Naarayana Upanishat Meaning नारायण उपनिषत का अर्थ నారాయణోపనిషత్ అర్ధము - Devotional - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2185 General Articles and views 2,330,801; 104 తత్వాలు (Tatvaalu) and views 252,813.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Speak from the navel without stopping for at least 6 minutes. Even if there are some mistakes, elders can forgive, God can forgive.

కనీసం 6 నిమిషాలు ఆపకుండా పలకాలి నాభి నుంచి. కొన్ని తప్పులు ఉన్నా, పెద్దలు క్షమించ గలరు, ఆ దేవుడు మన్నించగలరు.

The Narayana Upanishad is one of the minor Upanishads, listed as number 18 in the extended anthology of 108 Upanishads recited by Rama to Hanuman in Hindu literature. It is written in the Sanskrit language, attached to the Krishna (Black) Yajurveda. It is one of the 14 Vaishnava Upanishads, and it recommends the bhakti of Narayana (Vishnu).

నారాయణ ఉపనిషత్తు చిన్న ఉపనిషత్తులలో ఒకటి, హిందూ సాహిత్యంలో రాముడు హనుమంతునికి బోధించిన 108 ఉపనిషత్తుల విస్తృత సంకలనంలో 18వ స్థానంలో ఉంది. ఇది కృష్ణ (నలుపు) యజుర్వేదానికి అనుబంధంగా సంస్కృత భాషలో వ్రాయబడింది. ఇది 14 వైష్ణవ ఉపనిషత్తులలో ఒకటి, మరియు ఇది నారాయణ (విష్ణువు) భక్తిని వివరణ చేస్తుంది.

The Upanishad is, among those that can be described as cult of formula, where meditation shifts from objects and philosophy to that of a specific formula.

ఉపనిషత్తు, ఫార్ములా యొక్క ఆరాధనగా వర్ణించదగిన వాటిలో ఒకటి, ఇక్కడ ధ్యానం వస్తువులు మరియు తత్వశాస్త్రం నుండి నిర్దిష్ట సూత్రానికి మారుతుంది.

The Narayana Upanishad posits, Om Namo Narayanaya, an eight-syllabled mantra, as a means of reaching salvation, which is communion with Vishnu. The text is classified as one of the Mantra Upanishads.

నారాయణ ఉపనిషత్తు, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే ఎనిమిది అక్షరాల మంత్రం, మోక్షాన్ని చేరుకునే సాధనంగా, ఇది విష్ణువుతో సహవాసం. వచనం మంత్ర ఉపనిషత్తులలో ఒకటిగా వర్గీకరించబడింది.

The Narayana Upanishad asserts that all gods, all rishis, and all beings are born from Narayana, and merge into Narayana.

సమస్త దేవతలు, ఋషులు మరియు సమస్త జీవులు నారాయణుని నుండి పుట్టి నారాయణునిలో కలిసిపోయారని నారాయణ ఉపనిషత్తు నొక్కి చెబుతుంది.

The text is probably compiled from passages from different era and texts.

వచనం బహుశా వివిధ యుగం మరియు గ్రంథాల నుండి సంకలనం చేయబడింది.

oṃ sa̱ha nā̍vavatu | sa̱ha nau̍ bhunaktu |
sa̱ha vī̱rya̍ṃ karavāvahai |
te̱ja̱svinā̱vadhī̍tamastu̱ mā vi̍dviṣā̱vahai̎ ||
oṃ śānti̱: śānti̱: śānti̍: ||

ओं स॒ह ना॑ववतु । स॒ह नौ॑ भुनक्तु ।
स॒ह वी॒र्यं॑ करवावहै ।
ते॒ज॒स्विना॒वधी॑तमस्तु॒ मा वि॑द्विषा॒वहै᳚ ॥
ओं शान्ति॒: शान्ति॒: शान्ति॑: ॥

ఓం స॒హ నా॑వవతు | స॒హ నౌ॑ భునక్తు |
స॒హ వీ॒ర్య॑o కరవావహై |
తే॒జ॒స్వినా॒వధీ॑తమస్తు॒ మా వి॑ద్విషా॒వహై.. ||
ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: ||

తా: సర్వ జీవులు రక్షింప బడు గాక. సర్వ జీవులు పోషింప బడు గాక. అందరూ కలిసి గొప్ప శక్తి తో కూడి పని చేయాలి. ( సమాజ ఉద్ధరణ కోసం) మన మేధస్సు వృద్ది చెందు గాక. మన మధ్య విద్వేషాలు రాకుండు గాక. ఆత్మా ( వ్యక్తిగత ) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాక.

oṃ atha puruṣo ha vai nārāyaṇo’kāmayata prajāḥ sṛ̍jeye̱ti |
nā̱rā̱ya̱ṇātprā̍ṇo jā̱yate | manaḥ sarvendri̍yāṇi̱ ca |
khaṃ vāyurjyotirāpaḥ pṛthivī viśva̍sya dhā̱riṇī |
nā̱rā̱ya̱ṇādbra̍hmā jā̱yate |
nā̱rā̱ya̱ṇādru̍dro jā̱yate |
nā̱rā̱ya̱ṇādi̍ndro jā̱yate |
nā̱rā̱ya̱ṇātprajāpatayaḥ pra̍jāya̱nte |
nā̱rā̱ya̱ṇāddvādaśādityā rudrā vasavassarvāṇi
ca cha̍ndāg̱ṃsi |
nā̱rā̱ya̱ṇādeva samu̍tpadya̱nte |
nā̱rā̱ya̱ṇe pra̍varta̱nte |
nā̱rā̱ya̱ṇe pra̍līya̱nte ||

ओं अथ पुरुषो ह वै नारायणोऽकामयत प्रजाः सृ॑जेये॒ति ।
ना॒रा॒य॒णात्प्रा॑णो जा॒यते । मनः सर्वेन्द्रि॑याणि॒ च ।
खं वायुर्ज्योतिरापः पृथिवी विश्व॑स्य धा॒रिणी ।
ना॒रा॒य॒णाद्ब्र॑ह्मा जा॒यते ।
ना॒रा॒य॒णाद्रु॑द्रो जा॒यते ।
ना॒रा॒य॒णादि॑न्द्रो जा॒यते ।
ना॒रा॒य॒णात्प्रजापतयः प्र॑जाय॒न्ते ।
ना॒रा॒य॒णाद्द्वादशादित्या रुद्रा वसवस्सर्वाणि
च छ॑न्दाग्ं॒सि ।
ना॒रा॒य॒णादेव समु॑त्पद्य॒न्ते ।
ना॒रा॒य॒णे प्र॑वर्त॒न्ते ।
ना॒रा॒य॒णे प्र॑लीय॒न्ते ॥

ఓం అథ పురుషో హ వై నారాయణోఽకామయత ప్రజాః సృ॑జేయే॒తి |
నా॒రా॒య॒ణాత్ప్రా॑ణో జా॒యతే | మనః సర్వేన్ద్రి॑యాణి॒ చ |
ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వ॑స్య ధా॒రిణీ |
నా॒రా॒య॒ణాద్బ్ర॑హ్మా జా॒యతే |
నా॒రా॒య॒ణాద్రు॑ద్రో జా॒యతే |
నా॒రా॒య॒ణాది॑న్ద్రో జా॒యతే |
నా॒రా॒య॒ణాత్ప్రజాపతయః ప్ర॑జాయ॒న్తే |
నా॒రా॒య॒ణాద్ద్వాదశాదిత్యా రుద్రా వసవస్సర్వాణి
చ ఛ॑న్దాగ్॒oసి |
నా॒రా॒య॒ణాదేవ సము॑త్పద్య॒న్తే |
నా॒రా॒య॒ణే ప్ర॑వర్త॒న్తే |
నా॒రా॒య॒ణే ప్ర॑లీయ॒న్తే ||

ఓం | అథ నిత్యో నా॑రాయ॒ణః | బ్ర॒హ్మా నా॑రాయ॒ణః |
శి॒వశ్చ॑ నారాయ॒ణః | శ॒క్రశ్చ॑ నారాయ॒ణః |
ద్యా॒వా॒పృ॒థి॒వ్యౌ చ॑ నారాయ॒ణః | కా॒లశ్చ॑ నారాయ॒ణః |
ది॒శశ్చ॑ నారాయ॒ణః | ఊ॒ర్ధ్వశ్చ॑ నారాయ॒ణః |
అ॒ధశ్చ॑ నారాయ॒ణః | అ॒న్త॒ర్బ॒హిశ్చ॑ నారాయ॒ణః |
నారాయణ ఏవే॑దగ్ం స॒ర్వమ్ |
యద్భూ॒తం యచ్చ॒ భవ్యమ్.. |
నిష్కలో నిరఞ్జనో నిర్వికల్పో నిరాఖ్యాతః శుద్ధో దేవ
ఏకో॑ నారాయ॒ణః | న ద్వి॒తీయో..స్తి॒ కశ్చి॑త్ |
య ఏ॑వం వే॒ద |
స విష్ణురేవ భవతి స విష్ణురే॑వ భ॒వతి ||

ఓమిత్య॑గ్రే వ్యా॒హరేత్ | నమ ఇ॑తి ప॒శ్చాత్ |
నా॒రా॒య॒ణాయేత్యు॑పరి॒ష్టాత్ |
ఓమి॑త్యేకా॒క్షరమ్ | నమ ఇతి॑ ద్వే అ॒క్షరే |
నా॒రా॒య॒ణాయేతి పఞ్చా..క్షరా॒ణి |
ఏతద్వై నారాయణస్యాష్టాక్ష॑రం ప॒దమ్ |
యో హ వై నారాయణస్యాష్టాక్షరం పద॑మధ్యే॒తి |
అనపబ్రవస్సర్వమా॑యురే॒తి |
విన్దతే ప్రా॑జాప॒త్యగ్ం రాయస్పోష॑o గౌప॒త్యమ్ |
తతోఽమృతత్వమశ్నుతే తతోఽమృతత్వమశ్ను॑త ఇ॒తి |
య ఏ॑వం వే॒ద ||

ప్రత్యగానన్దం బ్రహ్మ పురుషం ప్రణవ॑స్వరూ॒పమ్ |
అకార ఉకార మకా॑ర ఇ॒తి |
తానేకధా సమభరత్తదేత॑దోమి॒తి |
యముక్త్వా॑ ముచ్య॑తే యో॒గీ॒ జ॒న్మ॒సంసా॑రబ॒న్ధనాత్ |
ఓం నమో నారాయణాయేతి మ॑న్త్రోపా॒సకః |
వైకుణ్ఠభువనలోక॑o గమి॒ష్యతి |
తదిదం పరం పుణ్డరీకం వి॑జ్ఞాన॒ఘనమ్ |
తస్మాత్తదిదా॑వన్మా॒త్రమ్ |
బ్రహ్మణ్యో దేవ॑కీపు॒త్రో॒ బ్రహ్మణ్యో మ॑ధుసూ॒దనోమ్ |
సర్వభూతస్థమేక॑o నారా॒యణమ్ |
కారణరూపమకార ప॑రబ్ర॒హ్మోమ్ |
ఏతదథర్వ శిరో॑యోఽధీ॒తే ప్రా॒తర॑ధీయా॒నో॒
రాత్రికృతం పాప॑o నాశ॒యతి |
సా॒యమ॑ధీయా॒నో॒ దివసకృతం పాప॑o నాశ॒యతి | మాధ్యన్దినమాదిత్యాభిముఖో॑ఽధీయా॒న॒:
పఞ్చపాతకోపపాతకా..త్ప్రము॒చ్యతే |
సర్వ వేద పారాయణ పు॑ణ్యం ల॒భతే |
నారాయణసాయుజ్యమ॑వాప్నో॒తి॒ నారాయణ సాయుజ్యమ॑వాప్నో॒తి |
య ఏ॑వం వే॒ద | ఇత్యు॑ప॒నిష॑త్ ||

ఓం స॒హ నా॑వవతు | స॒హ నౌ॑ భునక్తు |
స॒హ వీ॒ర్య॑o కరవావహై |
తే॒జ॒స్వినా॒వధీ॑తమస్తు॒ మా వి॑ద్విషా॒వహై.. ||
ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: ||

*నారాయణ ఉపనిషత్ భావము:-

1.నారాయణుడే ఆది పురుషుడు. ఇది సత్యము. నారాయణునకు ప్రజలను సృష్టించవలెనను కోరిక కలిగినది .అపుడు మొదటగా నారాయణుని నుండి ప్రాణము(ప్రాణవాయువు) ఉద్భవించినది.ఆ తరువాత మనస్సు,ఇంద్రియములు,మరియు ఆకాశము,వాయువు, అగ్ని,జలము,భూమి వీటన్నింటికీ అధారమైన విశ్వము ఉద్భవించినవి. నారాయణుని నుండి బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు ప్రజాపతులు ఉద్భవించిరి.నారాయణుని నుండి ఆదిత్యులు(12) రుద్రులు(11) వసువులు(8) ఉద్భవించిరి.మరియు వేద చందస్సు ఉద్భవించినది. ఇవన్నియూ నారాయణుని యందే పుట్టుచున్నవి.ప్రవర్తిల్లుచున్నవి. నారాయణునియందే విలీనమగుచున్నవి. ఇది ఋగ్వేద ఉపనిషత్తు.

2.నారాయణుడు శాశ్వతుడు. నారాయణుడే బ్రహ్మ. నారాయణుడే శివుడు. నారాయణుడే ఇంద్రుడు. నారాయణుడే కాలుడు(మృత్యుదేవత).నారాయణుడే ఉర్ధ్వ-అధోదిక్కులు.లోపల వెలుపల (శరీరములోనున్న-బయటనున్న)ఉన్నది నారాయణుడే. సర్వము నారాయణుడే.ఇది సత్యము. భూతభవిష్యత్ వర్తమానములు నారాయణుడే. విభాగములు లేక ఒక్కటిగా నున్నది నారాయణుడే. సర్వమునకు ధారభూతుడు, దోషరహితుడు, భావింపశక్యముకానివాడు, వర్ణింపనలవికానివాడు, పవిత్రుడు, దివ్యుడు అయిన దేవుడు నారాయణుడు ఒక్కడే. ఆ నారాయణుడే విష్ణువు. ఆ నారాయణుడే సర్వవ్యాపి అయిన విష్ణువు. ఇది యజుర్వేద ఉపనిషత్తు.

3. ఓం అని మొదటగా ఉచ్చరించవలెను. తరువాత నమ: అని ఉచ్చరించవలెను. తరువాత నారాయణాయ అని ఉచ్చరించవలెను. ఓం అనునది ఏకాక్షరము. నమ: అనునది రెండక్షరములు. నారాయణాయ అనునది ఐదక్షరములు.ఈ విధముగా నారాయణుడు ఓం నమో నారాయణాయ అను అష్టాక్షరి మంత్రముగా రూపుదిద్దుకొనినాడు.

ఈ అష్టాక్షరి మంత్రమును పఠించుట వలన సర్వారిష్టములు తొలగును. సంపూర్ణ ఆయురారోగ్యములు సిద్ధించును.

సంతానము, యశస్సు, ధనము, గోగణములు వృద్ధి చెందును. ఆ తరువాత అమృతత్వము (ముక్తి)సిద్ధించును.ఇది సత్యము. ఇది సామవేద ఉపనిషత్తు.

4.పురుషుడైన నారాయణుని ప్రణవస్వరూపమైన ఓంకారమును పఠించుట వలన సంపూర్ణమైన ఆనందం కలుగును. ఓంకారము అకార,ఉకార,మకారములతో ఏర్పడినది.ఎవరు సదా ఓంకారమును ఉచ్చరింతురో వారు(యోగి)జన్మసంసార బంధముల నుండి విముక్తులగుదురు. ఓం నమో నారాయణాయ అను ఈ అష్టాక్షరీ మంత్రమును ఎవరు ఉపాసింతురో వారు శ్రీమన్నారాయణుని వైకుంఠమునకు చేరుదురు.అది పరమ పురుషుని హృదయకమలం.అది ఇంద్రియాతీతమైన విజ్ఞానముతో నిండియున్నది.ఆ కారణముచే ప్రకాశించుచున్నది.

దేవకీపుత్రుడైన శ్రీకృష్ణుడు బ్రహ్మము. మధువు అను రాక్షసుని చంపిన విష్ణువు బ్రహ్మము. పుండరీకాక్షుడు బ్రహ్మము; అచ్యుతుడు బ్రహ్మము.ఓంకారమే బ్రహ్మము. సర్వభూతములలో ఒక్కడుగా నున్నది నారాయణుడే. కారణరూపమైన అకారపరబ్రహ్మమే ఓంకారము.ఇది అధర్వణవేద ఉపనిషత్తు.

ఈ నారాయణ ఉపనిషత్తును ఉదయ,మధ్యాహ్న,సాయం సమయముల ఎప్పుడైనను పఠింతురో వారు పంచమహాపాతకములనుండి ,ఉపపాతకముల నుండి విముక్తులగుదురు.మరియు వారికి సర్వవేదములు పారాయణ చేసిన పుణ్యము లభించును.నారాయణ సాయుజ్యము(మోక్షము) లభించును.ఇది సత్యము.అని ఉపనిషత్తు ఉపదేశించుచున్నది.

నారాయణుడు అవ్యక్తము కంటే అతీతుడు. అవ్యక్తమునుండే ఈ బ్రహ్మాండము పుట్టినది. ఈ బ్రహ్మాండములోనే పదునాల్గు లోకములు, సప్తద్వీపములు,భూమి ఉన్నాయి. ఓం శాంతి: శాంతి: శాంతి:!!  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,330,801; 104 తత్వాలు (Tatvaalu) and views 252,813
Dt : 01-Jan-2024, Upd Dt : 01-Jan-2024, Category : Devotional
Views : 563 ( + More Social Media views ), Id : 104 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : naarayana , upanishat , meaning , om , saha , navavatu , atha , purusho , narayano NaarayanaUpanishat
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు