Blog Updates and Tips
           
మిత్రులకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ లో మీ ఆర్టికల్ ని పంచుకోవాలి అనుకుంటున్నారా?
మీకు మీ రచనా మరియు ఫోటో నైపుణ్యము మీద నమ్మకము ఉన్నదా? పది మందికి అది చూపించాలి అనుకుంటున్నారా? గూగుల్ లో వెతికితే, మీ ఫొటోలు లేదా రచనలు కనపడాలి, అని అనుకుంటున్నారా?

మీ మిత్రులకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ లో తేలికగా మీ ఆర్టికల్ ని పంచుకోవాలి అనుకుంటున్నారా? జూనియర్ విలేఖరి లాగా ఉచిత ట్రైనింగ్ చేద్దాము అనుకుంటున్నారా?

మీ టాలెంట్ తో, ఇప్పుడు మీరు కూడా ఆ ప్రయత్నం చేయవచ్చు. మీకూ చక్కగా ఫోటోలు దగ్గరగా దూరంగా, ఫోన్ లేదా డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ తో తీయడం వస్తే, అది తేలికే మరి. ఓ నాలుగు మాటలు ఒకటి లేదా రెండు పేరాల్లో, తేలికైన సరళమైన తెలుగు లేదా ఇంగ్లీషు లో రాయవచ్చు.

10 వ తరగతి వారికి కూడా అర్ధము అయ్యేటట్లు ఉండాలి. రాతలో తప్పు ఒప్పు గురించి ఆలోచన వద్దు, కొన్ని మేము సరిచేస్తాము. అవి మీ పేరు, హోదా, ఊరు పేరు తో ఈ వెబ్సైట్ లో పెట్టవచ్చు, మాకు నచ్చితే. ఫేస్బుక్, ట్విట్టర్ లో మీకు టాగ్ చేస్తాము. మా సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తాము. మీకు హబీ ఉండి ఉచితంగా చేద్దాము అనుకుంటే ప్రయత్నము చేయండి.

మీ పనితనం టాలెంట్, ఇంకో పదిమంది చూస్తారు, దానికి మీరు ఏమి చెల్లించనవసరము లేదు, నచ్చితే ఉచితము గా అప్లోడ్ చేస్తాము. వెబ్సైట్ లో పెట్టాక అన్ని హక్కులు మావి. రచన లేదా ఫోటోలు సరిగ్గా లేకపోతే సవరణలు ఉన్నా లేదా ఇప్పుడు పెట్టకపోయినా కోప తాపాలకు, వాదోప వాదాలకు తావు లేదు.

తుది నిర్ణయము మాదే. అంటే, రచనా లేదా ఫోటోలు, ఇంకా బాగా ప్రయత్నం చేసి మెప్పించ గలగాలి. తెలిసి నమ్మకము ఉన్నవారికే ఈ అవకాశము, ఎందుకంటే ప్రతిసారి అన్ని వివరాలు చెక్ చేయలేము కదా.

వేరే వారిని తూలనాడుతూ, దూషిస్తూ ఉండకూడదు. అందరూ మెచ్చే విధముగా ఉండాలి. మీ సొంత రచన మరియు ఫొటో అని మీరు ఇమైల్ లో స్పష్టత ఇవ్వాలి, వేరొకరివి కాపీలు చేయ వద్దు. లీగల్ ఇబ్బందులు వస్తే, మీరే బాధ్యత వహించాలి. దొంగతనము గా లేదా వద్దు అన్న చోట ఫోటోలు తీసి, పంపరాదు.

ఉదాహరణకు , శ్రీశైలం లేదా రామేశ్వరం లేదా బెంగళూరు లేదా ముంబై లేదా ఇంకో ఊరు సందర్శనా స్థలానికి వెళ్ళారు. లేదా మీ వూరి లేదా ఉద్యోగము గురించి, ఏదో మంచి మాటలు నలుగురు కోసము, రాయాలి అనుకున్నారు. అమెరికా లేదా ఏ విదేశము అయినా కూడా అంతే.

మంచి ఫోటో లు తీసారు మంచి కెమెరా తో, అందులో మంచివి ఎన్నుకోండి. ఫోటోలు లో మనం ఉండకూడదు లేదా ఎవరో ఒకరిని కావాలని ప్రొజెక్ట్ చేయకూడదు, దూరంలో ఒకటి రెండు ఉండవచ్చు. ప్రదేశం లేదా ఈవెంట్ లేదా ఏదైనా మంచి విషయము గురించి మాత్రమే.

దర్శించిన గుడి గురించి కొంత మీకు తెలుసు, కొంత అక్కడ విన్నారు, నెట్ లో కనుగొన్నారు. ఫోన్ లో లేదా పుస్తకం లో ఆ వివరాలు మరియు రోజు మరియు సమయము రాసుకోండి, ఆ ప్రదేశము తిరిగి ఆనందించేటప్పుడు.

ఆ తర్వాత ఇంటికి వచ్చాక తీరికగా, మీ రచనలు సరిచేసుకోవచ్చు. మంచి ఫోటోలు 10 సెలక్ట్ చేసుకుని, ఇమెయిల్ వాట్సాప్ లో పంపవచ్చు. ప్రయత్నం చేయండి, నష్టమేముంది, మన గురించి ఇంకో పదిమందికి తెలుస్తుంది.


APLatestNews logo You can find our latest updates or feature information here.


Archives
2019(1)
2018(1)
2016(1)
2013(1)
2012(8)