పాటతో పరమార్ధం - లేచింది నిద్ర లేచింది (పేరడీ) - గుండమ్మ కథ - ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, జమున - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,883,480; 104 తత్వాలు (Tatvaalu) and views 226,487.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Lechindi nidra lechindi (Parody) - Gundamma Katha - NTR, ANR, Savitri, Jamuna

తరం తరం మారే కోద్దీ, మానసిక బలహీనం ఇంకా పెరుగుతున్నది, మానవత్వం కుంగిపోతున్నది. ఎందుకంటే, కలియుగ అంతానికి చేరాలి. మనిషిని మనిషే దారుణముగా, వెంటపడి వేధించే, సంస్క్రుతి నేడు చాటుగా ఉన్నా, ఇక విచ్చల విడి తనానికి వస్తుంది.

క్షణము లో కోట్లు సంపాదించాలి, వెన్నుపోటు పన్నుపోటు రక్తపోటు ఏదైనా సరే, అది అమ్మ నాన్న అన్న చెల్లి అయినా, పైసా లోనే పరమాత్మ అంటున్నారు. సెల్ ఫోన్ కొనకపోతే, చస్తాము లేదా చంపుతాము అంటున్నారు. అంటే ఎంత చిన్న విషయానికైన, ఎంత పెద్ద తప్పుడు దోవలో వెళడానికి సిద్దముగా ఉన్నారు.

అప్పుడు మనలో మనకే నమ్మకము పోతుంది, ఇక ఇంట్లో సొంత వారినే నమ్మలేము. మరి అలాగే పతనము అవుదామా?

లేక ఇప్పటికైనా సాధనలు మొదలు పెట్టి, ఆత్మను పరమాత్మతో కలుపుదామా, మన ఇష్టం. మానసిక బలం చైతన్యమునొందితే, మోహాలు బ్రమలు దూరం అవుతాయి, మనకు నిజమైన మిత్రులు ఎవరో తెలుస్తుంది.

ఎపుడో వేమనగారు, అపుడే బ్రహ్మం గారు, ఎపుడో భగవద్గీత, అపుడే మహా భారతం, ఎంతో మంది, ఎన్నో విధాలుగా, కేవలం మన సనాతన ధర్మం లో నే చేప్పారు, మానసిక నియంత్రణ ఎలా సాధన చెయ్యాలి అని.

మరి ఇపుడే చెబుతా, ఇనుకో జీవాత్మా, అంటే వినే ఆచరించే, సంస్కార పెంపకం మనలో ఉందా? మన పిల్లలలో ఉందా? లేకపోతే నష్టం ఎవరికి? మనకా, మీకా, పరమాత్మకా?

మోహ ఆస్తుల ప్రాప్తి కోసం, భాగస్వామితో గుణ పెళ్ళి కాకుండా ధన వీసా ఆస్తి పదవి అధికారం లూటీ వేసి, ఒళ్ళు కదలక బరువు తగ్గక, అనారోగ్యాలతో భేటీ వేసి, అప్పుల బతుకు జోలే పట్టీ, సంపాదనలో త్రుప్తిని వదలి, ముదుసలి పెద్దల బాధ్యత మరచారు, కడుపున పుట్టిన పిల్లల సంస్కారం విడిచారు.

ఒక్క సంస్కార తల్లి దండ్రులు ఉన్నారా, మేము మా పిల్లల దగ్గర, మా ముదుసలి వయసులో, దేవతలు గా పూజింపబడతాము, ఇంట్లో పెట్టుకుని సమాన వైద్యం మరియు ఇతర సౌకర్యాలు తో అని ధైర్యముగా చెప్పడానికి? ఎంత మంది ఉన్నారు చెప్పండి, 20 శాతం కనీసం?

కాబట్టి ఇప్పుడైనా, లేపండి నిద్ర లేపండి, నిద్ర లేపండి, మానసిక బలం, స్తిరత్వం, వాక్సుద్ది, చిత్తశుద్ది, మానసిక శారీరక సాధన.

లేపండి నిద్ర లేపండి, మానసిక బలం
దద్దరిల్లాలి, బ్రమల ప్రపంచం
లేపండి మానసిక బలం

ఎపుడో చెప్పెను వేమనగారు, అపుడే చెప్పెను బ్రహ్మం గారు
ఎపుడో చెప్పెను భగవద్గీత, అపుడే చెప్పెను మహాభారతం
ఇపుడే చెబుతా, ఇనుకో జీవాత్మా.... ఆ ఆ 2
శీనయ్య చెప్పిన వేదం కూడా
లేపండి, మానసిక బలం

పల్లెటూళ్ళలో పంచాయితీలు, పట్టణాలలో ఉద్యోగాలు
పల్లెటూళ్ళలో పాడిపంటలు, పట్టణాలలో వ్యాపారాలు
అది ఇది ఏమని అన్ని రంగముల... అది ఇది ఏమని అన్ని దేశములా
అరిషడ్వర్గంలో ముంచారు, అష్టవ్యసనాలను పెంచారు
లేపండి, మానసిక బలం

మోహ ఆస్తుల ప్రాప్తి కోసం, భాగస్వామితో లూటీ వేసి
ఒళ్ళు కదలక బరువు తగ్గక, అనారోగ్యాలతో భేటీ వేసి
అప్పుల బతుకు జోలే పట్టీ..ఈ..ఈ..ఈ. సంపాదనలో త్రుప్తిని వదలి,
పెద్దల బాధ్యత మరచారు, పిల్లల సంస్కారం విడిచారు

లేపండి నిద్ర లేపండి, నిద్ర లేపండి, మానసిక బలం
దద్దరిల్లాలి, బ్రమల ప్రపంచం
లేపండి మానసిక బలం

Singer : Ghantasala; Lyrics : Pingali Nageswara rao; Music : Ghantasala  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,480; 104 తత్వాలు (Tatvaalu) and views 226,487
Dt : 01-Sep-2023, Upd Dt : 01-Sep-2023, Category : Songs
Views : 206 ( + More Social Media views ), Id : 1902 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Lechindi nidra lechindi , Parody , Gundamma Katha , NTR , ANR , Savitri , Jamuna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content