వివేక్ అగ్నిహోత్రి కాశ్మీర్ ఫైల్స్ లాంటి వాస్తవ సంఘటన సినిమాలు, లౌకిక వాదులకు కనువిప్పు - Movie - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2092 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2127 General Articles and views 1,918,115; 104 తత్వాలు (Tatvaalu) and views 229,346.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Vivek Agnihotri Kashmir Files Like Real Fiction Movies For Secularists eye opening.

Starring Anupam Kher, Pallavi Joshi, and Mithun Chakraborty, it is written and directed by Vivek Agnihotri and produced by Abhishek Agarwal. The film is a depiction of the exodus of Kashmiri Pandits during the Kashmir Insurgency.

సనాతన ధర్మం మరియు హిందుత్వం ఆచరించే వారు, నిబద్దతతో ఆచరించకపోతే, నిర్లక్ష్యం బద్దకం ఆవహిస్తే, దాని పరిణామాలు ఎలా ఉంటాయో గతము లో చూసాము, ఇప్పుడు చూస్తున్నాము.

ఇప్పుడు మనకు నీతి మంచి చెప్పే, నిబద్దత గల బ్రాహ్మణత్వం లేదు, మన కోసం దేశం కోసం ప్రాణ త్యాగం చేసే క్షత్రియత్వం లేదు. ఇవి నేటి కులాలు కాదు మిత్రమా, ఆనాటి వ్రుత్తి ప్రవ్రుత్తి అంటే ఉద్యోగం పదవి లక్షణాలు.

మరి, ఇప్పుడు మన బుద్దుల్ని మనమే నీతి గా ఉంచుకోవాలి, మనల్ని మనమే తప్పుడు వారు నుంచి రక్షించుకోవాలి లేదా పరిస్తితులకు అందరము కుటుంబాలు ఆహుతి అవ్వాలి అవుతాము.

ఈ రోజు ఎలాగైతే, మన ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, సీయెం ల అసమర్ధ పిల్లలు తరాలు, మాకూ అదే పదవి తేలికగా ధనముతో హక్కు గా కావాలంటున్నారో, దానికి మనము భవిష్యత్ ను నాశనం చేసుకుంటూ, మూర్ఖత్వంతో బానిసత్వము తో అవకాశవాదం తో సరే అంటున్నామో, అలాగే వారూ గతములో తప్పటడుగు వేసి కనుమరుగు అయ్యారు, మనము ఈనాడు దిక్కులేని అనాధలము అయ్యాము.

ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, సీయెం అనేవి పదవులు, జన్మతో ధనముతో రావు రాకూడదు, సాధన లక్షణాలు క్రుషితో వస్తాయి రావాలి. అలాగే నాటి బ్రాహ్మణత్వం, క్షత్రియత్వం కూడా అంతే.

ప్రపంచ శాంతి కాముకులు అయిన, చిన్న దేశాలు అయి కూడా పెద్ద దురాశలతో సామ్రాజ్య అధికార కాంక్షతో బ్రిటిష్, డచ్, ఫ్రెంచ్ వారు వ్యాపారం పేరుతో వచ్చి, ప్రపంచ దేశాలను అలాగే భారతాన్ని, ఆ దేశ ప్రజలను బానిసలుగా ఎలా నరకయాతనకు గురి చేసారో, ఎన్ని మత మార్పిడులు చేసారో, వారి కబంధ హస్తం నుంచి స్వాతంత్రము సంపాదించడానికి, ఎన్ని కష్టాలు పడ్డామో, వెళుతూ కూడా, ఎలా విభజించారో, అందరము చూసాము చదివాము.

అలాగే ఇతర ప్రపంచ శాంతి కాముకులు, ఔరంగజేబ్, ఘజనీ లాంటి వారసుల వారిని కూడా చరిత్రలో చూసాము. ఇప్పుడు వారి వారసులు, అన్ని దేశాలకు గతాన్ని గుర్తు చేస్తున్నారు. బాలీవుడ్ వారికే జేజేలు కొడుతుంది, వాస్తవాన్ని దాచి, వారిని హీరోలు గా చూపిస్తూ.

ఆఫ్ఘన్ లో సొంత వారినే, ఎంత హింసకు గురి చేస్తున్నారో, విమానం రెక్కలు పట్టుకుని ఎలా పరుగులు తీసారో చూసాము, ఇంక ఇతర మతాల వారి పై హింసను చెప్పలేము ఊహించలేము.

పాకిస్తాన్ బంగ్లాదేశ్ లలో హిందువుల సంఖ్య, కనిష్ట స్థాయికి పడిపోయింది, తర్వాత తర్వాత అసలు ఉండకపోవచ్చు. ఎవరూ కూడా వారి బాగు గురించి ఎలుగెత్తి చాటరు, ఇతర మతాలకు ఉన్న పబ్లిసిటీ అండ ఈ జీవులకు ఉండదు.

మన దేశ మీడియా కూడా, అమ్ముడు పోయి, వీరి గురించి పట్టించుకోదు. ఈ వారం లో బంగ్లాదేశ్ లో, క్రిష్ణ మందిరం పై దాడిని చూపించదు. మన రాష్ట్రం లో పచ్చ మీడియా, బులుగు మీడియా లాగనే, నిజాలు చెప్పవు.

మరి మనదేశము లో, కాశ్మీర్ నరమేధము లాగనే, తెలంగాణా లో హైదరాబాద్ లో నిజాం రజాకార్ల విక్రుత చేష్టలు చూసాము. అలాగే కేరళా లో వీరి చేష్టలు గురించి కూడా సినిమాలు తీయమని అడుగుతున్నారు.

వివేక్ అగ్నిహోత్రి తీసిన కాశ్మీర్ ఫైల్స్ లాంటి వాస్తవ సంఘటన సినిమాలు, ముసుగు లౌకిక వాదులకు కనువిప్పు కల్గించి, శాంతి మతం పేరు తో చేస్తున్న అరాచకాలు, అకృత్యాలు తెలుసుకోవడం వలన, హైందవ సమాజం లో వచ్చే మార్పులు, రాబోయే తరాల భవిష్యత్ ను కాపాడుతుంది.

ప్రతి ఒక్కరూ ఈ సినిమాను తప్పక చూడాలి. వాస్తవాన్ని రాయాలన్నా, అలాగే సినిమాగా తీయాలి అన్నా, ధైర్యం ఉండాలి. మనమూ ప్రొత్సాహము చేయాలి.

కోట్లు వసూలు చేసిన రాజమౌళి బాహుబలి లాంటి సినిమాల వలన, సమాజానికి వినోదం తప్ప, వారికి లాభాలు తప్ప, ఏమైనా ఒరిగింది ఉందా? సిన్మా వినోదం వ్యాపారం కోసమే కాదు, వాస్తవం విలువలు ఆలోచన పెంచడానికి కూడా.

కాశ్మీర్ ఫైల్స్ చిత్రం, అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొంది, హిందువుల లేదా ఇతరుల వ్యధలు, వాస్తవ నగ్న సత్యాలు, ప్రపంచానికి భవిష్యత్ తరాలకు తెలియాలి.

* కథ 1990 లో మొదలవుతుంది! చిన్న పిల్లలైన క్రికెట్ ఆడుతుంటారు.! కొందరు పాకిస్థాన్ మద్దతుదారులైన క్రికెట్ ప్రియులు, మంచులో పడేసి కొడతారు..!

* జీహాదీ మూకలు ఇండియన్ ఆర్మీ వారిని చంపుతూ హిందు పండిట్స్ ను చంపేయడానికి తిరగాడుతూ ఉంటారు.

* మతం మారండి,చావండి లేదా పారిపోండి అంటూ మైకుల్లో చెపుతూ, కాల్పులు జరుపుతూ ఉంటారు..!

* మీరు హిందువులు కదా..!మీరు ఎన్నో రోజులు ఈ కాశ్మీర్ లో ఉండరు..!"అని పలుకుతారు..!

* ఇండియన్ ఆర్మి జీబును జీహాదీలు పేల్చేస్తారు..!

* డబ్బాలో దాక్కోమని తన భర్తకు చెప్తుంది..! ఆ జీహాదీలు ఆ బియ్యం డబ్బాను తూట్లు తూట్లుగా కాలుస్తుంటే చూస్తున్న మనకు కళ్ళలో నీళ్ళతో పాటు, ఆ డబ్బాలోంచి రక్తం కూడా.

* తన భర్త రక్తంతో తడిచిన బియ్యాన్ని తింటే మీ అందరిని చంపకుండా వదిలేస్తా అంటారు

* పసి వారు అని కూడా చూడకుండా జాలి దయ లేకుండా, అందరినీ వరుసగా నిలబెట్టి, ఎలా ఆ రాక్షస మ్రుగాలు తమ రక్త కాంక్షను తీర్చుకున్నాయో, మీరే చూడండి.

పండిట్ ల నే కాదు, మిగతా వారిని కూడా హింసించారు వారు. వారి లక్ష్యం స్పష్టం గా కనపడుతుంది, వారికి కనికరం లేదు. ప్రాణాలు అంటే, వారికి లెక్కనే లేదు. జనాలను బానిసలు గా చూస్తారు, అమ్మేస్తారు, వార్తలలో చూసాము.

మన జీవితాలు కూడా ఇలా కాశ్మీర్ పైల్ లో చూపించినట్టు, పతనం కాకూడదంటే మనం ఏం చేయాలి?

తదితర అంశాలను సినిమా చూసి నిజానిజాలు తెలుసుకుని, సనాతన ధర్మం తో, నిబద్దత తో, సంఘటితం వైపు అడుగులు వేస్తారని ఆశిస్తూ..... జై శ్రీరామ్..!  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2127 General Articles and views 1,918,115; 104 తత్వాలు (Tatvaalu) and views 229,346
Dt : 20-Mar-2022, Upd Dt : 20-Mar-2022, Category : Movie
Views : 628 ( + More Social Media views ), Id : 1313 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : vivek , agnihotri , kashmir , files , movie , secularists , hindu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content