ఇద్దరు అనాధ దివ్యాంగ మిత్రుల స్నేహం సినిమా, బాపు - మనసును కదిలించే చిత్రం పాటలు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,670; 104 తత్వాలు (Tatvaalu) and views 225,613.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

శరీరం లో ఏదైనా అంగం పనిచేయని వారిని వికలాంగులని భావిస్తుంటారు. అయితే దేవుడు వారికి అదనపు శక్తినిచ్చాడని, ఇతరులలో లేని దివ్యశక్తి ఒకటి వారిలో ఉంది. అందుకే దివ్యాంగులు అని పిలవాలి - ఇదీ మన్‌ కీ బాత సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ 2015 లో ఇచ్చిన పిలుపు.

ఇది 1977 లో విడుదలైన తెలుగు చిత్రం. రాజశ్రీ సంస్థ హిందీలో నిర్మించిన దోస్తీ చిత్రం ఆధారంగా, బాపు దర్శకత్వంలో తెలుగులో తయారయ్యింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ బాలనటుడిగా చిత్ర ప్రవేశం చేశారు. చాహుంగ మై తుఝె సాంఝ్ సవెరే పాట కు, స్నేహంలో నీవుంటే వెరే కనులెందుకు పాట తీసిపోయేది కాదు.

సినిమాలోని పాటలను బాపు తన అభిరుచికి అనుగుణంగా గజల్ శైలిలో రాయించి, స్వరకల్పన చేయించుకున్నారు. పల్లె మేలుకుందీ రేపల్లె మేలుకుందీ - పాటను గజల్ చక్రవర్తిగా పేరొందిన మెహదీ హసన్ స్వరపరచి పాడిన, అబ్ కె హం బిచ్‌డే ఛాయల్లో స్వరపరిచారు.

పోనీరా పోనీరా అనే మరో పాట, గజల్ రోషన్ ఛాయల్లో, అలాగె నవ్వు వచ్చిందంటే కిలకిల అనే పాటను, చల్ చల్ రే గజల్ రీతిలో స్వరపరిచారు. నీవుంటే వేరే కనులెందుకనీ వంటి గీతాలు కూడా గజల్ ఛాయల్లోనే ఉంటాయి.

సాయి కుమార్, కళ్ళు పొగొట్టుకుంటాడు. అతనికి, కర్రలతో నడిచే స్నేహితుడు తోడవుతాడు. ఇద్దరూ అనాధలు. సాయి కుమార్ కి అక్క ఉంటుంది, కానీ ఎక్కడ ఉందో తెలీదు.

కళ్ళు లేని సాయి కుమార్, తన మిత్రుని చదువు కొనసాగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో, మధ్యలో తనని వదిలేసి వెళ్ళిన మిత్రుని తలచి ఎంత బాధపడ్డాడో, చివరికి ఎలా కలిసారో, సినిమా చూసి తెలుసుకోవాలి. పిల్లలకు ఇలాంటి సినిమాలు చూపిస్తే, మానవత్వం కష్టాలు స్నేహం విలువ తెలుస్తాయి.

ప్రతి మాట మనకు జీవితపు విలువలను నేర్పుతాయి, మనసును కదిలిస్తాయి. మీరూ ఒక సారి పాడుతారు కదూ. అన్ని పాటలు చిన్నప్పుడు రేడియోలో విన్నవే ఎన్నో సార్లు. ప్రతి పాట కూడా, మన జీవితము లో సంఘటనలు గుర్తుకు తెస్తుంది.

చిన్నప్పుడు ఎగరేసిన గాలిపటాలు, ఆడుకున్న ఆటలు అన్ని ఒక పాటలో చెప్పారు. నువ్వు తోడుగా ఉంటే ఇంక నాకు కళ్ళు ఎందుకని, స్నేహితుని గొప్పతనాన్ని నమ్మకాన్ని చెప్పరు. ఉనందే మనది, పోయింది పోనీ అంటూ జీవిత సత్యాన్ని చెప్పారు. నవ్వుతారు ఏడుస్తారు ఇదే లోకం తీరు అని, ఎండగట్టారు మన వక్ర పద్దతులు. ఇంకా ఎన్నో, మీరూ చూసి ఆస్వాదించండి.

1) పల్లవి: నీవుంటే వేరే కనులెందుకూ.. నీ కంటే వేరే బ్రతుకెందుకూ
నీ బాటలోనే. అడుగులు నావే.. నా పాటలోనే..మాటలు నీవే. - 2 ||నీవుంటే వేరే||

చరణం 1:
నా ముందుగ నువుంటే తొలిపొద్దు.. నువు చెంతలేకుంటే చీ.కటి. 2
నీ చేయి తాకితే..తీయని వెన్నెల,
చేయి తాకితే..తీయని వెన్నెల,
అలికిడి వింటేనే., తొలకరి జల్లు||నీవుంటే వేరే||

చరణం 2:
నిన్న రాతిరి ఓ..కలవచ్చింది..ఆ కలలో ఒక దేవత, దిగి వచ్చిందీ.. 2
చందమామా కా.వా.లా..ఇంధ్రధనవు కా.వా.లా..
అమ్మ నవ్వు చూ.డా.లా..అక్క ఎదురు రా.వా.లా.. - 2 లైన్లు 2 సార్లు
అంటూ అడిగిందీ..దేవత అడిగిందీ..,
అప్పుడు నేనేమన్నానో తెలుసా..
... వేరే కనులెందుకనీ..నీ కంటే వేరే బ్రతుకెందుకనీ..

లాలలలాలా..లలలలలలాలలాల
హ్మూ...హూ..హూ..హూహూ లాలలలలాలా

Sad song

నీవుంటే వేరే కనులెందుకు? నీకంటే వేరే బ్రతుకెందుకు?
నీ బాటలోని అడుగులు నావి నా పాటలోని మాటలు నీవే

చూపు లేని కన్నుందిగాని కన్ను లేని చూపుందా?
కొమ్మ లేని చెట్టుందిగాని చెట్టు లేక కొమ్మ ఉందా?
నేను లేని నీవు ఉన్నావుగాని నీవు లేక నేనుంటానా?

కొండంత చీకట్లో గోరంత దీపమా గోరంత దీపానికి కొండంత స్నేహమా
ఉట్టుట్టి వెదురుకే ఊపిరైన గీతమా ఊపిరైన గీతానికి చూపులాంటి ప్రాణమా
ఎందుకని బతికింది ఈ గుడ్డి దీపం? ఎవరికని పలికింది ఈ పిచ్చి గీతం?
ఎందుకని? ఎవరికని? నీకోసం

2) పోనీరా పోనీరా పోనీరా... పోతే పోనీరా
పోయింది పొల్లు, మిగిలిందే చాలు ||పోనీరా||

ఎంత మబ్బు మూసినా, ఎంత గాలి వీచినా
నీలినీలి ఆకాశం, అల్లాగే ఉంటుంది - 2 లైన్లు మొత్తము
ఎంత ఏడుపొచ్చినా, ఎంత గుండె నొచ్చినా.. 2
నీ లో.పల ఉద్దే.శం, ఒకలాగే ఉండాలి 2 ||పోనీరా||

కష్టాలే కలకా.లం కాపుర ముంటాయి
సౌఖ్యా.లు చుట్టాలై, వస్తూ. పోతుంటాయి - 2 లైన్లు మొత్తము
వెళ్ళాలి బహుదూ..రం, మోయాలి పెనుభా..రం 2
ఏమైనా కా.నీ.రా., మన యాత్ర మా.నం 2 ||పోనీరా||

రచన: ఆరుద్ర, గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (SPB)

3) సరే సరే ఓరన్నా.., సరే సరే 2
పిలిచి పిలిచి ఇంకా వేధించనులే
గుండె కలచి కలచి, నిన్ను బాధించనులే ||సరే సరే||

వెర్రిగాలి వీచినపుడు వెదురైనా పాడుతుంది
నల్లమబ్బు పట్టినపుడు నెమలైనా ఆడుతుంది
నీ నేస్తం నీకోసం చావు కేక వేస్తే
పలకనైన పలకవు రాయిలా ఉలకనైన ఉలకవు

అనుక్షణం నీ పేరే తలుచుకుంటాను
మనసులోన నీ ఊసే మలుచుకుంటాను
నీవే దిగి వస్తావని నిలిచి ఉంటాను
నీవు బాగుండాలని వేయి దేవుళ్ళను కొలుచుకుంటాను

4)పల్లవి : నవ్వు వచ్చిందంటే కిలకిల, ఏడుపొచ్చిందంటే వలవల 2
గోదారి పాడింది గలగలా... ఆ.. ఆ..2
దానిమీద నీరెండ, మిల మిల ||నవ్వు వచ్చిందంటే||

చరణం 1 :
నది నిండా నీళ్ళు ఉన్నా... మనకెంత ప్రాప్తమన్నా 2
కడవైతే కడివెడు నీళ్ళే... గరిటైతే గరిటెడు నీళ్ళే 2
ఎవరెంత చేసుకుంటే... ఏ.. ఏ.. ఏ..2 అంతే కాదా దక్కేది ||నవ్వు వచ్చిందంటే||

చరణం 2 :
ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ, నడమంత్రపు అధికారానికి గోతులెక్కువా
ఆ.. అ.. ఆ.. ఆ.. ఆ.. ఆ 2
కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులెక్కువ, చేతకానమ్మకే చేష్టలెక్కువ
చెల్లని రూపాయికే గీతలెక్కువా ||నవ్వు వచ్చిందంటే||

చరణం 3 :
తమ సొమ్ము సొమవారం ఒంటి పొద్దులుంటారు, మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు 2
పరులకింత పెట్టినదే... ఏ..ఏ...ఏ 2 పరలో.కం. పెట్టుబడి ||నవ్వు వచ్చిందంటే||

5) ఎగరేసిన గాలిపటాలూ.., దొంగాటా దాగుడు మూ.తలు.
గట్టుమీద పిచ్చుక గూళ్ళు, కాలువలో కాగితం పడవలు

గోళీలు. గోటీబిళ్ళ, ఓడిపోతె పెట్టిన డిల్లా
చిన్ననాటి ఆ.నవాళ్ళు, స్నేహం లో, మైలు రాళ్ళు
--
పడగొట్టిన మామిడికాయ, పొట్లం లో ఉప్పు కారం,
తీర్ధం లో కొన్న బూర,
కాయ్ రాజా కాయ్ కాయ్ రాజా కాయ్ 2
--
దసరాలో పువ్వుల బాణం, దీపావళి బాణాసంచా
చిన్నప్పటి ఆనందాలు, చిగురించిన మందారాలు
--
నులివెచ్చని భోగి మంటా.., మోగించిన గుడిలో గంట..
వడపప్పు పా.నకాలు, పంచుకున్న కొబ్బరి ముక్క
--
గోడమీద రాసిన రాతలు, జీడి తో వేసిన బొమ్మలు
చెరిగిపోని జ్ఞాపకాలు, చిత్త స్వాతి వానజల్లు
-
చిన్ననాటి ఆనవాళ్ళు, స్నేహం లో మైలు రాళ్ళు
చిన్నప్పటి ఆనందాలు, చిగురించిన మందారాలు


6) పల్లె మేలుకుందీ... రేపల్లె మేలుకుందీ...
వెలుగు మేలుకుంది.. మీగడ పెరుగు మేలుకుంది..
మేలుకోవయ్య, ఓ నల్లనయ్య 4
మేలుకొని మా వెన్న మీగడల నే.లుకోవయ్య ||మేలుకోవయ్య||

ముంగిళ్ళలో, ముగ్గులు పెడుతున్నా.రు, చిట్టితల్లులు
కడవలు పట్టుకుని., యమునకు వెళుతున్నా.రు, కన్నతల్లులు
ఆ.లమందతో, ఉన్నా.రు అన్నలు
చే.లగట్టున, పోతున్నారు అయ్యలు
నట్టింట్లో ఎవరు లేరు, ఉట్టి మీది వెన్న తప్ప sh sh
పిల్లి అడుగులు వే.స్తూ, రా.వయ్యా 2
వెన్నముద్దలు కాజేసి పోవయ్యా

మువ్వల్లాగా, గలగల నవ్వే., ముద్దుల పాపా వచ్చింది..
చిగురుల్లాం.టి చేతులతో., వెలుగు పూ.లు, తెచ్చింది
ఏ వరాలు కో.రుకుందో? ఎందుకు నిను చే.రుకుందో?
అంతా తెలిసిన ఓ స్వామీ.., aa aa 2 ఇంకా నిదురించే..వే.మి?
చల్లగా దీవించ లేవయ్యా,
నూరేళ్ళు, వర్ధిల్లగా దీవించ రావయ్యా 2

చిత్రం: స్నేహం (1977), సంగీతం: KV. మహదేవన్
తారాగణం - రావు గోపాలరావు, మాధవి, సాయి కుమార్, రాజేంద్ర ప్రసాద్, రామ లింగయ్య, ముక్కామల
Sneham (1977) Bapu Full Movie

sneham Friendship movie two divine orphan friends Bapu - mind blowing movie songs 1977  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,670; 104 తత్వాలు (Tatvaalu) and views 225,613
Dt : 15-Jun-2022, Upd Dt : 15-Jun-2022, Category : Songs
Views : 912 ( + More Social Media views ), Id : 1430 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sneham , divine , orphan , friends , bapu , madhavi , rao , sai , allu , nivunte vere kanulenduku , ponira ponira ponira , navvu vachchindante kilakila , egaresina gali patalu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content