ఆరనీకుమా ఈ దీపం - కార్తీక దీపం - ఉపయోగాలు - శోభన్ బాబు, శ్రీదేవి, శారద - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,919,395; 104 తత్వాలు (Tatvaalu) and views 229,447.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

సాధారణంగా హిందువులు, తమ ఇళ్లల్లోని పూజగదిలో, దేవాలయాల్లో, దేవుడి ఎదుట దీపాన్ని వెలిగిస్తుంటారు. కొంతమంది సంవత్సరం అంతా, తులసి లేదా కార్తీక దీపం, ఉదయం, సాయంత్రం కూడా వెలిగిస్తూ ఉంటారు.

మనిషి, తన పరిసరాల, శారీరక మరియు మానసిక శుచి శుభ్రత తో, స్నానం లేదా కాళ్ళు చేతులు కడుక్కున్నాక అపవిత్రహ పవిత్రోవా మంత్రం అంటూ, దీపం పెడతారు, పవిత్రమైన భావనతో, దేవునికి నమస్కరిస్తూ.

దీపం అనేది సానుకూలత చిహ్నంగా ఉంటారు. అంతేకాకుండా పేదరికం తొలిగిపోతుందని నమ్ముతారు. అజ్ఞానం అనే చీకటిని తొలగించి మన జీవితంలో వెలుగులు నింపేదే దీపం. నెయ్యి దీపం, నూనే దీపాన్ని ఉపయోగిస్తారు. తాను కరిగిపోతూ, ఇతరులకు వెలుగిస్తుంది, మనమూ అలాగే ఉండాలి 10 మందికి ఉపయోగపడుతూ, దేవుని పాదాల దగ్గర అని ఇంకో అర్ధము.

దీపాలను వెలిగించడం వల్ల, వాతావరణంలో అయాస్కాంత మార్పులను ఉత్పత్తి చేస్తుంది. ఇలా ఉత్పత్తి అవడం వల్ల విద్యుదయాస్కాంత తరంగాలు, కొన్ని గంటల వరకు అలాగే ఉంటాయి. ఫలితంగా రక్తకణాలు ఉత్తేజమవుతాయి. ఆవు నెయ్యితో దీపాలను వెలిగించడం వల్ల సూక్ష్మజీవులను నాశనం చేసే సామర్థ్యం ఉంటుంది. ఆవు నెయ్యితో దీపాలను వెలిగిస్తే అది వాతావారణాన్ని మెరుగుపరుస్తుంది. కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. అదొక చిన్న నిత్య యజ్ఞం తో సమానం.

ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే, దాని పొగ ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించి, సానుకూల శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఉండే, బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది. మరో విశేషమేమిటంటే, దీపం ఆరిపోయిన తర్వాత, సుమారు కొన్ని గంటల వరకు, దీని ప్రభావముంటుంది. దీపాన్ని వెలిగించడం ద్వారా చీకటి మాయమవుతుంది. అందుకే హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ మంచి పని చేసినా జ్యోతిప్రజ్వలనతో ఆ పనిని ప్రారంభిస్తారు. ఎందుకంటే దీపానికి అద్భుతమైన శక్తి ఉంది.

దీపం వెలుగుతో చీకటి మాయమవ్వడమే కాకుండా, మనుషుల్లోని అంధకారాన్ని, మనసులోని చెడు భావాన్ని తొలగిస్తుంది. ఇంతటి అద్భుత శక్తిగల దీపం లక్ష్మీ దేవికి ప్రతీక.

పంచాభూతాల్లో ప్రధామైంది అగ్ని. అగ్ని సకల జీవరాశి మనుగడకు కాంతిని అందిస్తుంది. దీపాల వెలుగును సరిగ్గా గమనిస్తే, నీలం, పసుపు, ఎరుపు రంగులు కనిపిస్తాయి. ఈ మూడు రంగులు సత్వా, రజో, స్తమ గుణాలకు ప్రతీకలుగా ఉంటాయని వేదాలు చేబుతున్నాయి. ఈ మూడు గుణాలు జగత్తును పాలించే లక్ష్మీ, పార్వతి, సరస్వతి దేవీగా పురణాలు చెబుతున్నాయి.

కార్తీకమాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. ఆకాశ దీపాలు వెలిగించినవాడు పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవీ ఆకాశదీపాలు. ఆకాశదీపం దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజ స్తంభానికి, తాడుకట్టి ఒక చిన్న పాత్రలో, దీపం వెలిగించి, గాలికి నిధనం కాకుండా, రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా, శమంతకంగా భగవంతుని నామాలు చెపుతూ, భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా ఆ దీపాన్ని పైకెత్తుతారు.

ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం
చేరని నీ పాదపీఠం కర్పూర దీపం

ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం
చేరని.. నీ పాదపీఠం కర్పూర దీపం
ఇదే సుమా నా కుంకుమ తిలకం
ఇదే సుమా నా మంగళ సూత్రం

ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం
చేరని.. నీ పాదపీఠం కర్పూర దీపం

ఇంటిలోన నా పాప రూపున.. గోరంత దీపం
కంటికెదురుగ కనబడువేళల.. కొండంత దీపం
నా మనస్సులో వెలిగే దీపం
నా మనుగడా నడిపే దీపం

ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం
చేరని.. నీ పాదపీఠం కర్పూర దీపం 2

ఆకాశాన.. ఆ మణి దీపాలేముత్తైదువులుంచారో
ఈ కోనేటా.. ఈ చిరుదివ్వెల చూసి చుక్కలనుకుంటారో
ఏమైనా ఏదైనా.. కోవెలలో కొలువై వుండే
దేవికి పట్టిన హారతులే

ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం
చేరని.. నీ పాదపీఠం కర్పూర దీపం 2

నోచిన నోములు… పండెనని ఈ ఆనంద దీపం
నా దాచిన కోర్కెలు… నిండునని ఈ ఆశాదీపం
నా నోచిన నోములు… పండెనని ఈ ఆనందదీపం
నా దాచిన కోర్కెలు… నిండునని ఈ ఆశాదీపం
ఎటనైనా ఎప్పుడైనా… నే కొలిచే కళ్యాణదీపం
నే వలచే నా ప్రాణదీపం…

ఆరనీకుమా ఈ దీపం… కార్తీక దీపం
చేరనీ నీ పాదపీఠం… కర్పూర దీపం
చేరనీ నీ పాదపీఠం… నా ప్రాణదీపం

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, గొంతులో కఫము తగ్గడానికి, మనసు నియంత్రణ బలం కు, మానసిక వ్యాధుల నివారణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.

Songs Sung by P. Susheela and S. Janaki, Songs Lyrics by Devulapalli Krishnasastri, Songs Music by Chellapilla Satyam

Aaraneekuma Ee Deepam - Kartika Deepam - benefits Sobhan Babu, Sridevi, Sharada  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,919,395; 104 తత్వాలు (Tatvaalu) and views 229,447
Dt : 28-Oct-2022, Upd Dt : 28-Oct-2022, Category : Songs
Views : 758 ( + More Social Media views ), Id : 1601 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : aaraneekuma , deepam , kartika , tulasi , ghee , deepam , benefits , sobhan , babu , sridevi , sharada
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content