ప్రతి ఇంటి తల్లి దండ్రులు మారితే, పిల్లలు, నాయకులు, అధికారులు మారతారు కదూ? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,832; 104 తత్వాలు (Tatvaalu) and views 225,622.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

చదివారా వార్త జూన్ 7, ఇద్దరు కొడుకులకు 20 ఎకరాల పొలం తో కోట్లు ఇచ్చినా కూడా, కొడుకులు పంచుకుని, పెద్ద కొడుకు, భోజనం పెట్టకుండా ఇంటి వెనుక షెడ్ లో ఉంచి, కొడుకు కోడలు, తమ తల్లి దండ్రుల నే (90, 85), మాడ్చి చంపి, కరోనా వచ్చింది అని పాతి పెట్టారు - పోలీసు దర్యాప్తులో అన్నం పెట్టకుండా చంపేసారు, అని కూతురు కేసుపెడితే బయటకు వచ్చింది.

ఇది (1) ప్రాపంచిక మోహంలో, చేతగాని శ్రద్ధ ఓపిక లేని, పిల్లల పెంపకం లో, ప్రేమ బాధ్యత కృతజ్ఞతలు లేకుండా పెంచడం లో తప్పు అనాలా,

లేక (2) అరిషడ్ వర్గాల లో మునిగి, ధనమోహము లో, పెద్దలు మరియు పిల్లలు, బంధువులు స్నేహితులు సభ్యసమాజం, తాము చేసుకున్న లేదా చేసిన తప్పులు కు ఫలితాలు అనాలా

లేక (3) కలియుగం లో దాని పాప ధర్మం ప్రకారం, మన బాధ్యత తప్పులు లేకుండా నే, తెలీకుండానే ఊరకనే అలా జరిగింది అనాలా?

మనసున్న మనిషి గా స్పందించే గుణం హృదయం ఉంటే, చదివి సొంతంగా, రెండు తెలుగు మాటలను గొంతు తో అనండి లేదా రాయండి.

మరి మనలో ఎంతమంది, తర్వాత ఈ బాధ కు గురి అవ్వడానికి లేదా ప్రాణాలు వదలడానికి లేదా ఆశ్రమానికి లేదా ఒంటరికి, సిద్ధంగా ఉన్నాము?

వారు ఏమి తక్కువ చేశారు తమ పిల్లలకు, కోట్లు ఇచ్చారు కూడా కదా, కేవలం సంస్కారం కృతజ్ఞతలు బాధ్యత లు మాత్రమే నేర్పలేదు, అంతేనా?

ఇవి బయట చదువు లో లేదా ఇంట్లో మనం నేర్పలేము కదూ, ముందు మనకే తెలీదు.

ఇలాంటి ఎన్ని పాములను బాధ్యత లేకుండా, మన ఇంట్లో మన చేతులలో పెంచి, ఆలనాపాలనా చేసి, సకల సంపదలు ఇచ్చి,

మన పాపాల ఫలితముగా, మన గొయ్యి మనమే తీసుకోవడమే కాకుండా, ప్రపంచం మీదకు వదిలి, ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నాము, చేయిస్తున్నాము కదూ.

ఈ పాపం మొత్తం బాధ్యత లో, మనకు ఫలితాలు, బాంక్ వడ్డీ లాగా, తర తరాలు వెతుక్కుంటూ రావా?

మన బాధ్యత మనం చేయము, మన చెడు ను అణగదొక్కడానికి మన ఇంట్లో, మరలా దీనికి కూడా, దేవుడు రావాలి పాపాన్ని పోగొట్టాలి.

ప్రభుత్వం, అధికారులు, నాయకులు మంచి చేయాలి, మనం మాత్రం కదలం మారము.

ఎందుకు ఇది జరిగింది, అనేది ముఖ్యం. అక్కడ ఉన్న ఏ ఆప్షన్ నిజమో చెప్పాలి మరి?

నిన్ను నన్ను పెంచింది, పాత మనుషులే కదా. నన్ను నిన్ను ఎవరన్నా చెడగొట్టి లేదా బాగుచేసి మార్చగలరా?

మార్చగలిగితే, మన తల్లి దండ్రులు ది సగం తప్పు లేదా ఒప్పు, మిగతా సగం మనది. ఇద్దరు కూ బాధ్యత ఉండాలి కదా.

సరిగ్గా పెంచడం లేదు, ఆనాడు. ఇంక ఈనాడు అసలు లేదు కదా. అమ్మ అయ్య ఇంట్లో ఉండరు.

పిల్లలు కన్నా, వారు నాశనం అయినా, ధనం మాత్రమే ముఖ్యం, వారిని తొందరగా నాశనం చేయడానికి, కదూ.

ప్రతి ఇంటి తల్లి దండ్రులు మారితే, పిల్లలు, నాయకులు, అధికారులు మారతారు కదూ?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,832; 104 తత్వాలు (Tatvaalu) and views 225,622
Dt : 11-Jun-2021, Upd Dt : 11-Jun-2021, Category : General
Views : 797 ( + More Social Media views ), Id : 1198 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : house , parents , kids , children , leaders , officials
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content