నాయకులు, అధికారులు ను నిర్భయంగా ప్రశ్నిస్తున్నారు. లక్ష్యం? పదవి? గాడ్ ఫాదర్? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2092 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2127 General Articles and views 1,918,352; 104 తత్వాలు (Tatvaalu) and views 229,378.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఏవండీ మీరు నాయకులు, అధికారులు ను నిర్భయంగా ప్రశ్నిస్తున్నారు. మీ లక్ష్యం ఏమిటి? పదవి తీసుకుంటారా? గాడ్ ఫాదర్ ఉన్నారా?

జవాబు, కృష్ణుడు యుద్ధం లో ఎందుకు పాల్గొన్నారు? ఏమి తన సొంతానికి లాభం పొందు దామని అలా చేశారు, అందరితో తిట్లు తిన్నారు? రాజ్యమా ధనమా భోగమా? కేవలం ధర్మం, న్యాయం మాత్రమే కదా. అసలు అన్న దమ్ముల ఆస్తుల గొడవలకి, వారి అహంకార చేష్టలకు, కృష్ణుడు స్వభావానికి సంబంధము ఉందా? ఆఖరికి, పాండవులు కూడా, కొన్ని సార్లు ఆయననే తిట్టారు, తర్వాత క్షమాపణ చెప్పారు.

మనము ఎవరిని కూడా ద్వేషించ లేదు. కొన్ని విధానాలను మాత్రమే తప్పు అన్నాము, వారి మరియు వారి వారసుల భవిష్యత్ కోసము మాత్రమే.

ఎదైనా పేపర్లో వార్త చూస్తే, దైవ స్పురణ కలిగి మాటలు తన్నుకు వస్తాయి, ఆలోచన చేసి రాయము. మంచి వాటిని పొగిడాము, ఏ పార్టీ అయినా.

ఎవరి వ్యక్తిగత జీవితమును విమర్శించలేదు. ఎక్కడైనా పొరపాటుగా ఉంటే అమర్యాద గా ఉంటే, చెప్పగలరు, తీసేద్దాము సరిచేద్దాము.

వాస్తవ వాది, లోక విరోధి అంటారు. నిజం చెప్పేవారికి, అందరూ దూరముగా ఉంటారు. నిజాలు చెప్పే రాసే మేము, ప్రత్యక్ష పదవికి పనికిరాము.

ప్రజలు నిజాలు నమ్మరు, అబద్దాలతో నమ్మించి మోసము చేసే వారికే బ్రహ్మ రధము పడతారు. ఎందుకంటే, వాళ్ళు కూడా, ప్రజాస్వామ్యాన్ని తమ అవసరం అవకాశం వర్గం వంటి వాటికొసం మోసము చేస్తారు కాబట్టి.

నిర్భయం కూడా తప్పే, పిల్లి అన్నా భయమే. ఇంత వరకు, నాయకులు అధికారులు, వాట్సాప్ ఆపుకుని పారిపోయారే గానీ, ఎవరు మనల్ని బెదిరించలేదు. అధికార పక్ష నాయకులు కూడా. వారి మంచితనము అంటే బాగుంటుంది.

ఎటువంటి ఆశ లేదు, ఇలాగే చాటుగా ఉండి సలహాలు మాత్రమే, అన్ని పార్టీలు మరియు సంఘాలు ఒకటే.

మా వృత్తి లో మేనేజర్ పోస్ట్ ఇస్తామన్నా, వద్దు అని చెప్పాము. ఎందుకంటే, నీతిగా ఉండమంటే, అక్కడ ఏ పనులు సాగవు, మొత్తము ఆగిపోతుంది. మనవలన వారికి కష్టం కారాదు.

కుటుంబములో, భార్య భర్త మధ్య సమాచారం కూడా, ఇంకో వైపు 20 ఏళ్లుగా చేరలేదు, చేరదు. అంత రహస్యం, వ్యక్తిగత నమ్మకం.

మా ఇంట్లో నే లేదా మా స్నేహితులే, నాకు ఒక్క ఓటు కూడా వేయరు. ఎందుకంటే నేను గెలిస్తే, ఉదయం 5 కి లెగవమంటాడు, గుడిలో ఉత్త పాదాలతో పొద్దున్నే 108 ప్రదక్షిణలు చేయమంటాడు, చాప మీద పడుకోమంటాడు, ముదుసలి తల్లి ని చూడమంటాడు, శాఖాహారం తినమంటాడు, తక్కువ సౌకర్యాలు తో ఒదిగి ఉండమంటాడు, పక్కన ఇంట్లో బండి వద్దు చెత్త వద్దు అంటారు. ఎందుకొచ్చిన తలనొప్పి లే అని.

ఇలాంటివి, ఎవరికీ నచ్చదు కదా. ఉంటే నువ్వు నీతిగా ఉండు, మేమెందుకు మా కుటుంబ పతనం ఆపుకుని మరీ, నీతిగా ఉండాలి అంటారు ఎక్కువ మంది, కాదా? నీతులు ఇతరులకు చెపడానికే గాని, ఆచరించడానికి కాదు కదా?

ఒక స్నేహితుడు అడిగాడు, నీ మాటలు కటువుగా ముల్లు గుచ్చుకున్నట్లు ఉంటాయి అని. అతనితో అన్నా, నిజం నిప్పు లాంటి ది, సత్యం వేప చేదు లాంటిది అని, చదవలేదా? మీ తల్లి దండ్రులు అలాంటి మంచి మాటలు చెప్పరా? నా మాట ముల్లు కాదు, నువ్వు చేస్తున్న పనులు తప్పు అని ఎప్పుడు ఒప్పుకుంటావు?

చాటుగా తల్లి తండ్రి స్నేహితుడు, ముల్లు లాంటి నగ్న సత్యం చెప్పి, నిన్ను పతనం కాకుండా, మంచిదోవలో చాటుగా మార్చడం మంచిదా? అది తక్కువ అవమానమా? లేక రేపు భాగస్వామి, పిల్లలు, ఊరంతా ఊయడం, తక్కువ అవమానమా బాధా ముల్లులా అని?

మన మాట నమ్మలేదు, వినలేదు. ఇప్పుడు వారికి, వారి ఇంట్లోనే విలువ లేదు, ఊళ్ళో బజారులో పరువు లేదు. కొందరు అనాధలుగా, ఇంకొందరు రోగాలు తో లేదా అనాధ ఆశ్రమం లో ఒంటరి బతుకు కు సిద్ధం అవుతున్నారు, ఇన్నాళ్ళు తమను మార్చుకోలేక.

ఇలాంటి వారు ఎందరో మోహములో, మూర్ఖంగా కుటుంబం జీవితం ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంకా కొందరు, అదే పనిలో వడి వడి గా అడుగులు వేస్తూ ఉన్నారు.

ఇక గాడ్ ఫాదర్ అన్నారు కదా, ట్రంప్, బైడెన్, మోడీ, రాహుల్, పవనన్న, జగనన్న, చంద్రన్న, వీరన్న, ల తో పాటు గా, ఈ సందేశము అందుకునే, మీరంతా కూడా గాడ్ ఫాదర్ లే, గురువులే, శ్రేయోభిలాషులే.

నిజాయితీ గల వ్యక్తులు, అధికారులు మరియు నాయకులను బయటకు తెచ్చి, మంచిని పొగడాలి, ఇంకా పెంచాలి అంతే. ఇంక మనకేమీ వద్దు. ఎందుకంటే, మనకు పదవి వస్తే, దాని తో పాటు పతనము కూడా తోడు వస్తుంది.

ఎవరినైనా విమర్సలు చేయకుండా, వదిలామా 1000 పైగా కధనాలు లో చూసి, మీరే చెప్పగలరు. మీరు తప్పు చేయవద్దు, నేనూ తప్పు చేయను. తప్పు చేసినా, నా వద్ద దాయవద్దు, నిజాయితీ గా ఒప్పుకుంటే, ఎటూ మీ గోప్యత కాపాడబడుతుంది కదా, భయము ఎందుకు? చెడ్డ వారికి 100 సార్లు చెప్పి వదిలేయడమే, వారితో తగవు తన్నులు, మనకు అవసరం లేదు.

నేను మంచి వాడిని అని ఎప్పుడూ చెప్పలేదు, మీ కన్నా చెడ్డ వాడిని, అందుకనే ప్రదక్షిణాలు చేస్తున్నా అని అందరి ఎదురు ఒప్పుకున్నా గదా? మీరంతా నా గురువులు అంటే, ఇంక శిష్యుడు చవట దద్దమ్మ చెడ్డ వాడు అని, ఏ మంచి గురువుకి నిరూపించాల్సిన పని లేదు కదా? ప్రభుత్వం నుంచి, రూపాయ తీసుకోలేదు, నాది ప్రవేటు జీవితం, నా వ్రుత్తి పరముగా, అలాగే విలేఖరిగా కూడా.

కరోనా గురువు కోరితే, మరణానికి కూడా సిద్ధమే. ప్రాపంచిక మోహం వ్యామోహం, అన్ని పతనాలకు మూలం. వాటికి దూరంగా ఉండి, దైవం నడిపిస్తున్న నాటకాలు ను గమనిస్తూ, మనలోనే ఆనందం పొందాలి సుమా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2127 General Articles and views 1,918,352; 104 తత్వాలు (Tatvaalu) and views 229,378
Dt : 31-Mar-2021, Upd Dt : 31-Mar-2021, Category : General
Views : 809 ( + More Social Media views ), Id : 1063 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : leaders , officials , questioned , fearlessly , goal , position , godfather , andhra , india , usa , trump , biden , modi , rahul , jagan , chandra , pavan , somu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content