పెద్దలు కు కూడా ఆశలు, తిరగాలి జనం లో అని ఉంటుంది, 60 ఏళ్ల మనిషి అయితే అణిచేస్తారు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,919,026; 104 తత్వాలు (Tatvaalu) and views 229,416.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఈ వారాంతం అంతా, త్యాగయ్య రామదాసు వంటి గొప్ప భక్తులు ను స్మరిస్తూ, భద్రాద్రి శ్రీ సీతా రామచంద్రుని, సంకీర్తన తో సరిపోయింది. నను బ్రోవమనీ చెప్పవే సీతమ్మ తల్లి, ఏ తీరుగ నను దయ చూసెదవో, అందరూ మహా ను భావులే, లాంటి ఎన్నో మధుర సంకీర్తనలు.

అమ్మ ఎప్పుడు లాగనే, ఉదయం 4.30 కల్లా లెగిచి, 8 కల్లా ముస్తాబు అయి, రెడీగా కూర్చొని ఉంటుంది. 6 ఏళ్ల పసిపిల్లలా, ఎప్పుడు అక్కడ కు తీసుకుని వెళతావు అని. పెద్దలు కూడా ఆశలు, తిరగాలి జనం లో అని ఉంటుంది కదా. 6 ఏళ్ల పిల్ల అయితే పరుగెత్తుతాము, 60 ఏళ్ల మనిషి అయితే వారి భావాలను అణిచేస్తారు ఎక్కువ మంది, కూర్చో ఓ పక్కన విసిగించకుండా అని.

లేటు అయితే, ఏదో ఊళ్ళో చుట్టాల పెళ్లి అయిపోతుంది అన్నట్టుగా, ఈ దైవ కార్యక్రమం కోసం పరుగులు, తాను నాకన్నా ముందు. జై ఆంజనేయ అంటూ, బండి స్టార్ట్ చేస్తాము ఎప్పుడూ. జెండా పై కపిరాజు తోడుగా, ఇన్నాళ్లు హనుమాన్ కాపాడారు కదూ.

అక్కడ, అందరూ బిజీ, భక్తి సంగీత గీతామృతంతో ముస్తాబు అయి, శ్రావ్యంగా పాడుతూ ఉంటారు. సమిష్టి పని లో ఎంతో బలం ఉంటుంది, ఇటువంటి కార్యక్రమంలో. ఇంట్లో మాత్రం, సొంత వాళ్ళు తో మాట కలవదు మనకు.

పార్కింగ్ కూడా దొరకనంత మంది, బాబోయి, చుట్టూ రౌండ్లు ఖాళీ కోసము. ఈ దేశంలోనే ఎండగల రాష్ట్రంలో సిలికాన్ వాలీ ప్రాంతంలో, ఇసుక రాలనంత భారత జనం, తెలుగు వారూ ఎక్కువే. అయినా కూడా ఈ సంకీర్తన అమృతం ఆస్వాదించడానికి, వచ్చారు అంత పొద్దున్నే అంటే, వారి పాదాలకు నమస్కరించాలి.

కార్యక్రమం వాళ్ళు, మధ్యలో స్వీటు లేదా పొంగలి ఇస్తారు గుడి అయితే. ఈ రోజు వీరు పానకం వడపప్పు ఇచ్చారు. గబుక్కున గొంతులో కి వెళ్ళిపోయింది, షుగరు ఉంది, 7 బిళ్ళలు మింగుతూ, కొడుకు కని పెట్టుకుని తోడుగా ఖాళీగా ఉన్నాడు అని అనుకోకుండా. తప్పు కదమ్మా అంటే, నే నడగలేదు, వాళ్ళే పెద్ద దాన్ని అని తెచ్చి ఇచ్చారు, అని సర్దే జవాబు.

పిల్లలు కూడా అలాగే చెపుతారు కదూ, తప్పు కప్పి పుచ్చడానికి. అలాంటి చిలిపి పనులు ఎన్నో. కూర్చోబెట్టి పక్కకు వెళితే, మాయమై పోతుంది కొన్ని సార్లు, కంగారు గా వెతుక్కుంటూ ఉంటే, మరలా రెస్ట్ రూం నుంచి బయటకు. ఇలా నా కూతురు (అమ్మ) తో వారం జరిగిపోయింది.

మీరూ మీ పెద్ద వయసు తల్లి దండ్రులు చిలిపి పనులు గురించి అందరికీ చెప్పి, మా లాంటి చిన్న వారిని ప్రోత్సాహం చేస్తారు కదూ.

పిల్లలు మనం తెచ్చుకున్న వారు, మన అరిషడ్వర్గాలు తో. కానీ తల్లి దండ్రులు, దేవుడు ఇచ్చిన వరం, మన ప్రమేయం లేకుండా నే, మరువద్దు.

భవిష్యత్తు వెలుగు కనపడకపోయినా, భగవంతుని దే భారం, మంచి కి మార్గం ఉంటుంది, ఇక్కడ లేదా అక్కడ అయినా అని ఓ మూల ఆశ. మంచి ఆశే, ముందుకు నడుపుతుంది. ఆయనే దోవ చూపిస్తారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,919,026; 104 తత్వాలు (Tatvaalu) and views 229,416
Dt : 16-Feb-2020, Upd Dt : 16-Feb-2020, Category : General
Views : 957 ( + More Social Media views ), Id : 341 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : elders , caring parents
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content