పాటతో పరమార్ధం - జీవన తరంగాలు - పుట్టినరోజు పండగే అందరికి, పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి? - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,890,585; 104 తత్వాలు (Tatvaalu) and views 226,979.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Everyones birthday is celebrated, who knows why they were born? Jivana Tarangalu - Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

*పాటతో పరమార్ధం- రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ - నా పేరు బికారి, తోటకు తోబుట్టువును, కూటికి నే పేదను, గుణములలో పెద్దను*

10 ఏళ్ళ లోపు పిల్లలకు పుట్టిన రోజు పండుగలు ఓ సరదా, ఓ సంబరము, ఓ ముచ్చట. కానీ 20 ఏళ్ళు దాటిన వారు కూడా, ఏదో జీవితము లో సాధించేసాము అని, రాత్రి పార్టీలు డాన్సులు కేకులు, మత్తులో అవి ఇవి పగలకొడతారు. సరే వారు కుర్ర వయసు అనుకుందాము.

మరి 30 దాటిన వారు? వీరైనా, ఆలోచన చెయాలి, ఏమి సాధించాము? మంచి ఉద్యోగమా? మంచి సంపాదనా? మంచి గుణమా, వ్యక్తిత్వమా? గుణ భాగస్వామా? గుణ పిల్లలా? ఏమినా త్యాగాలా? ముదుసలి తల్లి దండ్రి అత్త మామ సేవనా? పోనీ నిస్వార్ధ సమాజ సేవనా?

మన పుట్టిన రోజున, మనము ఒక్కరమే సంబరాలు చేయాలా? లేక ప్రపంచము మొత్తము వేడుకలు జరపాలా? ఉదాహరణకు మీరు మే 1 న పుట్టారు అనుకోండి, సగము ప్రపంచము, కార్మిక దినోత్సవ సంబరాలు చేసుకుంటారు. తోటి కార్మికుడు పుట్టారు, దేశానికి సమాజానికి సేవ చేస్తారు, మార్గ దర్శి అవుతారు అని. మరి ఆ రోజున పుట్టిన అందరూ, ఆ విలువ కాపాడతారా?

మాల్యా లాంటి వారు మంచి వ్యాపారం చేసి, కోట్లు వెనకేసి, అప్పులతో ముంచి, బాగా సంపాదించి, చివరకు దేశం వదిలి పారిపోయారు, ఎందుకు? అలాంటి వారు ఎందరో, ఇంకా దేశం లో అధికారం చాటున నక్కలా దాంకుని ఉన్నారు. మంచి గుణము లేకనే కదా? తమ కన్న తల్లి తండ్రులకు కూడా తలవంపు తెచ్చారు. ఇక పిల్లలు ఎంత ఉత్తములు?

గుణం విలువ, మనకు పెద్దలు తెలియ చెప్పారు, తమ జీవితాలను పణం గా పెట్టి - రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి.

అసలు ఎందుకు పుట్టాము, ఏమి చేస్తున్నాము? మనము తిని పడుకోవడానికా? లేదు స్వార్ధము కోసము గుణం లేని పెళ్ళి చేసుకుని, తల్లి దండ్రులకే పనికి రాని లేదా వారినే తుంచే, పాపపు సంతానాన్ని పెంచి, భూమాత భారాన్ని పెంచి, అష్ట వ్యసనాలకో, ఓ సునామీ కో, భూకంపాని కో, కరోనా పరంపర కో, బలి ఇవ్వడానికా? నక్క పులి పాము కు ఓటు వేసి, వారి చేతిలో వారి పన్నుల చేతిలో బలి అవ్వడానికా?

అంటే ఎంత డబ్బు అధికారం ఐశ్వర్యం ఉన్నా కూడా, నమ్మకమైన గుణం కలిగిన వ్యక్తి మన వెంట లేక పోతే, ఆ ధనమే మన పాలిట శాపం అవుతుంది. ధనాన్ని ఎక్కడైనా దాచుకోవాలి, ఎప్పుడు ఎవరైనా దోచుకోవచ్చు. కానీ గుణాన్ని దోచుకోలేరు, కదా?

అలాంటి గుణం వారికోసం స్నేహము చేయాలి, వారిని వెతికి పట్టుకోవాలి, వారి అడుగు జాడలలో నడవాలి, అండగా ఉండాలి, అండ ఉంచుకోవాలి. అందుకే పేదవారికి ఎక్కువ మమతలు ఉంటాయి అంటారు. మంచి గుణం ఉన్న హ్రుదయం, దైవ మందిరములా మనశ్శాంతిని ధైర్యాన్ని ఇస్తుంది భవిష్యత్ పై.

అందుకే మంచి గుణము తో, అరిషడ్వర్గాలను జయించాలి, కనీసం ప్రయత్నము చెయ్యాలి. పువ్వు పుట్టి రాలి పోతే, ఉపయోగము లేదు, జడ లోకి వెళితే సాధారణ ఉపయోగం, కానీ గుడిలోకి వెళితే, జన్మ ధన్యం. ముత్యం సముద్రము లో ఉంటే, ఉపయోగం లేదు, హారము లో ఉంటే, దానికి మంచి స్థానము వచ్చినట్లు.

అలాగే పుట్టిన ప్రతి మనిషి, తాను ఎందుకు పుట్టాను, ఏమి సాధించాను, ఎవరికి మంచి చేసాను, సొంత ఊరికా? కనీసం తనకు తనకైనా మంచి చేసాడా? ముదుసలి తల్లి దండ్రులకైనా అండ గా ఉన్నాడా? మనసును జయించాడా?

అలాగే, తెలిసిన నలుగురికి మంచి చేస్తూ లేదా పంచుతూ, కనీసం వారానికి పలకరిస్తూ క్షేమం కోరితే సంస్కారము పెంచితే, అందరూ దేవుని బిడ్డలు అని అంగీకరించినట్లు. సొంత స్వార్ధము కొంత మానుకుని, పొరుగు వారికి అదే మానవ సేవయే మాధవ సేవ గా పరిగణించబడుతుంది. మనమున్నా లేక పోయినా, మన పేరు నిలబడుతుంది.

కానీ అందరము ఇప్పుడు బీజీ అండి, మా కుటుంబము లోనే ఎవరము రోజూ మాట్లాడుకోము, ధన పిచ్చిలో పడి అంటున్నారు, సెల్ ఫోన్ నెట్ వచ్చాక, దూరాలు మరీ పెరిగిపోయాయి. వీలైనంత వరకు, ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నము చెద్దాము, ఓడిపోయినా, ఆ పుణ్యం మనతో ఉంటుంది. తర్వాత ఉత్తమ లోకాలకు మార్గము ఉంటుంది సుమా.

మనము వేడుకలు చేసుకోక పోయినా, మనము భూమిపై పడిన రోజు, మే 1, ప్రపంచములో సగము జనాభా/ దేశాలు కార్మిక దినోత్సవముగా సంబరాలు చేసుకుంటుంది. మరి అరిషడ్వర్గాల సాధనలో ఎన్ని అడుగులు వేసామో, కనీసం 10 ఏళ్ళ సజీవ గురువు సేవ గా తల్లి దండ్రుల సేవైనా, 4 వ సంవత్సరం అమ్మ పాద పూజ, సనాతన ధర్మ ప్రచారమైనా, దైవ సేవ అయినా, 235 వారాల 108 ప్రదక్షిణలైనా, 164 వారాల శని ఉపవాసం అయినా, శాఖాహారమైనా, నేల చాప నిద్ర అయినా, పదేళ్లు గా శనివారం శివ శనులకు నిమ్మ నేతి దీపం 20 వత్తులు ఉదయం పది లోపు అయినా, తెలుగు భాష సేవ అయినా, 1900+ కధనాలు 500+ పాటలు పద్యాలు శ్లోకాలు అయినా, 51 నెలల శిరోముండనం అయినా, 16+ ఏళ్ళు కమ్యూనిటీ సామాజిక సేవ 800+ సాంప్రదాయ ఈవెంట్‌లు/చిన్న వ్యాపారాలు/సంప్రదాయ స్థలాల సందర్శనను ప్రోత్సహించడానికి ఉచిత చిత్రాలు/వీడియోలు/ప్రచారం, 119 వ వారం జలనేతి మరియు ఆలయానికి ప్రసాదం అయినా, ఊరు కోసం కనీసం ప్రయత్నము అయినా చేసామో లేదో, పెద్దలు గురువులు మీరే చెప్పాలి.

సమస్యలు వినడం, ఓదార్చడం, ఇతరులను ప్రోత్సహించడం, భవిష్యత్ కష్టాల నుండి విముక్తికి.

17 నో (లేదు) లు - మనసును & ప్రతిదీ నియంత్రిస్తుంది, నిజం కదూ? బ్రతకడం కోసమే కనీసం తినాలి, ఆస్వాదించాలి? - కొన్ని ఉదాహరణలు - బయట ఆహారం లేదు (హైబ్రిడ్ కెమికల్ ఫుడ్ - సంకరజాతి రసాయనాల తిండి), ఆల్కహాల్ లేదు (శీతల/హార్డ్ డ్రింక్ లేదు), డ్రగ్స్ లేదు, పొగ లేదు, అప్పు లేదు (మనకున్న దానితో సంతోషంగా ఉండాలి), ఆభరణాలు అలంకారాలు లేవు (గుణం ఆభరణంగా ఉండాలి), మేకప్ లేదు (ఇన్/లోపల మరియు అవుట్/బయట ఒరిజినల్‌గా ఉండాలి).

పుట్టినరోజు పండగే అందరికి, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి
పుట్టినరోజు పండగే అందరికి, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి, ఎందరికి ఎందరికి

కలిమికేమి వలసినంత ఉన్నా, మనసు చెలిమి కొరకు చేయి చాచుతుంది
ఆ మనసే ఎంత పేద దైనా, అనురాగపు సిరులు పంచుతుంది
మమత కొరకు తపియించే జీవనం 2
దైవమందిరంలా పరమపావనం

పుట్టినరోజు పండగే అందరికి మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి ఎందరికి ఎందరికి

పువ్వెందుకు తీగపై పుడుతుంది, జడలోనో గుడిలోనో నిలవాలని
ముత్యమేల కడలిలో పుడుతుంది, ముచ్చటైన హారంలో మెరవాలని
ప్రతి మనిషి తన జన్మకు, పరమార్థం తెలుసుకొని 2
తన కోసమే కాదు, పరుల కొరకు బ్రతకాలని 2
తానున్నా లేకున్నా 2 తన పేరు మిగలాలి

పుట్టినరోజు పండగే అందరికి మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి ఎందరికి

పుట్టిన రోజు పండగే వీడియో సాంగ్, జీవన తరంగాలు సినిమా, శోభన్ బాబు, కృష్ణంరాజు, వాణిశ్రీ

Puttina Roju Pandage Video Song, Jeeevana Tarangalu Movie, Sobhan Babu, Krishnamraju, Vanisree  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,890,585; 104 తత్వాలు (Tatvaalu) and views 226,979
Dt : 24-Apr-2022, Upd Dt : 24-Apr-2022, Category : Songs
Views : 994 ( + More Social Media views ), Id : 1366 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : puttinaroju , birthday , jeeevana , tarangalu , songs , sobhan , krishnamraju , vanisree
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content