పాటతో పరమార్ధం - చెట్టులెక్కగలవా ఓ నరహరి (పేరడీ) - చెంచు లక్ష్మి - ఏఎన్ఆర్, అంజలి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,728; 104 తత్వాలు (Tatvaalu) and views 226,444.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Chettulekkagalava O Narahari (Parody) - Chenchu Lakshmi - ANR, Anjali

నరశిమ్హావతారములో ఉగ్ర రూపములో ఉన్న, స్వామి వారిని, చల్ల బరచడానికి, అమ్మ వారు చెంచులక్ష్మి గా వచ్చి, ఆయనను ఆటపట్టిస్తూ, పాడిన అసలు పాట. అలాగే మనకు బ్రమలు అజ్ఞానము కూడా వదిలేటట్లు, మన పెద్దలు మన తల్లి దండ్రులు, మన కోసం పాడితే ఎలా ఉంటుందో ఈ పాట చూడండి.

చెట్టులెక్కగలవా ఓ నరహరి, పుట్టలెక్కగలవా, చెట్టులెక్కి, ఆ చిటారుకొమ్మల, చిగురు కోయగలవా, ఓ నరహరి, మా లో ఉన్న అజ్ఞానం తీయగలవా?

ఏదైనా సాధన చేయనిదే తేలికగా రాదు అని ఇక్కడ గూఢార్ధం. వాక్సుద్ది చిత్తశుద్ది ఉంటే, ఏ పూజలు వ్రతాలు అవసరము లేదు. భక్త కన్నప్ప, తన కన్ను తీసి ఇచ్చేసారు. మరి మనం? ఇతరులకు అన్నం దొరకకుండా ఆహారం ఆపుతాము బస్తాలకు బస్తాలు, కపట నాటక 2 నాల్కల కల్తీలు చేసి కోట్లు గడిస్తాము, ఇళ్ళు దొరకకుండా ఇళ్ళు స్థలాలు ఆపుతాము ఎకరాలకు ఎకరాలు. కాబట్టి మనకు మానసిక నియంత్రణ సాధన కావాలి కదా?

మరి ఆయన ఏమంటున్నారో చూడండి - చెట్టులెక్కగలము, ఓ చెంచిత పుట్టలెక్కగలము, చెట్టులెక్కి, ఆ చిటారు కొమ్మల, చిగురు కోయగలము, అలాగే మీలో ఉన్న బ్రమలు తీయగలము.

సర్వాంతర్వామికి, మన సంచిత పాపాలు, ప్రాపంచిక బ్రమలు మోహాలు తీసేయడం, క్షణం లో పని.

ఈ మోహ వ్యామోహాలతో పతనమేల, ఇంక చాలు ఈ చక్ర బంధాలు, మరుజన్మవద్దు, మోహంను వీడలేవా, ఓ మానవ చెంచిత, సాధన చేయలేవా? అని ఆయన సరదాగా అంటే,

మరి అమ్మ వారు, అలాగే స్వామీ మీ మనసు తెలుసుకుని, మరులు చూపుతూ, సాధనతో సాధిస్తా, ఓ నరహరి, తోటలో పూలతో మాల కట్టి, తెచ్చి వేస్తాను అని, పరి పూర్ణ సమర్పణతో జవాబు.

చెట్టులెక్కగలవా ఓ నరహరి, పుట్టలెక్కగలవా 2
చెట్టులెక్కి, ఆ చిటారుకొమ్మల, చిగురు కోయగలవా
ఓ నరహరి, అజ్ఞానం తీయగలవా

చెట్టులెక్కగలము, ఓ చెంచిత పుట్టలెక్కగలము 2
చెట్టులెక్కి, ఆ చిటారు కొమ్మల, చిగురు కోయగలము
ఓ చెంచిత, బ్రమలు తీయగలము

చరణం: 1
ఉరకలేయగలవా, ఓ నరహరి, పరుగులెత్తగలవా 2
ఊడ పట్టుకుని, జారుడు బండకు
ఊగి చేరగలవా, ఓ నరహరి, శాంతి నీయగలవా

ఉరకలేయగలము ఓ చెంచిత, పరుగులెత్తగలము 2
ఊడపట్టుకుని, జారుడు బండకు, ఊగి చేరగలము
ఓ చెంచిత, మోక్షం చేర్చగలము

చరణం: 2
ఓ హొయ్
గురిని చూసుకొని, కనులు మూసుకుని
బాణమేయగలవా, ఓ నరహరి, మాగురువులాగనే
గురిని చూసుకొని, వెనుతిరిగి నాణ్యముగ
బాణమేయగలము, ఓ చెంచిత, ధ్యానమీయగలము
ఓ చెంచిత, ఆత్మ జ్ఞానమీయగలము

చెట్టులెక్కగలము, ఓ చెంచిత పుట్టలెక్కగలము
చెట్టులెక్కి, ఆ చిటారు కొమ్మల, చిగురు కోయగలము
ఓ చెంచిత, బ్రమలు తీయగలము

చరణం: 3
ఓహో...
పతనమేల మరుజన్మవద్దు, మోహంను వీడలేవా
ఓ చెంచిత, సాధన చేయలేవా

మనసు తెలుసుకుని, మరులు చూపుతూ
సాధనతో సాధిస్తా, ఓ నరహరి 2, మాల తెచ్చివేస్తా

చెట్టులెక్కగలవు ఓ నరహరి, పుట్టలెక్కగలవు
చెట్టులెక్కి, ఆ చిటారుకొమ్మల, చిగురు కోయగలవు
ఓ నరహరి, అజ్ఞానం తీయగలవు

Arudra, Ghantasala, Jikki  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,728; 104 తత్వాలు (Tatvaalu) and views 226,444
Dt : 01-Sep-2023, Upd Dt : 01-Sep-2023, Category : Songs
Views : 214 ( + More Social Media views ), Id : 1901 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Chenchu , Lakshmi , Chettulekkagalava , Narahari , ANR , Anjali
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content