పాటతో పరమార్ధం- అంతా నాటకం - కాలాంతకులు - శోభన్ బాబు, జయసుధ, సత్యనారాయణ, కాంచన, మాధవి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,886,330; 104 తత్వాలు (Tatvaalu) and views 226,596.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Anta naTakam - Kalanthakulu - Shobhan Babu, Jayasudha, Satyanarayana, Kanchana, Madhavi, Vishwanadh - Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

అంతా నాటకం మనదంతా నాటకం. మేము మీరు, వారు వీరు, చిన్న పెద్ద, ఆడ మగ, ఆడేది, నాటకం. మన వాట్సాప్ స్టేటస్ లో వింతలూ, విడ్డూరాలు, నేరాలు, ఘోరాలు చూసారా? కొన్ని ఆంగ్లం లో ఉంటాయి, ఎవరి చేతనన్న, చదివించుకోండి. ఈ పాటలో ఎన్ని నాటకాలు చెప్పారో వినండి, పాడండి, పిల్లలకు చెప్పండి. మన పెద్దలు పాటలలో కూడా, ఎన్నో జీవిత సత్యాలు చెప్పారు, అందుకే ఈ గాత్ర నైవేద్యం, వ్రాత నైవేద్యం తో కలపి.

అవి స్టేటస్ లో ఎందుకు పెడుతున్నాము అంటే, అందరూ, మా కుటుంబం/ సర్కిల్/ వంశం/ సంఘం/ బజార్/ స్నేహితులు/ బంధువులు/ పిల్లలు/ అల్లుళ్ళు/ కోడళ్ళు/ భాగస్వాములు, నీతి నియమాలు గానే ఉన్నారు, మీరు భయపెడుతున్నారు, సమాజం అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలుగా, అంత దిగజార లేదు, 75% అంటూ, అని మనల్ని అడుగుతున్నారు. మరి వారికి సాక్ష్యం అదే. బయటకు రానివి ఎన్నో ఇంకా ఉన్నాయి.

మామకు వెన్నుపోటు, బాబాయికి గుండెపోటు ఉంటుంది అని, మనము ఎన్నో సార్లు ఎన్నో కుటుంబాలలో చెప్పాము, వారి గుణమును బట్టి. అబ్బే, మా అల్లుడు కోడలు పిల్లలు స్నేహితులు బంధువులు, మా అంత (అవి) నీతిమంతులు, అలా చేయరు, వారికి విశ్వసనీయత క్రుతజ్ఞత ఉన్నది, అని మోహములో అన్నారు. వీరు పెద్దలకు సేవ చేయరు, కానీ తమ పిల్లలు మాత్రం తమకు ముదుసలి తనములో సేవ చెయ్యాలి, చేస్తారు అనుకుంటారు. పిల్లలు సేవ చేయకపోయినా, ధనముతో సేవ చెయించుకోవచ్చు అన్న, తప్పుడు బ్రమల అహంకారములో ఉంటారు. తర్వాత పతనము అయ్యారు.

మంచి చెడు గుణము, దాచుకోలేరు మిత్రమా. పులి పాము నక్క లక్షణాలు, మనల్ని వెన్నుపోటు గుండెపోటుకు గురి చేస్తాయి, కాటు వేస్తాయి, అందుకే మనకు వాటితో స్నేహము/ బంధము మధురముగా ఉంటుంది ముందు, తర్వాత విషం కక్కుతుంది. అది మన మాట కాదు, మన పెద్దలు చెప్పారు.

హైదరాబాద్ లో, 20 ఏళ్ళ ఇద్దరు ఆడ పిల్లలు, తాగి తందనాలు ఆడి, రాత్రి పూట పరాయి మత ప్రియునితో, సొంత ఇంట్లో దొంగతనము చేయబోతే, అక్క అడ్డుపడింది అని, చెల్లి అక్కకు శివైక్యం కలిగించింది. గురుతు ఉందా?

మగపిల్లల ఉదాహరణలు, కోకొల్లలు. 20 కోట్లు ఇచ్చిన, తల్లి దండ్రులను, ఇంటి వెనక షెడ్ లో పెట్టి, అన్నం కూడా పెట్టకుండా, చంపింది మీరు చదివారు.

ఇప్పుడు అమెరికాలో 25 ఏళ్ళ లోపు ఇద్దరు ఆడపిల్లలు, మన తెలుగు తేజాలు చదువుకోవడానికి (, గుంటూరు/ హైదరాబాద్ లో చదివినవారు, వేరు వేరు కుటుంబాలు), గత ఏడాది వచ్చారు అంట. వారి తల్లి దండ్రులు, స్నేహితులు, బంధువులు, సర్కిల్, నేర్పిన, ఉత్తమ కపట నటన 2 నాల్కల సంస్కారం, మానసిక బలహీన దౌర్భాగ్యం, అంటే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం, ప్రదర్శనకు పెట్టారు. ప్రాపంచిక వ్యామోహ, తల్లి దండుల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష సాక్ష్యం.

తప్పు ను తప్పు అని చెప్పకపోతే, ఒప్పుకోకపోతే, మీ మా పిల్లలు, ఇలాగే తయారు అవుతారు. అందుకే మన శనివార సాధనలు పిల్లలతో చేపించండి, అని మొత్తుకుంటున్నది 10 ఏళ్ళుగా, మానసిక బలం పెరుగుతుంది అని, చెడు బుద్దులు లక్షణాలు నేర్చుకోరని, స్నేహితుల చెడు ప్రభావానికి లొంగరు.

ఇప్పుడు వారి అమ్మ నాన్నను అడగండి, మీ పిల్లల గుణాలు మంచివా అని? ఇది తెలియక ముందు, మా పిల్లలు ఆణి ముత్యాలు, హాస్టల్ లో పెట్టి దూరంగా, నెల కోసారి వెళ్ళి కనుక్కుని వస్తున్నాము ఇద్దరము సంపాదనలో బిజీ, అందరూ మంచే చెప్పారు అంటారు.

ఈ విషయం తెలిసాక, ఏదో పసి పిల్లలు తప్పు చేసారు. అసలు తప్పు చేయనిది ఎవరు. మా పార్టీ/ సంఘము లో వెన్నుపోటు, ఆ పార్టీ/సంఘము లో గుండెపోటు నే సమర్ధన చేస్తాము. ఇది చిన్న లెక్క. మా పిల్లలను కోట్ల కట్నముతో పెళ్ళి చేసుకోవాలని, ఎంతో మంది రెడీ గా ఉన్నారు. ఇవన్నీ మాకు పెద్ద లెక్క గాదు. ఇంత ఆస్తి ఎలా సంపాదించాము? మన ఊరిలో అయితే, కేసు లేకుండా చేసుకునే వారిమి అంటారే గానీ, ఇది తప్పు, రేపు ముదుసలి తనములో మనల్ని వదిలేస్తారు. సొంత పిల్లలకి సంస్కారం నేర్పుకోలేరు అని బాధపడరు.

ఒక గ్రోసరీ/కూరగాయల/ఫాన్సీ షాప్ లో, 10 రూపాయలు కట్టి, 140 రూపాయల (ఉదాహరణకు) సరుకు తీసుకుని బయటకు పోబోయారు. షాప్ వారు, ఈ పిన్న వయసులోనే వీరి దొంగతన కళా నైపుణ్యాన్ని గ్రహించి, బహుమతి కోసం, వీరిని గదిలో పెట్టి, పోలీసులను పిలిచారు. పోలీసులు వచ్చి, సంకెళ్ళు వేసి జైలుకు తీసుకు వెళుతుంటే, అమాయకముగా నటిస్తూ, మేము ఏపాపము ఎరుగము, ఇది ఎలా జరిగిందో మాకు తెలీదు, మొదటి తప్పుగా వదిలేస్తే, ఫైన్ కడతాము అన్నారు.

పోలీసులు వీరి నటనకు పొంగిపోయి, చిట్టి దొంగలు, మీరు ఇద్దరు గతములో కూడా దొంగతనము చేసారు అదే షాప్ లో, అప్పుడు వీరు వదిలేశారు కావాలనే, ఇది 2 వ సారి, కాబట్టి కపట నటనలు మా దగ్గర వద్దు, ఏదైనా ఉంటే జడ్జ్ తో చెప్పండి, మరువద్దు ఆయన ఎదురుగా మీ సీసీటీవీ వీడియోలు, గత చరిత్ర మొత్తము ఉంటాయి, అని మర్యాదగా చెప్పారు.

ఇక జీవితములో మీరు ఏ ఉద్యోగానికి/ అద్దెకు/ ఇంకోదానికి వెళ్ళినా, మీ జీవిత ఆధార్ కార్డ్ రికార్డ్ లో, దొంగతనము చేసి జైలుకు పోయారు అని ఉంటుంది, జడ్జ్ తీర్పును బట్టి అని చెప్పారు.

కాబట్టి మనది అంతా నాటకం, పిల్లల పెంపకం కూడా, ఇద్దరూ సంపాదన/ ఓటీటీ/ సోషల్ మత్తులో ఉంటే. రేపు ఆ పిల్లల పెళ్ళికి, వీరు వీరి అమ్మా నాన్న, వియ్యంకులకు భాగస్వామి కి నిజాలు చెపుతారా వీటి గురించి? చెప్పరు, అంతా నాటకం. పోనీ కోట్లు కట్నం పదవి వీసా ఉద్యోగం ఇస్తే, ఇవి తప్పుడు పనులు గుణాలు అని తెలిసినా, వియ్యంకులు సంబంధం చేసుకోకుండా ఉంటారా? ఉండరు, అంతా నాటకం.

జీవితం ఎంత నాటకమో, అందులో మనము ఎంత పెద్ద ఆస్కార్ లెవల్ నటులమో, మన పెద్దలు నిరూపించారు సుమా. రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి. పంచభూతాల శిక్షణ తప్పదు ఎవరికైనా.

అంతా. నాటకం.., మనదంతా. నాటకం.. 2
మేము మీరు, వారు వీరు
చిన్న పెద్ద, ఆడ మగ, ఆడేది, నాటకం.
అంతా. నాటకం.., మనదంతా. నాటకం..

భాగోతులు ఆడితే, వీధి నాటకం
భగవంతుడు ఆడితే, జగన్నాటకం 2
లేని వాడి బతుకే, తెర లేని నాటకం 2
ఉన్నవాడి దంతా, తెర చాటు నాటకం ||అంతా నాటకం||

కట్నాలు వద్దనడం, పైన నాటకం
కారు మేడలడగడం, అసలు నాటకం 2
లంచాలు తప్పనడం, పైని నాటకం 2
లాంచనాలు మెక్కడం అసలు నాటకం.. ||అంతా నాటకం||

ధరలు తగ్గినాయనడం, పైని నాటకం
మరి సరుకు సైజు తరగడం, అసలు నాటకం 2
ప్రజల కొరకు పార్టీ మార్పు, పైని నాటకం 2
కొత్త పదవి కొరకు, పాకులాట, అసలు నాటకం ||అంతా నాటకం||

తెలుగు నేల తుఫాను లో, మునిగినప్పుడు
అన్ని దేశాలు, కన్నీరై కరిగినప్పుడు 2
స్వార్ధపరులు ఆడింది, మహా నాటకం 2
తమ సంచి నింపుకోవడం, అంతర్ నాటకం 2 ||అంతా నాటకం||

చిత్రం : కాలాంతకులు; రచన : డాక్టర్ సి నారాయణరెడ్డి; గానం : ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం & వి రామకృష్ణ; సంగీతం : కె వి మహదేవన్; విడుదల తేది : 06.05.1978; దర్శకత్వం కె. విశ్వనాధ్  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,886,330; 104 తత్వాలు (Tatvaalu) and views 226,596
Dt : 10-Apr-2024, Upd Dt : 10-Apr-2024, Category : Songs
Views : 65 ( + More Social Media views ), Id : 2083 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Anta naTakam , Antaa naatakam , Kalanthakulu , Kalantakulu , Shobhan Babu , Jayasudha , Satyanarayana , Kanchana , Madhavi , Vishwanadh
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content