1.
రూ.5 లక్షల FDపై ఏకంగా 12 శాతం వడ్డీ.. ఆపైన రూ.10 వేలు అదనం.. ఆ బ్యాంక్ ఎందుకు ఎక్కువ చెల్లిస్తోందంటే? - 2026-06-28T13:08:28+05:30
Bank FD: బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేటప్పుడే నిర్ణీత కాల వ్యవధిని నిర్ణయిస్తారు. దానికి ఎంత వడ్డీ ఇస్తామనేది చెప్తారు. ఏ బ్యాంక్ అయినా గరిష్ఠంగా 8 శాతం వరకు వడ్డీ ఇస్తుంది. కానీ, ఓ బ్యాంక్ ఏకంగా 12 శాతం వడ్డీ ఇవ్వడంతో పాటు రూ.10 వేలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. అయితే, ఇది అందరికి కాదు. కోర్డు ఆదేశాల మేరకు ఓ ఖాతాదారుడికి ఈ మొత్తం చెల్లించాల్సి వచ్చింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
ఇంకా
2.
6 బంతుల్లో 6 పరుగులు కావాలి.. హ్యాట్రిక్ వికెట్ తీసిన అకేలా.. ఆఖరి బంతికి హార్ట్ బ్రేక్ - 2026-06-28T11:54:59+05:30
మేజర్ లీగ్ 2026లో వాషింగ్టన్ - టెక్సాస్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు మినీ హార్ట్ అటాక్ తెప్పించింది. ఆఖరి ఓవర్లో కేవలం ఆరు పరుగులే చేయాల్సి రావడం.. చేతిలో నాలుగు వికెట్లు ఉండటంతో వాషింగ్టన్ ఈజీగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అకేలా హ్యాట్రిక్ వికెట్లు తీసి కాసేపు టెన్షన్ పుట్టించాడు. ఆఖరి బంతికి ట్విస్ట్ ఇస్తూ నిఖిల్ చౌదరి సిక్సర్ బాది మ్యాచ్‌ని గెలిపించడంతో ఇప్పుడు అందరి దృష్టి మేజర్ లీగ్ వైపు పడింది.
ఇంకా
3.
జస్ట్ ఏడాదిలో లక్షకు రూ.6 లక్షలొచ్చాయ్.. ఇప్పుడు 1 షేరు 2 షేర్లు 'బోనస్'గా ఇస్తోన్న కంపెనీ.. మంచి ఛాన్స్! - 2026-06-28T11:31:03+05:30
Bonus Shares: జ్యూవెలరీ సెక్టార్‌లోని స్మాల్ క్యాప్ కేటగిరి కంపెనీ డివైన్ హీరా జ్యూవెలర్స్ లిమిటెడ్ బంపర్ ఆఫర్ తెచ్చింది. ఈ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై 2:1 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేయాలని నిర్ణయించారు. రికార్డు డేట్ జులై 02గా నిర్ణయించారు. ఆలోపు 1 షేరు కొంటే 2 షేర్లు బోనస్ రూపంలో ఉచితంగా వస్తాయి. అంతే కాదు ఈ స్టాక్ ఏడాదిలోనే 500 శాతం లాభాలు అందించింది. మరి ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం.
ఇంకా
4.
కేబీఆర్ పార్కు తరహాలో గుర్రంగూడ ఫారెస్ట్ ఎకో పార్కు.. రూ.15 కోట్లతో, ప్రత్యేకతలివే..! - 2026-06-28T12:05:27+05:30
హైదరాబాద్ నగర శివారులోని గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు తరహాలో అధునాతన ఎకో పార్కు ఏర్పాటుకు అటవీశాఖ పనులు ప్రారంభించింది. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్న అటవీ భూమిలో 142 ఎకరాల విస్తీర్ణంలో రూ.15 కోట్ల వ్యయంతో ఈ పార్కును నిర్మిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును ఈ ఏడాది డిసెంబరు లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో సైక్లింగ్ ట్రాక్‌లు, వాక్‌వేలు, ధ్యానమందిరాలతో పాటు సందర్శకుల రద్దీ నియంత్రణకు ఐదు ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేయనున్నారు.
ఇంకా
5.
విమానాశ్రయాల్లో 24 గంటలు బార్లు, వైన్‌షాపులు.. ఏపీ ఎక్సైజ్ శాఖ సరికొత్త పాలసీ..! - 2026-06-28T12:48:23+05:30
ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి మినహా మిగతా అన్ని విమానాశ్రయాల్లో 24 గంటలూ తెరిచి ఉంచే బార్లు, వైన్‌షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బార్ల నాన్ రిఫండ్బుల్ దరఖాస్తు రుసుము రూ.5 లక్షలు, వైన్‌షాపులకు రూ.2 లక్షలుగా నిర్ణయించారు. ప్రయాణికుల రద్దీ ఆధారంగా బార్ల వార్షిక లైసెన్స్ ఫీజు రూ.15 లక్షల నుండి రూ.25 లక్షల వరకు ఉండనుంది. ఎయిర్పోర్ట్ వైన్‌షాపుల వార్షిక లైసెన్సు రుసుమును రూ.కోటిగా ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ సోమ లేదా మంగళవారాల్లో విడుదల కానుంది.
ఇంకా
6.
బొక్కబోర్లా పడ్డ కొత్త కుక్స్.. కన్నీరు పెట్టిన పల్లవి.. పొదరిల్లు మహాకి ఎదురుదెబ్బ - 2026-06-28T12:56:13+05:30
Cooku With Jathiratnalu Season 2 Episode 26 కుకు విత్ జాతిరత్నాలు షోలో ఆదివారం నాడు కుక్స్ అదరగొట్టేశారు. కొత్తగా వచ్చిన కుక్స్ మాత్రం మార్కుల్లో వెనకపడ్డారు. అదే శనివారం నాటి ఎపిసోడ్‌లోని కొత్త కుక్స్ అదరగొట్టేశారు. అక్కడ కొత్త కుక్స్ టాప్ 2 లో ఉంటే.. ఇక్కడ మాత్రం కొత్త కుక్స్ లీస్ట్ 2 పొజీషన్స్లో ఉండిపోయారు. కృతిక, సుమిత్ చేసిన డిషెస్, రెసిపీలు ఫ్లాప్ అయ్యాయి. ఇక ఎప్పటిలానే డెమాన్ పవన్ తన రెసిపీతో, చేతి వంటతో మ్యాజిక్ చేసేశాడు.
ఇంకా
7.
హైదరాబాద్‌లో భూమి కబ్జాకు యత్నం.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై కేశినేని నాని ఆరోపణలు.. సీఎం రేవంత్‌కు లేఖ - 2026-06-28T11:03:40+05:30
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై మాజీ ఎంపీ కేశినేని నాని భూకబ్జా ఆరోపణలు చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. హైదరాబాద్ ప్రగతి నగర్, షంషిగూడలోని టీజీఐఐసీ ఐటీ పార్క్‌కు కేటాయించిన 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిని కేశినేని చిన్ని, ఆయన బినామీ సంస్థలు అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని నాని పేర్కొన్నారు. ఈడీ, ఎన్సీఎల్టీ ఆంక్షలను దాచిపెట్టి సుప్రీంకోర్టులో నకిలీ రాజీ ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. ఈ భూమిని కాపాడేందుకు 'హైడ్రా'ను రంగంలోకి దించి, బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నాని డిమాండ్ చేశారు.
ఇంకా
8.
భార్యపై అనుమానం.. గర్భిణి అని చూడకుండా రోజూ 10 గంటల నరకం.. చివరికి ఊహించని విషాదం! - 2026-06-28T10:54:16+05:30
అనుమానం పెనుభూతమైంది. గర్భిణిగా ఉందన్న కనికరం కూడా లేకుండా కట్టుకున్న భార్యను అతికిరాతకంగా కడతేర్చాడో కర్కోటకుడు. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న కారణంతో రోజుకు పది గంటల పైగా ఇంట్లోనే ఉంచి తాళం వేసిన ఆ భర్త.. చివరికి బకెట్ నీటిలో ఆమె తల ముంచి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఆ పై అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన హర్యానాలోని ఫరియాబాద్లో చోటుచేసుకుంది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇంకా
9.
US -Iran మధ్య మళ్లీ భీకర దాడులు.. "ఇరాన్ అనే దేశమే ఉండదు" ట్రంప్ వార్నింగ్‌తో ఉలిక్కిపడ్డ ప్రపంచం! - 2026-06-28T09:17:56+05:30
అమెరికా - ఇరాన్ దేశాలు మరోసారి భీకర దాడులకు తెగబడ్డాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉండగానే ఇరాన్, అమెరికా ఇరు దేశాలు మిస్సైల్ దాడులు చేసుకున్నాయి. హార్మూజ్‌లో వాణిజ్య రవాణా చేస్తున్న ఓ నౌకపై ఇరాన్ తొలుత దాడులు చేయడమే ఈ ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. ఆ వెంటనే ఇరాన్‌లోని కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేయగా.. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది.
ఇంకా