పాటతో పరమార్ధం- చల్లనిరాజా ఓ చందమామ, కథలన్ని తెలిసాయి చంద్రయాన్ తో-ఇలవేలుపు-ANR,అంజలి, జమున - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,913; 104 తత్వాలు (Tatvaalu) and views 226,448.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Challani Raja (Parody) - ISRO Chandrayaan 3 - Ilavelpu - ANR, Anjali, Jamuna

పాటతో పరమార్ధం - చల్లనిరాజా ఓ చందమామ, కథలన్ని తెలిసాయి చంద్రయాన్ తో(పేరడీ) - ఇలవేలుపు - ANR, అంజలి, జమున

చల్లనిరాజా ఓ చందమామ, మీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ, మన ఇస్రో చంద్రయాన్ 3 యాత్ర తో. దక్షిణ ధ్రువాన దిగిన సందర్భముగా, ప్రపంచ దేశాలు శుభాకాంక్షలు తెలిపాయి. మరి మనము ఓ 4 రాత మాటలు, ఓ గాత్ర నైవేద్య పాట తో, అదీ మన అందరి నాన్నలు అమ్మమ్మలు నాయనమ్మలు తాతలకు నచ్చిన మెచ్చిన మాటలుతో, అలాగే మన ఆధ్యాత్మిక భావనల పేరడీతో, అభినందనలు తెలుపు దామా. అందరికన్నా మనది ప్రత్యేకముగా ఉండాలి కదా, చిత్తశుద్ది వాక్సుద్ది తో.

చందమామ రావె జాబిల్లి రావె అనే అమ్మ జోలపాటలను, నేడు నిజం చేశారు. ఆకాశంలో కనిపించే ఆ చంద్రుడ్ని అందుకుంటామని ఎవరూ ఊహించి ఉండరు ! నేడు ఆ అసాధ్యాన్ని భారత శాస్త్రవేత్తలు, ఇస్రో సుసాధ్యం చేసింది ! చంద్రయానంతో ప్రపంచంలో భారత్ కీర్తి ప్రతిష్టల్ని పెంచింది !

ఇదే వేగంతో, మనుషుల్ని కూడా చంద్రుని పైకి తీసుకెళ్లే యజ్ఞం కూడా పూర్తి చేస్తారని, దేశమంతా నమ్ముతోంది ! బలమైన నాయకత్వం - అద్భుతమైన ప్రోత్సాహకం ఫలితాలను ఇస్తుందని నేడు నిరూపితమయింది.

మనకు చిన్నప్పుడు అమ్మ నోటిలో ముద్ద పెట్టేటప్పుడే, చందమామ తో బంధము చూపి అలవాటు చేస్తారు. అలాగే పురాణాలలో పరమేశుని జడలోన చామంతి. అలాగే మనము ఆకాశములో కి చూస్తే, నీలి మేఘాల నానేటి పూబంతి.

చందమామ ను చూచిన, మనసెంతో వికసించుగా, తొలి ఆధ్యాత్మిక సాధనలెన్నో, చిగురించుగా, కాదంటారా?

ఓ చందమామా, మము చూడవు, పిలచిన మాట్లాడవు. చిన్నవాళ్ళము అయినా మిమ్ము వదలము, ప్రియ భక్తులం.

అందుకే చంద్రయాన్ 3 తో మీ గురించి విశేషాలు తెలుసుకోవడానికి, భవిష్యత్ రోదశీ యాత్రలు అక్కడ నుంచే చెయ్యడానికి, అలాగే మానవ నివాస యోగ్యత గురించి ఆరాతీయడానికి, మేమే అక్కడకు వస్తున్నాయి.

మరి అప్పుడైనా అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వము ను వీడుతామా, మనశ్శాంతుల వెన్నెల కురిపించునా లేదా అన్నది, రాబోయే తరాలు నిర్ణయం చేయాలి, దానికి పునాది, నేటి తరాలు వేయాలి.

చల్లనిరాజా ఓ చందమామ 3
మీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ,.. మా చందమామ
చల్లనిరాజా ఓ చందమామ
మీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ.. మా చంద్రయాన్ తో

పరమేశుని, జడలోన, చామంతివి
నీలిమేఘాల, నానేటి, పూబంతివి - 2 సార్లు మొత్తము
మిము సేవించగా, మము దయచూడవా
ఓ వెన్నెల, వన్నెల, మా చందమామ ||చల్లనిరాజా ||

మిము చూచిన, మనసెంతో, వికసించుగా
తొలి, సాధనలెన్నో, చిగురించుగా
ధ్యానాలూరించునే, దైవం కనిపించునే
మనశ్శాంతుల, వెన్నెల కురిపించులే ||చల్లనిరాజా ||

మము చూడవు, పిలచిన మాట్లాడవు
చిన్నవాళ్ళము, వదలము, ప్రియ భక్తులం
మిమ్మే ధ్యానంబుగా, మమ్మే కరుణించరా
ఈ వెన్నెల ధ్యానంతో విహరించమా ||చల్లనిరాజా ||

Raghunath Panigrahi, P. Susheela, P. Leela
లీల,సుశీల,రఘునాధ్ పాణిగ్రాహి, సుసర్ల  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,913; 104 తత్వాలు (Tatvaalu) and views 226,448
Dt : 23-Aug-2023, Upd Dt : 23-Aug-2023, Category : Songs
Views : 277 ( + More Social Media views ), Id : 1888 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : challani , raja , parody , isro , chandrayaan3 , ilavelpu , anr , anjali , jamuna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content