ఎవరికి పౌరుషం ఉంది ఎవరు రాజీనామా చేయాలి? ప్రజలకా, నాయకులకా? వీరంతా రాజీనామా లు చేస్తారా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,214; 104 తత్వాలు (Tatvaalu) and views 225,132.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఎంపీ రఘురామ కు పౌరుషం ఉంటే, తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ లా రాజీనామా చేయాలి అని సవాల్ విసిరారు, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్.

ఇలాంటి ప్రశ్నలు, అభివృద్ధి గురించి పట్టించుకోకుండా, ప్రజలకు నియోజకవర్గం కు దూరంగా ఉండే, 15 ఏళ్లుగా ఉన్న మా బాపట్ల ఎంపీల లాంటి వారు అడగవచ్చు. కానీ, విజ్ఞులు ప్రజలతో మమేకం అయ్యేవారు, బాధ్యత గలవారు, అడగరు ఎక్కడ కూడా.

ఎందుకంటే, ఒకటి అటు చూపిస్తే, మనవైపు 4 వేళ్ళు ఉంటాయి. ఆఖరికి కోర్టు లతో కూడా గొడవలు పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయనే సుప్రీం లో ఉన్నారు.

ఎక్కడ తగ్గాలో తెలీదు, చెడిన విషయాన్ని మరలా సరి చేయడం తెలీదు.

ఈ వారంలో పర్యటనకు వస్తే, కనీసం పెద్ద స్ధాయి మంత్రులు నాయకులు వెళ్లి పలకరించి, సానుకూలంగా చేసుకోవాలి. మనకు అది చేతకాదు. కేసీఆర్ చూడండి, ఎంత దగ్గరగా వెళ్ళి ఉండి, గౌరవించారో.

గత లేదా ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు లేదా నాయకులు ఎవరికైనా పౌరుషం ఉందా? అని ప్రజలు విస్తుపోతున్నారు.

ముందు అవకాశం అవసరం వర్గం చూసి, ధనం తో ఓటు వేసే, ఓటర్లం ప్రజలం, మాకే పౌరుషం లేదు.

కాబట్టి, మా నుంచి, మాచే ఎన్నిక కాబడ్డ, మన నాయకులకు పౌరుషం ఆత్మాభిమానం ఉండాలా? ఉంటుందా? ఉందా? అని గుసగుసలు.

అసలు పౌరుషం అంటే ఏమిటి, నాయకత్వం కు పార్టీ కి బానిసలుగా ఉండి, చెడ్డ స్వార్థ పనులు కు కూడా, నీ ఇష్టం దొరా అని, ఆత్మ ను చంపుకుని, తల ఊపడమా లేక వంచడమా?

మనం జైలు కు ముందు పాత రఘరామా సంగతి వదిలేస్తే, జైలు తర్వాత కొత్త రఘురామా ను పొగడాలి. అనవసరంగా వాదనలు లేవు, అన్ని గౌరవం గా లేఖలు మీద లేఖలు ఉన్నాయి.

డమ్మీ లు గా ఉన్న, గత నాయకుల మంత్రుల వారసుల, దీన స్ధితిని చూస్తున్నాము కదా. వారి పేర్లు వద్దు లే, ఇప్పుడు.

రఘురామా, మన నవరత్నాల హామీలు, మన జగనన్న పని ఒత్తిడి లో మరచిపోతే, వరుసగా గుర్తు చేస్తున్నారు.

మనం ధైర్యంగా, అవన్నీ అమలు చేస్తున్నామని, సాక్ష్యాలతో ప్రజలకు చెప్పాలి గట్టిగా.

మిగతా మన ఎంపీలు ఎమ్మెల్యేల కు ఆ బాధ్యత లేదా? కనీసం ప్రతిపక్ష తెదేపా, బీజేపీ, జనసేన నాయకులు కూడా, అంత వివరంగా తెలుగు లో లేఖలు రాయలేకపోతున్నారు.

ఒక్క సారి ఈ క్రింది అమాయకపు ప్రశ్నలు వేసుకుందాం, రోషం ధైర్యం ఉంటే?

1. ఏ ఎంపీ ఎమ్మెల్యే అయినా, మేము ధనం ఇవ్వకుండా పార్టీ నుంచి ఉచిత సీటు తెచ్చుకోవడం, అలాగే ధనం పంచకుండా ప్రజల నుంచి గెలవడం జరిగింది, అని దైవం పై, తమ బిడ్డలు పై ప్రమాణం చేస్తారా?

2. రాష్ట్రంలో ఉండని ప్రతి పక్ష నాయకులు, అలాగే నియోజకవర్గ పరిధిలో ఉండని ఎమ్మెల్యే ఎంపీలు, అన్ని రోజులు కు జీతం తీసుకోకుండా, రాజీనామా చేస్తారా?

చంద్రన్న ను రాజీనామా చేయమనే ధైర్యం, తెదేపా లో ఎవరికైనా ఉందా?

3. సీఎం రమేష్, సుజనా, కరణం లాంటి నాయకులు, అన్నం పెట్టి పదవి ఇచ్చిన,

నాటి తెదేపా అవినీతి అక్రమ అరాచకాలు మాకు వద్దు, చంద్రన్న పనికిరాని నాయకత్వం మాకు వద్దు అని, కష్టకాలం లో తోడు ఉండకుండా, పార్టీలు మారారు ఇప్పుడు నిస్సిగ్గుగా.

మరి వారు ఎందుకు రాజీనామా చేయరు, తెదేపా భిక్ష తో వచ్చిన పదవిని?

అంటే అవకాశవాదం తో గమ్ముగా ఉంటే ఓకేనా? పోనీ రోషముతో, చంద్రన్న ఎందుకు రాజీనామా అడగరు?

మన పార్టీ లోకి వచ్చిన వారిని ఎందుకు రాజీనామాలు అడగలేము? ఎవరికి పౌరుషం ఉంది?

4. తెలంగాణలో ఎన్ని పధకాలకు, తమ కుటుంబ పేర్లు పెట్టారు, అక్కడ కేసీఆర్?

కేంద్రం లో, మోదీ ఎన్ని పధకాలకు తమ పేరు పెట్టారు?

మరి ఆ రోషం ఆత్మాభిమానం మనకు ఉంటే, గత మరియు ఇప్పుడు ప్రభుత్వం లో, ఒక్క ఎంపీ ఎమ్మెల్యే అయినా,

ఓ చంద్రన్నా ఓ జగనన్నా, సిగ్గు సిగ్గు, మన జేబు డబ్బులు కావు ప్రజల పన్నులు, ఫోటో ఎటూ మనది ఉంటుంది కదా,

కుటుంబ పేరు మనది వద్దు, అని చెప్పే ధైర్యం లేదంటే, ఎవరికి పౌరుషం ఉంది?

5. మూడు కాలాల పంట భూముల్లో, కాంక్రీటు వద్దు అనే రోషం ధైర్యం, ఆనాడు తెదేపా నాయకులు కు ఉందా?

ఆదాయం తెచ్చే వచ్చే మార్గం ఏది? అప్పులు తో పంచుడు ఎన్నాళ్ళు అనే ధైర్యం, ఈనాడు వైసీపీ నాయకులు కు ఉందా?

6. రాజకీయ నాయకులు ను వ్యాపారస్తులను, టీటీడీ లేదా ఇతర దేవాలయల ఛైర్మన్ గా మరియు సభ్యులు గా పెట్టవద్దని అడిగే రోషం ధైర్యం, పదేళ్ళు గా ఎవరికైనా ఉందా?

7. విదేశాల్లో తెలుగు సంఘం అధ్యక్షుడు కార్యవర్గం కూ, సోషలో మీడియా లో తెలుగు వ్యాసం రాయడం, పద్యాలు శ్లోకాలు పలకడం వచ్చి ఉండాలి, అనే రోషం ధైర్యం ఎవరికైనా ఉందా?

8. తెలంగాణ బీజేపీ లాగా, ఆంధ్రా బీజేపీ ని నడపడం చేతగాని నాయకులు ను సభ్యులు ను రాజీనామా చేయమంటే చేస్తారా?

9. జగనన్న కు వైకాపా, పవనన్న కు జనసేన సొంత పార్టీలు ఉంటే, మన లోకేషన్న కు ఎందుకు సొంత పార్టీ వద్దు, అని అడిగే రోషం ఎవరికి ఉంది?

ఎన్టీఆర్ వారసులకు వారి పార్టీ వదిలేసి, లాక్కున్నారు అన్న మాట వదిలించుకుని, మన పాపం లో కొంత అయినా, తగ్గించుకోవచ్చు కదా?

10. పవనన్నా సినిమా లు వద్దు, మేము ధనం ఇస్తాం, మాకోసం ఇక్కడే ఉండి పోరాడు అనే రోషం ధైర్యం, మనకు ఉందా?

11. రాజ్యాంగం అందరికీ సీఎం పదవి అవకాశం ఇస్తే, పదేళ్ళు కు పైగా, కేవలం రెండు కుటుంబాలకే ఎందుకు మనం బానిసలుగా ఉండాలి? ఇంకో 8 కుటుంబాలకు మనము బానిసలు గా ఉండే అవకాశం ఇచ్చే రోషం మనకు ఉందా?

* * *

ఎందుకు ఈ ప్రశ్నలు పరంపరలు కంఠశోష తప్ప, ఎవరికీ ధైర్యం రోషం లేనప్పుడు, ఒక్క రఘురామా కు ఉన్నా లేకపోయినా మనకు, మన రాష్ట్రం కూ వచ్చిన నష్టం ఏముంది.

రాష్ట్ర ఆదాయం పెంచుదాం, నవరత్నాల ను విజయవంతం చేద్దాం అనుకుంటే చాలు మనకు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,214; 104 తత్వాలు (Tatvaalu) and views 225,132
Dt : 16-Jun-2021, Upd Dt : 16-Jun-2021, Category : Politics
Views : 857 ( + More Social Media views ), Id : 1208 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : manhood , resign , people , leaders , tdp , chandranna , ycp , jagananna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content