వైకాపా తెదేపా తరపున అభిమానులు కు, వారి పేరు తో, ఉచిత వాక్సిన్ లు ఇప్పిస్తారా? లేక కేంద్రం దయపై? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,893,018; 104 తత్వాలు (Tatvaalu) and views 227,152.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

వాట్సప్ స్టేటస్ మరువద్దు, 24 గంటల కు మరలా కొత్త సమాచారం.

పశ్చిమ బెంగాల్ సీఎం మమత గారు, ప్రజలకు ఉచిత కోవిడ్ టీకాలు ఇవ్వడానికి అయ్యే, 30 వేల కోట్లు కేంద్రం కు పెద్ద ఖర్చు ఏమీ కాదు, దేశమంతా ఒకే విధమైన వాక్సిన్ ప్రోగ్రాం ఉండాలి, అని నుడివారు, చాలా తేలికగా.

మనది కాకపోతే, ఎంతైనా కొంతే కదూ? ఏమన్నా అర్థం ఉందండి, ఆ మాటలలో.

చంద్రన్న తోఫా, జగనన్నా ఆసరా, తమిళ లాప్ టాప్ లు, బంగ్లాదేశ్ పౌరుల ఆవాసం, తమ సొంత ధనం తో, తమ సొంత కుటుంబ పేర్లు ప్రచారం తో, రాష్ట్రాలు 30 పైగా ఉచిత పధకాలు పెట్టుకుంటే, టీకా కోసం ఆఫ్ట్రాల్ దేశానికి 30 వేల కోట్లు అంటే ఒక రాష్ట్రానికి ఇంకా తక్కువ కాబట్టి, ఉచిత పధకాల రాష్ట్రం కు, ఇది ఒక పెద్ద లెక్క నా? అని తెలుగు రాజకీయ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉచిత ప్రజా పధకాలను, తమ మానిఫెస్టోలో సొంతముగా అందిస్తామని, తమ కుటుంబ పేర్లతో ప్రచారం చేస్తూ,

తమ సొంత ధనము తో లేదా కోట్ల అప్పులతో లేదా తాకట్టు లతో లేదా అమ్మకంతో పెట్టుకుని, ప్రజలకు ఉచితము గా అన్ని అందించే,

ధనిక రాష్ట్రాల కు, ఉచిత వాక్సిన్ ఖర్చు కూడా పెద్ద లెక్క కాకపోవచ్చు, కేంద్రము తో పని ఏముంది? అంటున్నారు రాజకీయ అభిమానులు.

ఉచిత పంచుడు పధకాలకు, కేంద్రం అనుమతి అవసరం లేనప్పుడు, వాక్సిన్ కూడా, ఉచితము గా వేయవచ్చు రాష్ట్రాలు, కేంద్రాన్ని దేబిరించేదేముంది, మనం అంటున్నారు.

దాదాపుగా 30 పైగా ఉచిత పధకాలు ఇస్తున్న మనం, ఒక ఉచిత కోవిడ్ టీకా పధకం ఇవ్వలేమా, 18 నుంచి 45 వయస్సు వారు కు, వెంటనే? లేక మన వర్గం వారి కంపెనీ ఇంకా మొదలు పెట్టలేదా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

మిగతా వయస్సు లకు, ఎటూ కేంద్రం ఉచితంగా ఇస్తుంది కదా అంటున్నారు, వైకాపా మరియు తెదేపా అభిమానులు.

జనసేన బీజేపీ కి బుద్ధి వచ్చే, పని చేయాలి మనం అంటున్నారు, కేంద్ర సహాయం లేకుండా, అడగకుండా అంటున్నారు.

వైయస్సార్ జగనన్న ఉచిత కోవిడ్ వాక్సిన్ 2 డోసులు, అని పార్టీ తరపున ధనం సేకరించి, వైకాపా అభిమానులు కు అందించవచ్చు, ఉచితంగా జూన్ నెలలో నే. దేశానికి ఆదర్శంగా నిలవచ్చు అంటున్నారు, వైకాపా అభిమానులు.

అలాగే తెదేపా కూడా పార్టీ తరపున విరాళాలు సేకరించి, ఉచితంగా టీకాలు, చంద్రన్న లోకేష్ ఉచిత టీకా ప్రతిపక్ష పధకం కింద, తమ ఆసుపత్రుల ద్వారా, తమ తెదేపా అభిమానులు కు, ఇవ్వవచ్చు అంటున్నారు, చంద్రన్న బాలయ్య అభిమానులు ఆవేశంతో.

ఇక వైకాపా తెదేపా అభిమానులు అనుచరులు, సానుభూతి పరులకు ఉచితంగా, టీకాలు అందితే, అంటే 80 శాతం మందికి అందితే, మిగిలిన అతి తక్కువ మంది 20 శాతం కి, రాష్ట్రం ఉచిత టీకా పధకం అందించవచ్చు కదా తక్కువ భారము తో అంటున్నారు, ఇరు అభిమానులు.

ఇక స్టిక్కర్ సీఎం అనే మాట, మన చంద్రన్న కు లేదా జగనన్న కు వర్తించదు అని, బీజేపీ వారికి గట్టిగా చెప్పవచ్చును అని అభిమానులు ఆనందం. ఇక వీర్రాజు, జీవీఎల్ తదితరులు, స్టిక్కర్ తో మనల్ని గేళిచేయలేరు అంటున్నారు.

కాబట్టి అభిమానులు, తమ పట్టణ గ్రామ నాయకులు తో మాట్లాడితే, వారు ఎమ్మెల్యేలు ఎంపీలు అధిష్ఠానం తో మాట్లాడి, వైకాపా మరియు తెదేపా తరపున, ఉచిత వాక్సిన్ లు ఇప్పిస్తారని, అభిమానులు ఆశిస్తున్నారు.

మరి ఏ పార్టీ, ఏ నాయకులు, ఏ దాత ముందుకు వస్తారో లేక మాకెందుకు ఈ తలనొప్పి అని, ఇక పధకాలు కు కుటుంబ పేర్లు తీసేస్తారో చూద్దాం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,893,018; 104 తత్వాలు (Tatvaalu) and views 227,152
Dt : 08-May-2021, Upd Dt : 08-May-2021, Category : Politics
Views : 782 ( + More Social Media views ), Id : 1163 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : vaccine , ycp , jagan , tdp , chandranna , mercy , center , bjp , modi , bengal , mamata
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content