Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
ఓం నమో నారాయణాయ, ఓం కరోనా గురవేనమః. అందరం బాగుండాలి. మంచి విన్నా, చూసినా, చేసినా పుణ్యం. ఇదీ సత్సంగమే. ఇవి అందుకునే ప్రతి ప్రాణికి దైవ రక్ష కలగాలి.
అయోధ్యలో, ఆనాటి చక్రవర్తి రామయ్య కుటుంబానికి, ఒక ఇల్లు ఇన్నేళ్ల కు, అద్వానీ, మోడీ, యోగీ, కారణమైన అందరూ ధన్యులు. రామయ్య తండ్రి మాటకోసం, రాజ్యం వదిలారు, సుగ్రీవ విభూషణులకు రాజ్యం ధారాదత్తం చేశారు, స్నేహపూర్వకంగా.
ఈనాటి భార్య లేదా భర్త తమ స్వార్థం మోహం కోసం, తల్లి దండ్రులు ను గాలికి వదిలేస్తున్నాం. స్నేహితులు కు కష్టం లో మంచి చేయాలంటే కనీసం పలకరించాలన్నా, నాకేంటి అని ఆలోచన అహంభావం తో ఆగిపోతున్నాం. రామాంజనేయులు మధ్య నిస్వార్ధ అభిమానం ప్రేమ తప్ప, వ్యవహార వ్యాపార లావాదేవీలు లేవు. కృష్ణుడు అటుకులు తో, అంతులేని సంపద ఇచ్చారు కుచేలుడు కి, ఏమీ ఆశించలేదు.
అయోధ్యలో, రామయ్య దర్శనం కు వచ్చే ఆంధ్రా ప్రజలకు, ఒక స్ధలం కేటాయించమని కోరుతూ ఉత్తర ప్రదేశ్ సీయెం యోగీ తో మాట్లాడమని, మన ముఖ్యమంత్రి కి లేఖ రాశారు, బీజేపీ వీర్రాజు గారు. కర్ణాటక ముఖ్యమంత్రి, ఆల్రెడీ యోగీ కి, ఉత్తరం రాశారు. యోగీ అత్యుత్తమ సీఎంగా నంబర్ వన్, మన సీఎం 3, కేసీఆర్ 9 వ స్ధానం సంపాదించారు సర్వే లో ఈ నెల. ప్రపంచ ఆరోగ్య సంస్థ, పదేళ్లు దాకా కరోనా గురువు తో ఇంతే సర్దుకోవాలి, మందూ కష్టమే అంటుంది. ఇప్పుడు అయినా మనం మారాలి, గురువు గారూ.
ఇంట్లో 75 ఏళ్ల అమ్మ పాద పూజ ఎప్పుడు లాగనే, మంత్రోచ్ఛారణతో. ఎప్పుడు లాగనే శివ శనైశ్చర నేతి దీపం, అమ్మ తూలి పడకుండా, చేయి పట్టి 9 నవగ్రహ ప్రదక్షిణలు. ఏళ్లుగా, హాల్లో తులసి కార్తీక దీపం రెండు పొద్దులా.
ఆ భగవంతుని దయ వలన, 44 వ వారం, 108 ప్రదక్షిణలు, పరగడుపున, ఉదయం 10 లోపు, కరమాల వేళ్ళ గీతల లెక్క తో, ఓం నమో నారాయణ ఉచ్చారణ తో, ఉత్త పాదాలతో, గంట 15 నిమిషాల లోపు, 3క్ష్3 గది విస్తీర్ణం లో తిరిగే భాగ్యం కలిగించారు. కరోనా జాగ్రత్తలు తో ముక్కు మూతి కవచం తో, భౌతిక దూరం కూడా.
శనివారం వెంకన్న కు స్నానం చేపిస్తూ, పూజారులు హరతి ఇస్తుంటే వేదోచ్ఛారణ తో, కమ్మటి సాంబ్రాణి వాసనతో, ఆయనకు భక్తులకు, కాపలా సేవకుడి లా గంట, నేను చుట్టూ తిరుగే భాగ్యం కలిగించి, నన్ను వానకి చలికి ఎండకి పడిపోకుండా ఇన్నాళ్ళు, తగిన శక్తిని ఇచ్చే, ఆ తండ్రి దేవదేవుని రుణం ఏవిధంగా తీర్చుకోగలము. కన్నీళ్ళు తో తప్ప.
మీ పెద్దలు కు మీరు లేదా పిల్లల తో మీకు పాద పూజ భాగ్యం కలిగించి, మాకు చూసే భాగ్యం కలిగించి, స్నేహితులు బంధువులు పిల్లల కు, అలవాటు చేసే ప్రయత్నం చేస్తారని, చేతులు జోడించి విన్నపము, గురువు లు అందరికీ. సంస్కారం కు తొలిమెట్టు మన ఇంట్లో మన ధర్మ ఆచరణలో. ధ్యానం, ప్రదక్షిణ, వేద ఉచ్చారణ తో, . . .
మీ కన్నా చెడ్డ వాడిని, పాపాలు పోవడానికి ఇవి చేస్తున్నా అనుకున్నా, పుణ్యాత్ములైన మీరు చేస్తే, ఇంకా రెట్టింపు పుణ్యం కదా.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,919,446; 104 తత్వాలు (Tatvaalu) and views 229,450
Dt : 07-Aug-2020, Upd Dt : 07-Aug-2020, Category : General
Views : 857
( + More Social Media views ), Id : 638
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
pradakshina ,
ayodhya ,
ramayya ,
yogi ,
saturday ,
venkanna ,
sani ,
mother ,
pada ,
puja
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments