అబ్బో ఆకాశములో నుంచి నీతి మంతులు వచ్చారు, ఇంకెవరికి తెలీదు, లోకం పోకడ బట్టి, మీరే గొప్ప స్పెషల్? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,866,914; 104 తత్వాలు (Tatvaalu) and views 225,002.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*ఏవండీ ఇన్ని మాటలు ఏలా వస్తున్నాయో గానీ, మీరు రాసేది చదువుతూ ఉంటే, వాటిని వాస్తవముగా, ఆచరణ లో ఎలా కాదనాలో తెలియడం లేదు. నిజాలే, కానీ మేము పాటించలేము చాలావరకు, మేము కలి మోహ 75 శాతం మంది లో వారిమే. మొన్న కరోనాకు నానా పాట్లు పడ్డాము 2 లక్షలు వదిలించాము, అయినా మారము. మేము ఇలా ప్రశ్నిస్తే, ఎగతాళి చేస్తుంటారు మా 75 మంది లో వాళ్ళు ఇలా - అబ్బో ఆకాశములో నుంచి నీతి మంతులు దిగి వచ్చారు, ఇంకెవరికి ఇవి తెలీదు, లోకం పోకడ ను బట్టి పోవాలి, లౌక్యం తెలీదు, మీరే గొప్ప స్పెషల్ అనుకుంటున్నారు ఏమో, అని అన్నారు. మిమ్మల్ని అలా అన్నారా? చాలా మంది అనే ఉంటారు. దానికి మీరు ఏమి జవాబు చెప్పారు?*

ధన్యవాదములు, మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము, స్వచ్చముగా గౌరవముగా నిజాయితీగా మాట్లాడేవారు, తమ తప్పును స్థితిని ఒప్పుకునే వారు అంటే, దేవునికి చాలా ఇష్టం. ఎందుకంటే ముందు ఆ స్వయం ఆత్మ జ్ఞానం వస్తే, తర్వాత చిన్నగా అరిషడ్వర్గాల బానిసత్వం నుంచి, బయట పడతారు, పెద్ద దెబ్బలు నష్టం జరగక ముందే.

ద్రుతరాష్ట్రుడు కూడా, క్రిష్ణా నా బుద్ది అంతే, మా పిల్లల బుద్ది అంతే, ఏమీ అనుకోకు అని చాలా సార్లు నిజాయితీ గా ఒప్పుకున్నాడు. అందుకే విశ్వరూప దర్శనం, భారత యుద్దం జరిగే విధానం వినే యోగం, సంజయునితో ఇప్పించారు.

అసలు సమస్య మొత్తం, శకుని మంధర శూర్పణఖ లాంటి, కపటం 2 నాల్కల వారితోనే. వారి మానసిక స్తితి వారు ఒప్పుకోరు, ఫలితాలు వచ్చిందాకా.

లోకం పోకడ ను బట్టి అంటే, 10 మంది చెడు/ అజాగ్రత్త చేసి/ తిరిగి, కరోనా తెచ్చుకుని పోతే, మనమూ పోదామా? మరి పోలేదే? అంటే 25 మంది మంచినే మనము అనుసరించాలి, 75 మంది చెడు ను కాదు.

ఎవరైనా 75 శాతం మంది అరిషడ్వర్గాల నీడ లో ఉన్నప్పుడు, అలాగే వారు అనాలి, అది వారి సహజ తత్వం గుణం, తప్పులేదు. వారు అలా అంటేనే, మనకు ఒక పాయింట్ పుణ్యం పెరుగుతుంది, వారికి ఇంకాస్త తగ్గి. కొంతమంది అటు ఇటు మారుతుంటారు, సమయం గ్రహాలను బట్టి.

మమ్మల్ని అన్నారు కూడా అలాగే, ఇంకా అంటారు జీవితం చివరి దాకా. శని రాహు కేతు లేదా ఇంట్లో భాగస్వామి/ పిల్లల/ కోడలు/ అల్లుడు గుణ పాఠం అయ్యినదాకా.

మీకు ముందే చెప్పాము ప్రతి శని వారం, మీకన్నా 100 శాతం, పాపాత్ములము కాబట్టే ఇవన్నీ చెస్తున్నాము. మీరు పుణ్యాత్ములు కాబట్టే, మీరు చేయరు, మీకు అవసరం ఉండకపోవచ్చు అని. ఆఖరికి పాట కు కూడా, రాగం రాదు మధుర గాత్రం లేదనీ ఒప్పుకున్నాము కదా. అయినా కూడా, వారు అంటారు.

మన మిత్రులే, బంధువులే, ఇతరులైనా నారాయణస్వరూపులే కాబట్టి, ఎన్ని అన్నా నవ్వుకుంటాము. ఇలా జవాబు చెపుతాము - గురువులూ మీరు అన్న ఈ అర్ధం లేని మాటలకు కూడా, ఫలితము రేపు మీ వెంట ఖచ్చితముగా పడుతుంది, మీ ఇంట్లో వారే మిమ్మల్ను కడుగుతారు ఇలానే, జాగ్రత్తలు సుమా.

ఉన్న పాపాలకే మీకు కష్టం, మరలా కొత్త పాపము ఉత్తి పుణ్యానికి ఎందుకు, మా లాంటి అజ్ఞాన శిష్యులతో కూడా అంటాము, వారు కిల కిలా నవ్వుతారు.

ఎందుకంటే వాస్తవం తెలుసు కాబట్టి, ఏదో కోపం బట్టలేక, నిజం ఒప్పుకోలేక, మనసు బ్రమల వాస్తవం మధ్యలో కొట్టుకుంటూ, అలా అంటారు కాసేపు ఓ క్షణం.

దుర్యోధనులు రావణులతో ఎప్పుడూ మనకు సమస్య ఉండదు, కపటం ఉండదు, మనము దోమలు ఈగలతో సమానము వారికి, సామాన్యుల జోలికి రారు, ప్రాపంచిక మోహములో నిండా మునిగి ఉంటారు కాబట్టి.

వరాహం ఏమి అనుకుంటుంది, చీ ఈ పాడు నీచ ఇతర జంతువులకు మరియు నీచ మనుషులకు, బురద విలువ, ఆరోగ్యం పన్నీరు సువాసన, మహాత్యం, అనుభవం ఆనందం సుఖం, చల్లదనం ఆస్వాదించడం, ఈ జన్మలో తెలీదు మూర్ఖులకు, ఎట్లా బాగుపడతారో ఏమో, వీరిని డాక్టరు కు చూపించాలి.

మా మిగతా వరాహాలను చూసి, బుద్ది తెచ్చుకుని వీరు మారరు. వీరంతా ఏదో గొప్ప వారిలా దేవతలు గంధర్వులు లా ఫీల్ అవుతున్నారు, మాకు నీతులు చెపుతున్నారు దూరంగా ఉంటూ, మా అమ్మా అయ్యనే చెప్పే ధైర్యం చేయరు, అని తమకు తాము అనుకుంటాయి. వారు ఇలా, మనల్ని చూసి జాలి పడతారు.

ఏది నిజం? బురదలో ఉన్న వారి మాటలకు విలువ ఉందా? వారు ఆచరించరు, అరిషడ్వర్గాల నుంచి బయటకు రారు రాలేరు, వస్తే గిల గిల లాడుతారు మనసు నిలువదు, ఇతరులు ఆచరిస్తే ఆదరించరు, గేళి చేస్తారు.

*ఉదాహరణ 1* - రామాయణం - రావణుడు ఇలా గేళి చేసారు, ఎవరో రాముడు దేవుడంటా, నరుడై ఉండి, నరులతో వానరులతో కలసి, మనపై దండెత్తి వస్తున్నాడు అంట. ఎంత అమాయకుడు, మన రాక్షస మాయలు నాటకాలు, మన శక్తి బలగం, ఐశ్వర్యం తనకు తెలీదు, అని విర్ర వీగాడు. ఓ వానరాన్ని రాయబారం పంపారు, అవ్వ అవ్వా అన్నారు.

75 శాతం లో ఉండే లంక వాసుల ఆలోచన ప్రకారం, అది కరెక్టే కదా? 25 మంది మాత్రము, ఉత్తమ మానవుడు, దేవుని లాంటి వాడు అంటారు.

రావణుని చంపినదెవరు? కేవలము అతని అరిషడ్వర్గాల బానిసత్వమే, అతని చెడు గుణమే. 75 శాతం ఒప్పుకోరు ఇది.

*ఉదాహరణ 2* - భారతం - దుర్యోధనుడు ఇలా గేళి చేసారు - అబ్బో క్రిష్ణుడంటా, మాయల మరాఠీ అంటా, వెన్న చాటుగా తీసుకునే దొంగంట, గోవుల కాపరి అంటా, మమ్మల్ని బెదిరించడానికి, మా భవిష్యత్ చెప్పడానికి దేవుని లా, రాయబారానికి వస్తున్నాడు అంట, రానీ కట్టేద్దాము అని, అధికార అహంకార గర్వముతో అన్నారు.

కౌరవ వశం పతనానికి కారణం ఎవరు? కేవలం రారాజు అహంకారమే, మూర్ఖత్వమే. శకుని లాంటి దుష్ట చతుష్టయం చెప్పుడు మాటలు వినడమే.

*ఉదాహరణ 3* - > మనతో ఒకరు అన్నారు, నువ్వు దేవుడివా మా భవిష్యత్ చెపుతున్నావు.

* నేను సామాన్య మనిషిని, నిన్ను కూడా మనిషిగా మానవత్వంతో ఉండమని నీ వాళ్ళ విషయం లో కోరుతున్నా. లేదంటే, తర్వాత నీకే ఇబ్బందులు అవమానాలు.

> నాకు మానవత్వం లేదని ఎవరు చెప్పారు? కల వచ్చిందా? సాక్ష్యం?

* నా లాంటి సామాన్యుడు, చిన్న జీతం తో 8 ఏళ్ళు గా, అమ్మతో ఉంటే అద్దె కడుతూ, ఆ విషయం నీకు తెలుసు. మరి ఇన్ని కోట్లు ఉండి, మీ అమ్మ నాన్నకు పెట్టింది ఏమిటి, నీ దగ్గర ఉంచి? నీ లాంటి వారిని కన్నందుకు, వారికి దక్కిన గౌరవం సౌకర్యాలు ఏమిటి? ఎప్పుడు తెస్తావు, వారు పోయిందాకా, అబద్దాలతో కాలం గడుపుతావా?

> కరోనా తర్వాత తప్పక తెస్తాను, నీ కన్నా బాగా, భార్య పిల్లలు సేవకులతో, రాజభోగము గా చేపిస్తాను.

* అది జరిగితే, మొదటి సంతోషం నాకే, ఆ సేవ నేను అందుకున్నట్లే. కానీ 8 ఏళ్ళు గా మనసులో లేనిది, కరోనా తర్వాత తెస్తావా? సరే చూద్దాము నీ మాటల్లో నిజాలు, మీ అమ్మా నాన్న అద్రుష్టము, వారిపై నీకున్న మానవత్వం క్రుతజ్ఞత.

ఇది 2020 లో మాట. ఇంకా వార్త వినలేదు, ఇంక వింటామా తెలీదు. వాళ్ళ అమ్మా నాన్నకు రుణం తీర్చుకోవడానికి, నేను దేవుడు అయితే, దెయ్యం అయితే నష్టం ఏముంది?

కనీసం వారి తల్లి దండ్రులు సుఖపడితే చాలు కదా? స్నేహితునికి పాపం తగ్గితే చాలు కదా? కుటుంబం బాగుంటే చాలు కదా? వాళ్ళు పుణ్యం తో బాగుంటే, మనకూ అండగా ఉంటారు కదా?

అంటే మానవత్వం బాధ్యత క్రుతజ్ఞత గుర్తు చేస్తే కూడా, మన మీదే విమర్శలు. అంటే తన చుట్టు ఉన్న వారు, తన లాగే మోహం లో ఉండి, అవకాశ అవసరాల, అరిషడ్వర్గాల బానిసలై, నీతి నియమం మంచి చెప్పరు.

మనము మిత్రులు గా, ఆత్మ బంధువులు గా, వారి పెద్దల క్షేమం కోసం చెప్పేసరికి, కోపాలు అలగడం మనల్ని అవమానించడం గేళి చేయడం. 20 ఏళ్ళ పైన ఇదే విధముగా మాటలు పడటం, ఇతరుల క్షేమం కోసం, తిట్లు పొగడ్తలు శాపాలు వరాలు అన్ని ఆ పరమాత్మకే, మనము కేవలము పప్పుచారులో కరివేపాకు, నిమిత్తమాత్రులం, కొవ్వొత్తి లా కాలం లో కరిగిపోదాం నిశ్శబ్దముగా.

Morals have come down from the sky, no one else knows, world has to follow trend, do you think as great special  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,914; 104 తత్వాలు (Tatvaalu) and views 225,002
Dt : 24-Jun-2022, Upd Dt : 24-Jun-2022, Category : General
Views : 499 ( + More Social Media views ), Id : 1440 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : morals , teaching , sky , world , trend , think , great , special , rama , ravana , krishna , duryodhana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content