగా ఎల్లప్పుడూ కళకళలాడుతూ, చిరునవ్వు చిందిస్తూ సంతోషంగా ఉండాలి.
-- క్షమయా ధరిత్రీ - కష్ట సమయాలలో, కుటుంబ నిర్వహణలో భూదేవి అంత ఓర్పును కలిగి ఉండాలి. తొందరపడి ఏ పని చేయకూడదు.
-- భోజ్యేషు మాతా - భోజనం పెట్టేటప్పుడు తల్లి వలె ప్రేమగా పెట్టాలి.
-- శయనేషు రంభా - పడకటింటి లో రంభ లాగా ఉండాలి.

ఈ 6 పనులు సక్రమంగా చేసే స్త్రీ ఉత్తమ స్త్రీగా, ధర్మపత్నిగా కొనియాడబడుతుంది.

ఆలుమగలు ఎలా ఉండాలో మన పెద్దలు చక్కగా చెప్పిన నీతి శాస్త్రం లోని, కార్యేషు దాసీ అనే శ్లోకం పాపులర్ అయినంతగా, కార్యేషు యోగీ అనే శ్లోకం పాపులర్ కాకపోవటానికి, కొంతమంది కుటుంబ విచ్చిన్నకర, భావజాలికుల, నెగటివ్ ప్రచారమే కారణం అంటారు కొందరు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,069; 104 తత్వాలు (Tatvaalu) and views 226,385
Dt : 30-Oct-2020, Upd Dt : 30-Oct-2020, Category : General
Views : 10129 ( + More Social Media views ), Id : 782 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : karyeshu dasi , best wife , shloka , karyeshu yogi , men , ladies , best husband
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content