భగవంతునికి ఇష్టమైన 8 ఉచిత పుష్పాలు 8 favorite free flowers of God - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,875,460; 104 తత్వాలు (Tatvaalu) and views 225,762.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

When everything is filled with God, what can we offer Him? The only thing, God seeks is our Heart! Our Heart should yearn for Him, turn towards Him and Finally be ONE with Him.

#Arishadvarg #Ashtavyasan #saptavyasan #livingguruseva #guruseva #pradakshin #fasting #navagraha #harathi #karamala #Shiromundan #templeprasad #NavaDhanya #Shiva #Shani #parents #oldparents #momfeet #GunaKarma #vaksuddi #Jalaneti #barefoot #ayurveda #gheelamp #mothertongue #SanatanaDharma #Gratitude

చాలా మందికి తెలీదు, మొదటి మెట్టు అయిన, భౌతిక పూజ కోసం, బయట చెట్ల పూలకోసం పరుగులు తీసి, వాటితో గంటలు గంటలు నామస్మరణ తో, దండలు చేసి, దేవునికి సమర్పిస్తారు. దీనివల పుణ్యమే వారి మానసిక స్థితిని బట్టి, కానీ, మనకు ఎక్కువ పుణ్యం కావాలి కదా.

ఇంకొంత మంది ఆ ఓపిక కూడా లేక, తేలికగా ధనం తో కొన్న మాల వేస్తారు, డబ్బుకు దేవుడు లొంగుతాడు అని, తమ అద్రుష్టము ఉన్నంతవరకు.

కానీ దేవునికి కావలసింది, భౌతిక పూలు కాదు. మానసిక పూలు, అందుకే ఆయన అన్నారు, పత్రం ఫలం తోయం, నువ్వు ఏమి ఇచ్చావు అన్నది ముఖ్యము కాదు. ఎలాంటి మంచి నిర్మలమైన సాధన మనసుతో ఇచ్చావు అన్నది ముఖ్యం.

But God wants, not physical flowers. Mental flowers, that's why he said, leaf fruit water, it doesn't matter what you give. It is important that you gave it with a good pure sadhana heart.

మరి మంచి మనసు అంటే, మనసా వాచా కర్మణా (త్రికరణశుద్ది), అన్ని ఒకే విధము గా ఉండాలి. మామూలు పూలతో, బయట నటించే వారు చాలా మంది ఉన్నారు. కాని, మానసిక పూలతో, సంవత్సరాలు నటించడం కష్టం, అందరికీ తెలిసిపోతుంది, తమ నటన.

And good mind means, Manasa Vacha Karmana (Trikaranasuddhi), all should be same. With ordinary flowers, there are many who act outside. But, with mental flowers, it is difficult to act for years, everyone knows their performance.

మరి ఆ పూలేమిటో చూద్దామా. మరి మనము కూడా, రోజూ ఎన్ని పూలతో, త్రికరణ శుద్ది గా దేవుని కొలుస్తున్నామో, ఎవరికి వారం, మనమే అనుకుందాము, బాగు చేసుకుందాం.

Let's see what those flowers are. And we, too, with how many flowers we pray God daily by Trikaranasuddhi, let us think to ourselves, let us make it better.

మానస పూజారాధకులకు అష్టపుష్పపూజ అనేది ఉన్నది.

అష్టపుష్ప మానస పూజ:

Ahimsa Prathamam Pushpam, Pushpam Indriya Nigraha:
Sarvabhuta Daya Pushpam, Kshama Pushpam Visheshathaha
Jnana Pushpam, Tapa Pushpam ,Shanthi Pushpam Thathaiva cha
Satyam Ashtavidham Pushpoho, Vishnoho Preetikaram Bhaveth

శ్లో. అహింసా ప్రథమం పుష్పం - పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషత || శాంతి పుష్పం, తపః పుష్పం - ధ్యాన పుష్పం తథైవచ సత్య మష్టవిధం పుష్పం - శివ ప్రీతికరం భవేత్‌ ||

(శివా! ఈ పుష్పాష్టకంతో నీవు సంతృప్తుడవయ్యెదవు గాక! అహింస, ఇంద్రియచాపల్యరాహిత్యం, అన్ని ప్రాణుల పట్ల దయ, కష్ట నష్టాలను భరించగలిగే ఓర్పు, అన్నిటినీ సమానంగా చూసే నిర్మల శాంత గుణం, నిరంతర తపం, నిత్య ధ్యానం, నిజం చెప్పే గుణం...వీటితో నిన్ను మానసికారాధన చేయుదును.)

The first flower is Ahimsa, non-violence; the 2nd is indriya nigraham, sense control; the 3rd is sarva bhoota dayapushpam, compassion for all beings; the 4th is kshamapushpam, forbearance; the 5th is santhipushpam, peace; the 6th is thapopushpam, penance and austerity; the 7th is dhyanapushpam, meditation; and finally, the 8th flower is sathyapushpam, truth.

అనగా - ఈ గుణాలు ఎవరిలో వుంటాయో వారు వేరే పూజలేవీ చేయనక్కర్లేదు. తమ గుణాలద్వారానే, శివపూజ వారు చేస్తున్నట్లేనని భావం!

1. అహింసా పుష్పం/ Ahimsa/ Non-violence: ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటం. ఇది ప్రధమ పుష్పం.

Ahimsa - Non-Violence. This is the first (prathamam) flower (pushpam). As long as violence exists, there is separation.

* మరి ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి, ఇంట్లో వారిని, బయట వారిని మాటలతొనే ఎంత హింసిస్తున్నామో. అలాగే చేతలతో కూడా. జీవిత భాగస్వామి, అత్త కోడలు, అల్లుడు మామ, స్నేహితులు, ఇంకా ఎన్నో ఉదాహరణలు. ముదుసలి తల్లి దండ్రులను అలాగే పసి పిల్లలను, దూరంగా ఒంటరిగా వదిలేయడం కూడా హింసనే.
* మనకు తెలిసి, ఎదుటివారి బాగు గురించి ఏమైనా అని ఉంటామేమో కాని, మన స్వార్ధం కోసం మాత్రం ఎప్పుడూ అనలేదు. కానీ అది కూడా అనకూడదు. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాము.

2. ఇంద్రియ నిగ్రహం/Indriya nigraham, Sense control: మనసు, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం. ఇది రెండో పుష్పం.

Indriya Nigraha: - Sense Control. This is the second flower. If we let our senses drag our mind and intellect, we cannot focus on God or ANY other purpose.

* ప్రపంచాన్ని జయించిన వారు కూడా, తమను తాము జయించలేరు అనేది ఇందుకే. ఉదాహరణ రావణాసురుడు.
* మత్తు, తాగుతూ, బయట తిండి తింటూ, నోటికివచ్చిన విధముగా అరుస్తూన్న, అబద్దాలు చెపుతున్నా, చెద తిరుగుతూ ఉన్నా ఇంద్రియ నిగ్రహం లేనట్టే సుమా.
* నేను ఇంటి శాఖాహారమే తింటా. పొగ, తాగుడు, జూదము, మత్తు, మగువ లేదా అరిషడ్ వర్గాలకు దూరముగా ఉంటా అనేది ఇంద్రియ నిగ్రహం.

3. దయ/ Daya/ Compassion: కష్టాల్లో, బాధలో ఉన్న వారి యెడల దయ కలిగి ఉండటం. ఇది మూడో పుష్పం.

Sarva Bhuta Daya - Love to all Living Beings. This is one of the most important offerings to Vishnu. We should learn to Love all living beings.

* మంచి వారు కష్టాల లో బాధలలో ఉన్నప్పుడు, వారి బాధ విని అర్ధము చేసుకుని, వారికి కనీసము 4 మంచి మాటలు అయినా చెప్పి, భవిష్యత్ పై ఆశ కలిగించాలి. వీలైతే సహాయం చేయాలి.
* ఇప్పుడు పక్కన వారి బాధ వినే ఓపిక ఎవరికీ లేదు. పెళ్ళి అంటే, 100 మంది వస్తారు. విడాకులు తన్నులాట అంటే, 10 మంది కూడా రారు.

4. క్షమ/ Kshama/ Tolerance : ఎవరైనా మనకి అపకారం చేసినా, ఓర్పుతో సహించడం. ఇది నాలుగవ పుష్పం.

Kshama - Forgiveness. The shloka says that this flower is special! When you forgive someone, you are only doing yourself a favor by letting go of a HUGE karmic baggage.

* ఎదుటవారు తాము చేసిన తప్పులు ఒప్పుకుని, క్షమించమని అడిగితే, వారు నిజముగా మారారు అని భావిస్తే, క్షమించడం ఉత్తమ లక్షణం, ప్రతీకార ఆలోచన లేకుండా లేదా దూరంగా ఉండటం ఉత్తమం.
* ఇప్పుడు అవసరము అవకాశము ఉంటే, ఎంత పెద్ద తప్పులు అయినా, క్షమించేస్తున్నారు కలసి పోతున్నారు, మరలా ద్రోహం చేసుకుంటున్నారు, అది మంచి కిందకు రాదు. ఉత్తమ గుణ పశ్చాత్తపం, తగిన ప్రాయశ్చిత శిక్షతో.
* పాండవులు యుద్దము అయిపోయిన తర్వాత, పాప ప్రక్షాళనకై, కాలి నడకన, తీర్ధ యాత్రలకు వెళ్ళారు, క్రుష్ణుడే దగ్గర ఉండి యుద్దం చేపించినా కూడా.

5. ధ్యానం/ శాంతి/ Shanthi / Dhyana/ Inner Peace : ఈశ్వరుడిని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం. ఇది ఐదో పుష్పం.

Shanti - Peace. Peace arises when we realize that all things happen by God's will.

* నిరంతరం ఆయన మీదనే మనసు లగ్నం చేయడం. ఉదయం లెగవడం, స్నానం తొ పాటు, అలాగే పూజ, నడకలో, రైల్ లో, ఉద్యోగం మధ్య బ్రేక్ లో, ఎప్పుడు వీలైతే అప్పుడు. దీనివలన, తప్పు చేయడానికి, భయపడతాము. ఇతరులకు కష్టం కలిగించము. ఏకాగ్రత కుదురుతుంది, మనశ్శాంతి తో ఉంటుంది.

6. తపస్సు/ Tapas/ Austerity : మనసా, వాచా, కర్మణా, నియమాలు పాటించడం. ఇదే తపస్సు. ఇది ఆరవ పుష్పం.

Tapas - Austerities. We should strive to overcome mundane life and strive to reach the state of Divinity. All the meditation and austerities that are performed is Tapas.

* త్రికరణ శుద్ది గా మంచి నియమాలను పాటించడం, ఇదే తపస్సు. అడవికి వెళ్ళి ముక్కు మూసుకోవక్కర లేదు. చేసే పనిలో నిబద్దత నీతి నియమము ముఖ్యము.
* 20 ఏళ్ళు ఇంటి శాఖాహారమే, నేల నిద్రే, యోగాసనము, ధ్యానం. 7 ఏళ్ళు గా శని వారం గుడి దీపం, నవగ్రహ ప్రదక్షిణ. 100 వారాలు గా, 108 ప్రదక్షిణలు. 8 ఏళ్ళు గా 76 ఏళ్ళ కన్న తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవటము. ప్రతి రోజు అరగంట పూజ. తెలిసిన వారికి, మంచి చెడు గురించి ఓ 4 మాటలు వారి క్షేమం కోరుతూ. ఇలాంటి కొన్ని సాత్విక నియమాలు ఏళ్ళ తరబడి.

7. జ్ఞానం: పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం. ఇది ఏడవ పుష్పం.

Jnanam - Knowledge. This is the Knowledge of the Self and not worldly knowledge. We need to realize that the entire creation is of God and He shines in the Heart of all beings.

* ప్రపంచం అంతా మిద్య. మనము అద్దెకు వచ్చిన తోలు బొమ్మలము. ఇప్పుడు చేసిన పాపాలకు, శిక్ష ఏనాటికైనా తప్పదు, మరు జన్మలో అయినా.
* నిరాకారుడు నిరంజనుడు ఒకరే. తల్లి దండ్రులను సేవించనిదే, పరమాత్మను సేవించలేము. ఈ జగత్తు లో ఏదీ మనది కాదు.
* మనము ప్రజలను మోసము చేయవచ్చేమో కానీ, పంచభూతాలను కాదు, ప్రతిదీ రికార్డు చేస్తూనే ఉంటాయి.

8. సత్యం/ Sathya/ Truth : ఇతరులకు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం. ఇది ఎనిమిదవ పుష్పం.

Satyam - Truth. Truth is God Himself. Sri Bhagwatam starts Sathyam Param Dheemahi.

కనీసం 75 శాతం అయినా, నిజాలు మాట్లాడుతూ, నిష్టగా ఉండటము. ఎందుకంటే, ఇప్పుడు అందరము, 10 శాతం కూడా నిజాలు చెపుతున్నామో లేదో ఎవరికీ తెలీదు.

జీవిత భాగస్వాములు తో, తల్లి దండ్రులతో, స్నేహితులతో, ఆఫీసులో, అందరితో వీలైనన్న అబద్దాలు చెపుతూ, మన భవిష్యత్ ను మనమే మోసం చేసుకుంటున్నాము. ఎప్పుడు అయినా, అబద్దాలు, బయటకు వస్తాయి సుమా.

ఇవి అరుదైన, భగవంతునికి ఇష్టమైన పుష్పాలు, త్రికరణ శుద్దితో, ప్రతి నిత్యము మనము ఇవ్వాల్సిన పుష్పాలు. ఇతరులు దొంగిలించలేనివి, వాడిపోనివి, నటించలేనివి, బయట దొరకనివి ఇవే సుమా.

దేహమే దేవాలయం, జీవుడే దైవం. Body is Mandir, Soul is God.

మనము ఈ 8 ఉచిత పుష్పాల దైవ పూజ రోజూ చేస్తూ ఉంటే, మన ముదుసలి సంస్కార తల్లి దండ్రులు మనతో ఉంటారు, అలాగే మన ముదుసలి వయస్సులో, మన సంస్కార పిల్లలతో ఉంటాము. దేవుడు మనతో ఉంటారు.

If we worship God daily with these 8 free flowers, our old age samkara parents will be with us, and in our old age, we will be with our samkara children. God will be with us.  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,875,460; 104 తత్వాలు (Tatvaalu) and views 225,762
Dt : 06-Sep-2021, Upd Dt : 06-Sep-2021, Category : General
Views : 1571 ( + More Social Media views ), Id : 1245 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : flowers , god , shipa , ashtapushpa
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content