హైదరాబాద్ ఎన్నికల ప్రచారం - బీజేపీ మాటల తూటాలు తెరాస పై - సర్జికల్ స్ట్రైక్, కూల్చడం - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,687; 104 తత్వాలు (Tatvaalu) and views 225,092.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

తెలంగాణ హైదరాబాద్ లో నగర ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ నాయకులు, కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అని, ఎదురు నిలుస్తున్నారు. జనసేన, బీజేపీ కి అండగా ఉంది, బరిలో ఎవరినీ నిలపకుండా, ఓట్లు చీలకుండా.

హేమా హేమీలు అయిన, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్, డీకే అరుణ, రాజాసింగ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్, కేంద్ర మంత్రి కిషన్, ఇతర కేంద్ర నాయకు లు ప్రచారం లో, తెరాస వైఫల్యాలను ఎండ గడుతున్నారు.

ఆంధ్రా బీజేపీ నాయకులు కు వీళ్ళ లో కనీసం, 50 శాతం చిత్తశుద్ధి ఉన్నా, ఒక్క ఎంపీ సీటు గెలిచే వారు, జనం లో ఇలా కలియ తిరుగుతూ, కష్ట సుఖాలు పంచుకుంటూ.

వైకాపా చేతులు ఎత్తేసింది. తెదేపా తూతూమంత్రంగా ముందుకు పోతుంది. చంద్రన్న లోకేష్ సైలెంట్ గా ఉంటే నే ఉత్తమం, లేదంటే ఓట్లు చీలి, తెరాసేకే లాభం అని, అభిమానుల ఉవాచ. కాంగ్రెస్స్ రేవంత్ తో కలసి పోరులో ఉన్నా, అంత గా ప్రచారం అందుకోవడం లేదు.

నగరంలో వరదలు వస్తే, కానరాని తెరాసా నాయకులు, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారని, నిలదీస్తున్నారు జనం కూడా.

సంజయ్ గారి ఆవేశం ఎక్కడ దాకా వెళ్ళింది అంటే, పాతబస్తీ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, మేయర్ గా గెలిస్తే అన్నంత వరకు వెళ్ళింది. మత్తులో బండి నడపడం ఎంత ప్రమాదమో, ఫాం హౌజ్ నుండి మత్తులో, రాష్ట్రం నడపడం అంతే ప్రమాదం అని ఆయన అన్నారు.

అంటే రోహింగ్యాలాంటి ఇతరులకు, రక్షణ ఇచ్చి దాచి, ఓటు హక్కు ఇస్తున్నారు అని ఆరోపణలు. ఎన్నో ఏళ్లుగా ఎదగకుండా పాతబస్తీ గా పిలవబడుతున్న ప్రాంతాన్ని, కొత్త బస్తీగా అభివృద్ధి చేస్తామని, దాని ఉద్దేశ్యం అని అభిమానులు ఆనందం.

మత కలహాలు లేనిది, కేసీఆర్ ఓవైసీ అక్రమ స్నేహం వలనే అని, ఇద్దరూ ఒకటే నని, ఓవైసీ తో కలిసే పార్టీ నే మతతత్వ పార్టీ అని, ఇప్పుడు కీ, అధికారులు పాతబస్తీ లోకి వెళ్ళలేరని, నగరాన్ని భాగ్యనగరం గా మార్చే ప్రయత్నం, కేవలం బీజేపీ దే అని, తెలంగాణ బీజేపీ నాయకులు, తెరాసా కుటుంబ పాలనకు, చరమగీతం పాడటానికి నగర ఎన్నికల్లో, తొలి విజయం సాధించాలని, విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

అక్రమ కట్టడాల కింద, ఎంటీయార్ పీవీ ఘాట్ లను కూల్చాలని ఒవైసీ అంటే, దారుస్సలాం ను కూడా కూలుస్తామని, బీజేపీ బదులు ఇచ్చింది.

కేటీఆర్, పేలవమైన జవాబు కూడా, వీడియో లో వినండి. సర్జికల్ స్ట్రైక్, పేదరికం మీద చేయాలని కేటీఆర్ అంటే, రాష్ట్ర ప్రభుత్వం అందులోనూ విఫలం అయిందని, జనం ను గాలికి వదిలిందని, నగరం లో 2 బెడ్ రూం ఇళ్ళు ఏవని, మాటకు మాట తిరుగు జవాబు ఇస్తున్నారు.

ఇక్కడ ఎక్స్ అఫిషియో ఓట్లు కొన్ని, తెరాసాకు ఉపయోగంగా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ కష్టపడి తేనే, బీజేపీ ఎక్కువ సీట్లు వస్తాయి. గెలుపు ఎవరిదైనా సరే, తెరాసా కేసీఆర్ కు, గట్టి పోటీ దారులు గా మేము ఉన్నామని, హైదరాబాద్ నగర ప్రజలకు అండగా నిలబడి, వారి మనసులో, ముద్ర వేసుకునే ప్రయత్నం, తెలంగాణ బీజేపీ శాయశక్తులా చేస్తోంది.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,687; 104 తత్వాలు (Tatvaalu) and views 225,092
Dt : 25-Nov-2020, Upd Dt : 25-Nov-2020, Category : Politics
Views : 761 ( + More Social Media views ), Id : 822 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : hyderabad , corp , election , campaign , bjp , bullet words , trs , surgical , strike , demolition , bandi , kcr , ktr
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content