Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
1* చంద్రన్న లాగా దొంగ చాటుగా అక్రమంగా ఎమ్మెల్యే ల ను తీసుకోము. రాజీనామా చేయించి మాత్రమే రాజమార్గంలో ఆహ్వానం, ఎలక్షన్ కు ముందు జగనన్న.
అనుబంధ సభ్యులు గా పక్క దోవ లో చేర్చి, పుత్రుల కు కండవా కప్పి, ఊరు పెత్తనం ఇద్దాం, అని జగనన్న ను తప్పు దోవ పట్టిస్తున్న, అనుచరగణం.
ఒకాయన కాణీ కట్నం తీసుకోలేదు దైవ సాచ్చిగా, పొలం మాత్రం రాసారు అని చిన్నగా అన్నారంట. కట్నం తీసుకోనట్టే కదూ మిత్రమా?
2* కేంద్రం ఆంధ్ర కి ఇచ్చిన విద్య, వైద్య, రక్షణ మరియు ఇతర రంగాలకు చెందిన వివిధ సంస్థలను మంజూరు చేసి, వాటిలో సుమారు 15 సంస్థలు 90% నిర్మాణాలు పూర్తి చేసుకుని, కార్యాచరణకు సిద్దమవుతున్న తరుణంలో, మంగళగిరిలో నిర్మించిన (ఎయిమ్స్) ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను, ఇతర సంస్థలను, సోము వీర్రాజు గారు సందర్శించడం జరిగింది - శభాష్ కేంద్రం.
3* గతంలో శ్రీవారిని దర్శించుకున్న వేళ సోనియా, వైయస్ డిక్లరేషన్ లో సంతకం చేయలేదని, అయినా పెద్దగా బంధువుగా దగ్గర ఉండి చనువుతో, గతం లో కలాం చేసారని చెప్పి, ఆదర్శముగా దేవాలయ సాంప్రదాయాన్ని గౌరవించి, జగన్ చేత సంతకం చేయిస్తాను. ఇకనుంచి దీనిని పటిష్టముగా అమలు చేస్తాను. ఇడుపలపాయ ఏటి వర్ధంతి లో కూడా, హిందూ సాంప్రదాయం ప్రకారం, శ్రాధ్ధ కర్మ చేయించి తర్పణాలు వదులుతాము, అప్పుడే దంపతులము వెళతాము, టీటీడీ పదవిలో ఉన్నంత కాలము అని చెపితే, హుందాగా ఉండేది చైర్మన్ గారు. ప్రజలు జేజేలు పలుకుతారు.
4* తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలను బాండ్ల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం వద్ద వుంచాలని పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని, బిజేపి తీవ్రంగా వ్యతిరేకిస్తూందని, వడ్డీ వ్యాపార సంస్థ కాదని - ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి
5* విద్యార్థులు ప్రారంభ దశలో, మాతృభాష లోనే బోధన చేయడం, భారతదేశ బావితరాలకు గొప్ప శక్తినిచ్చినట్లవుతుందని పేర్కొన్నారు మరియు తనకు కృతజ్ఞతలు తెలిపిన, కేంద్రమంత్రికి పవన్ ధన్యవాదాలు తెలిపారు.
Sri, Telugu ,
10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2094 General Articles and views 1,837,915; 104 తత్వాలు (Tatvaalu) and views 221,643
Dt : 20-Sep-2020, Upd Dt : 20-Sep-2020, Category : Politics
Views : 694
( + More Social Media views ), Id : 709
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
mla ,
jump ,
mangalagiri ,
aiims ,
tirumala ,
signature ,
srivari bonds ,
matrubhasha ,
pawan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments