అమ్మ మనసు ఒక్కటే, పాహిమాం పాహిమాం, ఎవరు ఎవరు -అమ్మ మనసు-చలం, జయంతి, విశ్వనాథ్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,890,727; 104 తత్వాలు (Tatvaalu) and views 226,990.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మాత్రు దినోత్సవం రాబోతుంది. కనీసం మన అమ్మ కోసము, ఒక్క పాటైనా సొంత గొంతుతో పాడి క్రుతజ్ఞతలు తెలుపుకుందాము, దగ్గర ఉంచి పసిపిల్లలా ముద్దాడుదాం సాకుదాం బతికి ఉన్నప్పుడే. మన అమ్మ కు మన ఆప్యాయత ప్రేమ చేతలలో కనిపించే, గార్దభ గొంతే చాలు, మధుర గాయక గొంతు అవసరము లేదు. పుట్టిన ప్రతి మనిషి ఖచ్చితముగా చేయగలిగింది, తమను పెంచిన వారి రుణం తీర్చుకోవడమే కదా?

అమ్మా నాన్న ను ప్రేమగా దగ్గర ఉంచి చూడలేని మగ/ఆడ వారు, ఆ దేవ దేవుని, అలాగే తమ పిల్లలను అలాగే భాగస్వామి ని కూడా సరిగ్గా చూడలేరు కేవలము మోహం అవసరార్ధం లో తప్ప, ఇది ఎన్నడో నిరూపించిన సత్యం.

అక్షర త్రుతీయ రోజున, కన్న తల్లి సేవ చేసుకునే భాగ్యం ఎందరికి దొరుకుతుంది. పొద్దున్నే అమ్మ పాదాలకు నమస్కరించి, ఆ తర్వాతే దైవారాధన.

బలవర్ధకమైన ఆహారం ఫలహారము తినుబండారాలను తినిపించి, చెయ్యి పట్టుకుని, ఓ మైలు దూరము తీయటి మాటలు చెపుతూ గత జ్ఞాపకాలను గుర్తూ చేస్తూ, ప్రపంచ ఉత్తమ వైద్యం అందిస్తూ, నవ్విస్తూ బాధలను మరిచేటట్లు గా చేసే శక్తిని 8 ఏళ్ళు గా ఇచ్చిన, అలాగే ప్రపంచ కార్మికుల కర్షకుల పండగ మేడే రోజున మనకు జన్మించే అవకాశం ఇచ్చిన, ఆ దేవుని ఇంతకన్నా మహాభాగ్యం కోరేదేమిటి. దగ్గరలో ఉండే పని వారికి పండ్లు సమర్పించాము.

ఎన్ని జన్మల పుణ్యం ఉంటే, ఇంత మనసున్న తల్లిని ఇచ్చారు, ఆమె సేవ చేసుకునే సౌభాగ్యం ఇచ్చారు. పుట్టిన రోజూ పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ? కనీసం మన కన్న తల్లి కి పనికి కూడా రాలేమా? పాపం పెంచకుండా ఉండలేమా? భవిష్యత్ కరోనాలకు బలి ఇవ్వకుండా ఆపలేమా?

కనీసం 0.1 శాతం అయినా, తూలి పడే ముదుసలి అమ్మ రుణం తీర్చుకునే భాగ్యం ఇచ్చిన, ఆ దేవ దేవుని ఇంకేమి ఏమి కోరుకోవాలి, ఈ అరిషడ్వర్గాల సాధన మెరుగు పరచమని తప్ప, తన వైపే ద్రుష్టి పెట్టమని తప్ప, ఎన్ని కష్టాలు ఇచ్చినా సరే, ఆయన ఉండగా మనకెందుకు భయం. గురువులైన మిమ్మల్ని ఎలా మోహము లో పడకుండా రోజూ గుర్తు చేస్తున్నామో, మీరూ అలాగే మేము మోహం లో పడకుండా గుర్తు చేయాలి, లేదంటే ఆ పుణ్యమంతా మాకే సుమీ.

బాలు మొదటి పాటి ఇది, వేటూరి 2 వ సినిమా ఇది - పశువైనా పక్షైనా, మనిషైనా మాకైనా, బిడ్డల సేవ లో ప్రేమ లో త్యాగం లో, అమ్మ మనసు ఒకటే, అమ్మా దైవం ఒకటే. కాదంటారా? అందుకే మాత్రు దేవోభవ పిత్రు దేవోభవ అంది. దేవుడు కూడా వారి తర్వాతనే సుమా. పాండురంగ కధలో, దేవుడినే బయట నిలబెడతాడు భక్తుడు తల్లి దండ్రుల సేవ తర్వాతనే మీకు సేవ అని.

మర్రి చెట్టు ఎంత ఎత్తు ఎంత పెద్ద పెరిగినా, తాను పుట్టిన మట్టిని అది మరువదు విడువదు. ఊడలనే చేతులతో ఎప్పుడూ మొక్కుతుంది. మరి విశ్వాసఘాతకులమైన మనుషులం?

నడుమ వచ్చిన సంపదలు ఎన్నాళ్ళు నిలిచేను? ఏటిలోని నురగలు మరునాటి కేమౌను?
కలిమిలేములు జీవితానికి 2 పక్కలురా, వెలుగు నీడలు కాలానికి 2 రెక్కలురా. కాదంటారా?

ఇప్పుడైనా బుద్ది తెచ్చుకుని, ఆ పరమాత్మను ఇలా ప్రార్ధన చేద్దాము - నీ ఒడిలో ఒదిగే పాపలం, పాహిమాం పాహిమాం, నీ అడుగుల వాలే పువ్వులం, పాహిమాం పాహిమాం.

1) పశువైనా పక్షైనా, మనిషైనా మాకైనా
అమ్మ మనసు ఒకటే, అమ్మా దైవం ఒకటే

చరణం1:
తన తనువెల్లా కరగించీ..
తన బిడ్డలకా వెలుగులు పంచీ..
చీకటిగా, తన జీవితమంతా
చిరిగిపోయినా, చితికిపోయినా
చితిమంటల చిటపటలో కూడా,
చిరంజీవ అని దీవించేది

అమ్మ మనసు ఒకటే, అందుకే దైవం అమ్మంటే

పశువైనా పక్షైనా, మనిషైనా మాకైనా
అమ్మ మనసు ఒకటే, అమ్మా, దైవం ఒకటే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ అహా

అమ్మ మనసు ఒక్కటే , చిత్రం:అమ్మ మనసు, 1974,
This is the second movie for which Sri Veturi Sundara Rama Murthy penned Lyrics, First Title Song, First Song Sung by Sri S P Balasubrahmanyam, First Time working for Producer Sri G V S Raju, Music: K V Mahadevan

2) పాహిమాం పాహిమాం జగదేక బంధు
పాహిమాం పాహిమాం కారుణ్య సింధు

పతిత పావన దీన జనావన, ప్రేమ నిదాన పాహిమాం 2

నీ ఒడిలో ఒదిగే పాపలం, పాహిమాం పాహిమాం
నీ అడుగుల వాలే పువ్వులం, పాహిమాం పాహిమాం
నీ దయ ఉంటే నీ సెలవైతే నీ గుడిలో వెలిగే దివ్వెలం 2

పాహిమాం పాహిమాం, పాహిమాం పాహిమాం ...
పాహిమాం పాహిమాం జగదేక బంధు
పాహిమాం పాహిమాం కారుణ్య సింధు

3) ఎవరు ఎవరు ఎవరు రా పెద్ద వాళ్ళు, ఎవరు ఎవరు ఎవరు రా చిన్న వాళ్ళు
అందరం నేల తల్లి పాపలం, మనమందరం ఆ తల్లి చూపులం, చల్లని చూపులం ||ఎవరు ఎవరు|| 2

1. మర్రి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా, తాను పుట్టిన మట్టినిఅది మరచెనా 2
ఊడలనే చేతులతో మొక్కుతుంది..., తన కన్నతల్లి, రుణం కాస్త తీర్చుకుంటుంది.

2. నడుమ వచ్చిన సంపదలు ఎన్నాళ్ళు నిలిచేను, ఏటిలోని నురగలు మరునాటి కేమౌను 2
కలిమిలేములు జీవితానికి 2 పక్కలురా 2
వెలుగు నీడలు కాలానికి 2 రెక్కలురా ఒరేయ్

3. పుట్టినపుడు నేనో బైరాగిని, కానీ, పెట్టిన పేరేమో రాజని 2
లక్షలున్నా కోట్లున్నా 2 ఎప్పటి రాజన్ననే..,
మిమ్మల్ని, పిచ్చి గా ప్రేమించే, మీ అన్ననే, ఆ పిచ్చన్ననే

Amma Manasu is a 1974 Indian Telugu film, directed by K. Viswanath and Produced by G.V.S. Raju. The film stars Chalam, Jayanthi, Bharathi, Subha, K. Vijaya, Kaikala Satyanarayana, Master Bablu.

అమ్మ మనసు 1974లో విడుదలైన భారతీయ తెలుగు చలనచిత్రం, K. విశ్వనాథ్ దర్శకత్వం వహించారు మరియు G.V.S నిర్మించారు. రాజు. ఈ చిత్రంలో చలం, జయంతి, భారతి, శుభ, కె. విజయ, కైకాల సత్యనారాయణ, మాస్టర్ బబ్లు నటించారు.

Amma Manasu Okkate, Pahimam Pahimam, evaru evaru - Amma Manasu - Chalam, Jayanti, Vishwanath  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,890,727; 104 తత్వాలు (Tatvaalu) and views 226,990
Dt : 03-May-2022, Upd Dt : 03-May-2022, Category : Songs
Views : 860 ( + More Social Media views ), Id : 1378 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : amma , manasu , pahimam , evaru , chalam , jayanti , vishwanath
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content