మీ వ్యక్తిత్వాని కే, మీ కొత్త నాయకత్వాని కే మచ్చ, రాబోయే రోజుల్లో కూడా ఈ గూడుపుఠాని? - America/ NRI
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,919,821; 104 తత్వాలు (Tatvaalu) and views 229,481.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

తానా కొత్త ఎన్నికల నాయకులు, ముఖా ముఖి కి ధైర్యం లేదని, ముందే మీ విలువను తగ్గించుకున్నారు. భీరువులు గా కనీసం చాటు గా ఉండి, జవాబులు చెప్పమని కోరినా, మా 19 ప్రశ్నలకు జవాబులు రాలేదు, ముగ్గురు నుంచి కూడా.

ఈ 19 ప్రశ్నల జవాబులు పాటిస్తే, భవిష్యత్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి, అని మా నమ్మకము.link.

మీరు ఇతర చిన్న మీడియా ను, అలాగే తోటి తెలుగు వారిని గౌరవించి, ఫొన్ లో మాట్లాడి, ఆరోపణల గురించి, అవగాహన కల్పిస్తారు, అవి తప్పులు అవాస్తవాలు అని చెప్తారు అని అనుకున్నాము, ముందు.

కానీ ఒకరు తప్ప, మిగత ఇద్దరు మాట్లాడ లేదు, కరోనా లో కూడా, ముఠా ల తరపున విస్త్రుత ప్రచారం లో మునిగి.

గెలవక ముందే, మీరు ఇంత బాధ్యతా రహితము గా ఉంటే, జవాబుదారీ తనం లేకపోతే, గెలిచిన తర్వాత, ఇక మిమ్మల్ని పట్టుకోవడం జవాబు పొందడం, ఇతరుల వలన కాకపోవచ్చు.

ప్రశ్నలు పంపి, జవాబులు పంపినా చాలు అని కోరాము, మీకు తీరిక ఉండదేమో అని తెలిసి. ప్రచారం ముగిసినా, సమాధానము లేదు.

ఇది మీ వ్యక్తిత్వాని కే, అలాగే మీ కొత్త నాయకత్వాని కే మచ్చ, రాబోయే రోజుల్లో కూడా ఈ గూడుపుఠాని చేష్టలు ఆగవు.

గెలిచినా ఓడినా, మన సొంత విలువ వ్యక్తిత్వము కోల్పోకూడదు. ఎందుకంటే, ఏ రోజైనా, అవి బయటకు వస్తాయి.

తానా లేదా ఇతర తెలుగు సంస్థలు గొప్పవి, వాటి సేవలు ఇంకా గొప్పవి, ఎంతో సహాయం చేసాయి చేస్తాయి, అందులో సందేహము లేదు.

కానీ స్వార్ధ రాజకీయ చీడపురుగులు లాంటి నాయకులు చేరి, అక్కడ ఇక్కడా తమ అవసరాల కోసం సంస్థను వాడుకుంటూ, చెదలు మరియు భ్రష్టు పట్టిస్తున్నారు, ఇంకా పట్టిస్తారు, అన్నదే అమెరికా తెలుగు పౌరుల బాధ.

మీరు ఇతరుల మీద ఆరోపణలు కోసం పెట్టిన వీడియోలు, ఒక వర్గానివి పంపారు కొందరు. ఇంకోకరివి లేవా మరి ఉండి రాలేదో, తెలియదు. ఉంటే అవి కూడా పంపగలరు.

మీరు ధైర్యముగా మాట్లాడనప్పుడు, మేము విన్నది మాకు తోచింది రాసుకునే, సదావకాశాన్ని మీరే కలిగిస్తున్నారు. తర్వాత మమ్మల్ని తప్పు పట్టవద్దు.

తర్వాత రాబోయే కధనాలతో పాటుగా, ఆ వీడియోలు కూడా, అన్ని పార్టీల అధిష్టానాలకు పంపే ప్రయత్నము చేస్తాము. తెలుగు సంఘాల మంచి భవిష్యత్తు కై, మేము చేసే ప్రయత్నము లో, మనసున్న ప్రతి ఒక్కరు సహకరిస్తారని ఆశిస్తున్నాము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,919,821; 104 తత్వాలు (Tatvaalu) and views 229,481
Dt : 06-May-2021, Upd Dt : 06-May-2021, Category : America
Views : 807 ( + More Social Media views ), Id : 1156 , Country : USA
Tags : tana , election , stain , personality , leadership , mystery , issues , groups

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content