Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.
సొంతముగా ఎదిగిన, తానా నాయకులు కొందరు ధైర్యముగా, కోరిన మొదటి రోజే మాట్లాడారు (మార్చ్ 31). ఇంకొకరు ఏవో సాకులు చెప్పి, వెనక్కు నెడుతున్నారు, మేము రింగ్ ఇచ్చినప్పుడు ఎత్తాలి కానీ, మీకు అనుకూల సమయం, మాకు కుదరదు అని. ఇంకొకరు ఏమో, నిమ్మకు నీరెత్తినట్లు, ఎవరి అనుమతి కోసమో ఎదురు చూస్తున్నారు.
మేము రాసిన కధనాలకు, ఆత్మాభిమానం సొంతగా ఎదిగిన నాయకత్వ లక్షణాలు గల, ఆంధ్రా అధికారులు మరియు ఎమ్మెల్యేలు నాయకులు వెంటనే జవాబు ఇచ్చారు. చిన్న పెద్ద మీడియా తేడాలు చూడరు, ధైర్యముగా తమకే పంపే వారిని, ప్రశంసిస్తారు. ఎందుకంటే, పుకార్లు ఎవరి దగ్గరో వినకూడదు కదా. వారి ప్రైవసీ కి ఎప్పుడూ మేము భంగము కలిగించలేదు. ఓ జిల్లా అధికారి వెంటనే ఫోన్ చేసి, వివరణ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యే కూడా. ఎందుకంటే, ఆత్మాభిమానం ఉన్నవారు గమ్ముగా ఉండరు, తప్పో ఒప్పో ఏదో ఒక సమాధానం చెపుతారు, మనము సర్ది చెపుతాము గౌరవముగా.
అందుకే అంటారు, కేవలము ధనము అధికారం గాడ్ ఫాదర్ బిక్షతో ఎదిగిన నాయకులకు, ఇతరులను గౌరవించడం, మర్యాద తో మన్నించి సర్దుకుని, మాట్లాడటం చేతకాదు. కొత్త గా నేర్చుకోవలంటే అహంకారం ఐశ్వర్యం అడ్డు వస్తుంది. మా పచ్చ మీడియా కానప్పుడు, మాకు అనుకూలముగా లేదా బానిసలు గా ఉండనప్పుడు, మాకేమిటి అవసరం అని గమ్ముగా ఉంటారు. ఏదో ఒకరోజు ఆ అహంకారము బద్దలు అవుతుంది.
ఈ రోజు ఇక్కడ తెదేపా కు జరుగుతున్న పరాభవము, ఇటువంటి ఆలోచనలతో అందరినీ కలుపుకోక బట్టి జరిగిందని, నేటికీ కొందరు నాయకులు అలాగే అధిష్టానం తెలుసుకోక పోవడం మన దురద్రుష్టం, అమెరికా అయినా ఆఫ్రికా అయినా, మన లక్షణాలు అంతే. మన వర్గం మన బానిసత్వం మన ఎదుగుదల అంతే, ఇదే జీవితం, ఇదే పతనము. ఎంటీయార్ ఆశయాలు గా అందరినీ కలుపుకో అన్నవి, సగానికి తగ్గి పోయాయి ఈనాడు.
ఇంత చదివి అమెరికా వెళ్ళి, ఇన్నాళ్ళు ఉద్యోగాలు వెలగబెట్టి సంపాదించి, ముఖాముఖి ధైర్యం లేని పిరికి పందలుగా లేదా అహంకారముతో తోటి వారి ప్రాణాలు కరోనా తో పోయినా పర్లేదు అనుకుని, ప్రయాణాలతోనే సరిపెట్టుకుందాము అనుకునే, గాడ్ ఫాదర్ బానిసత్వం నుంచి బయటకు రాలేని వారి కోసం, ప్రజాస్వామ్య బద్దముగా మేము ఇంకో ఉచిత ప్రచార అవకాశం ఇస్తున్నాము.
మీరే, మీ అనుచరులతో, ఆ 19 ప్రశ్నలకు జవాబులు తెలుగు లో వాట్సాప్ టెక్స్ట్ గా పంపితే, మీ పేరు తో, పబ్లిష్ చేస్తాము.
link. అప్పుడు ముఖాముఖి జరిగినా లేదా జరగకపోయినా, భవిష్యత్ సాక్ష్యం కోసం లేదా ఇప్పుడు మరింత ప్రచారము కోసం, ధైర్యముగా ముందుకు వచ్చిన నాయకుని జవాబులు, మా ఆంధ్రా ప్రజలు అలాగే అన్ని పార్టీల అధిష్టానాలు చదివి తరిస్తారు. తమ తేజాల ధైర్యం ఏపాటిదో, తెలుసుకుని, గర్వపడతారు.
కనీసం చాటుగా ఉండి అయినా, జవాబులు తెలుగులో మాత్రమే ఇచ్చే ప్రయత్నము చేస్తారేమో, చూద్దాము మిత్రులారా. అమెరికా తెలుగు సంఘ నాయకులు కూడా, కపట మోస అవకాశ అవసర, తెలుగు రాజకీయ నాయకులకు ఏమాత్రం తీసిపోరని, దయచేసి నిరూపించవద్దు.
మీ జవాబులు త్వరలో పంపగలరు, ప్రజాస్వామ్యాన్ని పాటించాలి బానిసత్వం నుంచి బయటకు వద్దాము అనుకుంటే మాత్రమే సుమా. లేదు మా జీవితాలు ఇంతే, మా సంస్థను మేమే నాశనము చేసుకుంటాము అంటే, మీ ఇష్టం. ధన్యవాదములు.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2125 General Articles and views 1,905,399; 104 తత్వాలు (Tatvaalu) and views 228,296
Dt : 02-Apr-2021, Upd Dt : 02-Apr-2021, Category : America
Views : 868
( + More Social Media views ), Id : 1070
, Country : USA
Tags :
tana ,
ata ,
nats ,
study ,
american ,
jobs ,
business ,
shy ,
face to face ,
facial ,
courage
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments