అగ్నిపధ్/ కొత్త రాష్ట్రపతి/ ఇంకో దాని గురించి, కుట్ర కుతంత్రాల అనవసర గోల కు అర్ధం? ఆధ్యాత్మిక ఉదాహరణ - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,968; 104 తత్వాలు (Tatvaalu) and views 225,630.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*ఏవండీ అగ్నిపధ్ లేదా కొత్త రాష్ట్రపతి లేదా ఇంకో దాని గురించి కేంద్రం పై, ఇతరుల కుట్ర కుతంత్రాల అనవసర గోల కు అర్ధం ఉందా? ఆధ్యాత్మికముగా, ఉదాహరణ*

కేంద్రము లో ఉంది, ఆధ్యాత్మికత అరిషడ్వర్గాల సాధన తెలిసిన ఆచరణలో చూపించ గలిగిన వ్యక్తి, ప్రధాని గా ఉన్నారు. ఆయన ఏమి చేసినా, ముందు చూపు తో ఆలోచన చేసి చేస్తారు. ఆర్టికల్ 370 కాశ్మీరు విముక్తి అలాగే ట్రిపుల్ తలాక్, ఇలాంటివి చేస్తే, ప్రాణాలకు ముప్పు అని తెలిసి కూడా, చేసే తెగింపు ధైర్యం ఎవరికి ఉంటాయి?

కుటుంబ వారసత్వ బానిస పాలన వ్యక్తులకు ఉంటాయా? అవకాశ అవసరవాదులకు, ఉండవు కదా? పాత బస్తీని కొత్త బస్తీ చేయలేని, చిత్తశుద్ది లేని మాటలకు విలువ ఉందా? కరోనా తట్టుకునే ఒక్క ఆసుపత్రి కట్టలేని వారికి ఉంటుందా? కేవలం అరిషడ్వర్గాలను జయించిన/ సాధన చేస్తున్న వారికే ఉంటాయి. అలాగే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ కూడా.

ఎందుకంటే మేము/ మనము ఉన్నా లేకపోయినా, సత్యం ధర్మం అనేది ఎప్పుడూ ఉంటుంది, అది ఉండాలి, ఇంకొకరు వచ్చి దానిని కొనసాగిస్తారు. ఎవరి పని వారు చిత్తశుద్ది తో నిస్వార్ధముగా చేస్తారు, ఫలం ఆశించరు. 2014, 2019 నాయకుల బాంక్ బాలెన్స్ ఆదాయ వివరాలు గమనించండి, ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి.

మన తెలుగు వారికి, కనీసం మంచి గుణం గలిగిన ఉత్తములను కూడా, నాయకులు గా ఎన్నుకోము. మంచి వారిని మనము నమ్మము, కొత్త వారిని రానీయము. కేవలం అరిషడ్వర్గాలకు బానిసలనే నమ్ముతాము.

సొంత తెలుగు గురువులు వేమన, బ్రహ్మం, రాఘవేంద్ర స్వాములు అంటే గిట్టరు, బ్రమలలో కేవలం పరాయి భాష గురువులకు సాగిలపడతారు. తెలుగు గురువుల లోపం చెప్పరు. ఆ పరాయి భాష వారిలో ఒక్కరి ఇంట్లో, మన తెలుగు గురువు ఫోటో పెట్టించి, గురువులు అందరూ ఒకటే అని చెప్పించలేరు, ఊరికో గుడి కట్టలేకపోయినా. అంటే వాస్తవం గుర్తించలేని, బలహీన మనసులు. అందుకే, పిల్లలు ఇంట్లో వారు వారి మాట వినరు. వీరు వారూ ఎవరూ వినరు మార్చుకోలేరు మారరు, తాము పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అంతే.

కాబట్టి రాజకీయాలు ఇక్కడ వద్దు. ఆధ్యాత్మికముగా, ఉదాహరణ చెప్పుకుందాము, అది సరిగ్గా సరిపోతుంది మనము రోజూ వినే ఆందోళనలకు.

కలియుగ ధర్మం ప్రకారం, 4 గు లో 1 వంతు మాత్రమే నీతి ధర్మం నియమం ఉంటుంది. అంటే 75 మంది చెడు స్వభావం కలిగి ప్రాపంచిక బ్రమలలో ఉంటూ అరిషడ్వర్గాలకు బానిసలై వాస్తవం అలాగే భవిష్యత్ మరచి, వారిలో వారు కలహించుకుంటూ కూడా, మిగతా 25 మంది మంచి వారిపై నిందలు వేసి, వారిని కూడా తమలో కలుపుకుని, 100 శాతం చెడు చేసి, కలియుగాన్ని వీలైనంత తొందరగా అంతము కు తీసుకు పోవాలని వీరి సంకల్పం.

ఇది మంచి సంకల్పమే, ఎందుకంటే ఎటూ కరోనాలు, భూకంపాలు, తుఫాన్ లు, సునామీలు తప్పవు, పాప ప్రక్షాలణకు. మనకు ఇప్పుడు సాటిలైట్ లు కూడా ఎప్పుడు నెత్తిన పడతాయో, రాకెట్ లకు ఎప్పుడు అడ్డం పడతాయో కూడా తెలీదు. ఇది, మన పాపమే, అభివ్రుద్ది అంటూ, నెత్తిన ఇనుప బండలు పెట్టుకున్నాము.

ఇప్పుడు జరుగుతున్న అగ్ర రాజ్యాల చాటు మాటు ప్రచన్న యుద్దం కూడా అదే కోవ, వ్యక్తుల ఊళ్ళ రాష్ట్రాల మధ్య లో ఈని స్పర్ధలు అహంకారాలు ఉన్నాయో, దేశాల మధ్యలో కూడా ఉంటుంది కదా? దానినీ నడిపేది మరలా మనిషే కదా?

*ఉదాహరణ 1* - దుర్యోధనుడి తప్పుడు మాటలు విని నమ్మి, ఆనాడే 11 అక్షౌహిణుల సైన్యం అతని పక్కన ఉంది - అధర్మముగా ధర్మరాజు గుంపు మాయా నటనల క్రుష్ణుని తో కలసి, మనల్ని అధర్మముగా జయించడానికి వస్తున్నారు, తెలివైన వీరు లారా మాతో కలసి రాండి అని అన్నారు. పోలో మని, గుడ్డి గా 11 అక్షౌహిణులు వెళ్ళారు కదా?

వాస్తవం - పాండవులకు సూది మోపినంత భూమి కూడా ఇవ్వను అని రారాజు మూర్ఖత్వం. వారి రాజ్యం మొత్తం వారికి ఇవ్వాలి, ఏళ్ళ వనవాసం తర్వాత. ఇది వారు ఒప్పుకుంటారా? గందరగోళం లేకుండా ఆపుతారా? ఆపరు. అబద్దలు పుంఖాలు పుంఖాలు గా ప్రచారం చేస్తారు, అసలు విషయాన్ని మరుగున పెడతారు. బలహీన మనసులమైన మనము, తప్పు ను ఒప్పుగా, ఒప్పును తప్పు గా భావిస్తాము. ఇప్పుడు మన చుట్టూ ఉంది వీరే.

*ఉదాహరణ 2* - రావణుడి తప్పుడు మాటలు విని, లంక రాక్షస సైన్య జనం మొత్తము రాముడి మీదకు యుద్దానికి వెళ్ళారు. రావణ మాటలు - రాముడు నరులు వానర సైన్యం తో, మన దీవిని ఆక్రమించుకోవడానికి మనల్ని బానిసలు గా చేయడానికి, అధర్మముగా, వంతెన కట్టుకుని వస్తున్నారు. ప్రజలారా వీరులారా, మన రాజ్యాన్ని కాపాడుకుందాము.

వాస్తవం - రాముడి భార్యను, దొంగ చాటుగా దొంగలా మాయవేషములో, తీసుకు వచ్చి రాజ్యం లో పెట్టిన, తప్పుడు మనిషి మాటలు వినవచ్చునా? అతనికి బుద్ది చెప్పేదెవరు? అతని ఐశ్వర్యానికి దాసులు కానిది ఎవరు? తప్పు చేసిన ఒక్క నాయకుని కోసం, ఆ తప్పుడు సైన్యం మొత్తం బలి అయ్యింది.

*ఉదాహరణ 3* - రోజూ ఉదయం 5 కి లెగిచి యోగాసనం/వ్యాయామం చేసి, పూజ/ ప్రార్ధన చేసుకుంటే ఆరోగ్యముగా ఉంటుంది అని మనము చెప్పాము అనుకోండి.

75 మంది అర్ధం లేని అనవసర గందరగోళ ఆరోపణలు ఎలా ఉంటాయో చూడండి, అవ్వ, నవ్వుకుంటారు జ్ఞానం కలిగిన వారు, అసలు విషయాన్ని పక్కన పెట్టి మసి పూసి మారేడు కాయ చేయడం అంటే ఇదే - పోనీ ఈ 25 మంది, అందులో తప్పు ఏముంది, ఇష్టం ఉంటే చెయ్యి లేకపోతే గమ్ముగా ఉండు అంటారా, వీరూ నోరు ఎత్తరు.

ఆరోపణ 1 - మమ్మల్ని చక్కగా కాపురం చేసుకోవద్దు లేదా ఆనందము గా నిద్ర పోవద్దు అంటున్నారు, 5 కే లెగవమంటున్నారు, అన్ని మత్తులు వదలి. మా నిద్ర మీద మీ అధికారం ఏమిటి? మా ఇళ్ళలోకి మీరు ఎందుకు జొరబడుతున్నారు?

వాస్తవం - రామ రామ, ఎక్కడైనా ఆ పదం ఉందా?

ఆరోపణ 2 - మమ్మల్ని బలవంతం చేస్తున్నారు లెగవమని, మాకు తెలీదా? ఎవరిష్టం వారిది. మా పిల్లలు లెగిచి చదివి, ఊళ్ళు ఏలాలా ఇప్పుడు? లెగవని వారు రాజ్యాలు ఏలడం లేదా? అసలు మా అమ్మ నాన్నలే చెప్పరు.

వాస్తవం - ఎక్కడైనా మీరు తప్పక లెగవాలి ఇవి చేయాలి, లేకపోతే శిక్షిస్తాము అని బలవంతం ఉన్నదా? ఆరోగ్యం గురించి చెపుతుంటే, ఊళ్ళు రాజ్యాలు మాట ఎందుకు?

ఆరోపణ 3 - ఉదయం లెగిచి, మమ్మల్ని వారి దైవాన్ని కొలవమని అంటున్నారు, మేమెందుకు కొలవాలి మా మత దైవాన్ని వదలి?

వాస్తవం - అసలు దైవం మతం పేరు ఉందా? ఎవరి మతం వారు వారినే కొలవచ్చు, అదే కదా ప్రార్ధన అంటే.

అంటే, ప్రతి మంచి పనికి, 100 పెడ అర్ధాలు తీసి, జనాన్ని భయ ఆందోళనలకు గురి చేసి, మరలా పాపపు రాజ్యాన్ని తెచ్చి, వారు ఏలి ఇంకా నాశనం చేదామని ఆశ.

మరి బలహీన మనస్కులు వారి వైపు ఉండి, భవిష్యత్ తరాలను, వారికి బానిసలు చేస్తారా? లేక మంచి వారి మాట విని స్వేచ్చగా భయం లేకుండా బతుకుతారా అనేది జరగబోయే రోజుల్లో చూద్దాము.

Does Agnipad or new president or anything else have any meaning unnecessary conspiracy theories? Spiritual Example  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,968; 104 తత్వాలు (Tatvaalu) and views 225,630
Dt : 23-Jun-2022, Upd Dt : 23-Jun-2022, Category : General
Views : 537 ( + More Social Media views ), Id : 1439 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : agnipad , president , meaning , unnecessary , conspiracy , theories , spiritual , example , allegations , modi , yogi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content