మిగతా లోకం తీరు కూడా
చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి.
2085 కధనాలు.
ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,886,524; 104 తత్వాలు (Tatvaalu) and views 226,610.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.1 min read time.
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్
చాలా మంది విని ఉంటారు, ప్రతి శనివారం వింటూ ఉంటారు, మరి ఆచరణలో ఎంతమంది అమలు పెడుతున్నారు? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, సుప్రభాతం లోని పంక్తులు అవి. దాని అర్థం ఎంతమంది కి తెలుసు?
రాచకార్యాలు కూడా లేకుండా, అడవుల్లో తీరికగా ఉన్న సమయంలో కూడా, బాధ్యత గల గురువు గారు, యువ రాజకుమారుడు అయిన, శ్రీరాము ని తెల్లవారుజామున నిద్ర లేపుతూ, ఓ రామా తూర్పు న తెలవారు చున్నది. సూర్యుడు రాకముందే, మనం సిద్ధంగా ఉండి, ఆయనకు వందనం ఆచరించి, మన రోజు వారీ, కర్తవ్యం ను మొదలు పెట్టాలి అని నీతి సమయపాలన చెప్పారు.
అంటే కనీసం 5 కు ముందు, మనం లెగిస్తే గాని, సూర్యుని ఆరోగ్య లేత కిరణాల ను చూసి పొంది, నమస్కారం చేసే భాగ్యం కలగదు.
అంతే కాదు, ఏ పూజా పుస్తకాలు చూసినా, ప్రాతఃకాలం లోనే నిద్ర లేచి, అని ఉంటుంది కదా.
మరి ఇప్పుడు ఎంతమంది ఇది ఆచరణలో చేస్తున్నారు? తమ పిల్లలకు, శ్రీరాముడే అలాగే, 5 గంటలకు లేచి, దిన కార్యక్రమాలు, సూర్యుని వందనం తో చేస్తే, సామాన్య మానవులం మనం లెగవలేమా అని, మంచి బుద్దులు నేర్పే తల్లి దండ్రులు ఉన్నారా?
ముందు తల్లి దండ్రులే జవాబు చెపుతున్నారు కదా, మా ఇంటా వంటా, 8 తర్వాత నే లెగిచేది అని. రాత్రి తొందరగా నిద్రపోము అండి అని. నువ్వు ఎప్పుడు పడుకున్నావు అన్నది ముఖ్యం కాదు, 5 కు లెగిచిందే ముఖ్యం, కావాలంటే పడుకునే సమయం మార్చుకో.
సూర్య నారాయణుడు, తన పని మొదలు పెట్టిన తర్వాత, తీరికగా గంటల తర్వాత, వీరు భూమి పై పాదం మోపుతారు. సంస్కారం ఇదేనా? ఇతర దేశాల్లో, సూర్యుడు రాకపోయినా, ఉదయం 5 కే లెగవక తప్పదు.
మరి ఈ గొప్ప వారు, అంటే సూర్యుని అవమానించిన వారు, చేస్తున్న పనులు కు పూజలకు విలువ ఉంటుందా? మన పై అధికారులు వచ్చిన గంటకు, మనం ఆఫీసు కు వస్తామా?
ఒకాయన చెపుతారు, డ్యూటీ ఉంటే, 5 కు లెగుస్తా, సెలవైతే అన్ని రోజులు, 8 కి లెగుస్తా అని. అక్కడ ఉద్యోగ ధనం కు విలువ ఇచ్చారు కానీ, దైవానికి కాదు కదా? ఇలా ఏవో కారణాలు చెప్పి, తమ ఆరోగ్యం తామే పాడు చేసుకుంటున్నారు.
ఇది చాలదా, మన ఇళ్ళు కలియుగంలో ఎంత మోహం మాయలో, కొట్టమిట్టాడు తున్నాయో వాస్తవం గ్రహించ లేక భ్రమలలో. మనమే ఇలా ఉంటే, మన నాయకులు అధికారులు, ఎక్కువ మంది సంగతి అనుకోవడం అనవసరమేమో.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,886,524; 104 తత్వాలు (Tatvaalu) and views 226,610
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే