Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
ఎక్కువ మంది ఇళ్ళు లో, ఒకరు అంటే ఇంకొకరికి, అంటే గౌరవం మర్యాద ప్రేమ ఆప్యాయత తగ్గిపోతున్నాయి, తగ్గిపోయాయి కూడా, యాంత్రిక నిస్సత్తువ జీవితాలు అన్ని.
తల్లి దండ్రులు అలాగే ఇంట్లో వారు అంటే అనురాగం లేదు, అందరికీ పొరుగింటి పుల్ల కూర రుచి, ఇతరులు మాత్రమే నచ్చుతారు.
ఎందుకంటే దైవం భక్తి పూజ ధ్యానం పట్టించుకోని వారు కొందరు అయితే, అవి ఎందుకు చేస్తున్నారో కూడా తెలియని అమాయక స్ధితిలో, గుడ్డిగా మొక్కుబడిగా ఫలితాలు లేకుండా కొనసాగిస్తున్నారు.
సాంప్రదాయం నిబద్ధత ప్రేమ బాధ్యత అభిమానం లేని పూజ ప్రార్ధన నిరుపయోగం. అసలు లేని దాని కంటే నయం. కానీ పాస్ మార్కులతో లేదా తక్కువ ధనం తో బతకడం ఎవరికి నచ్చదు, పోటీలు ఇందులో.
మరి భక్తి ధ్యానం పూజ నిబద్ధత కృతజ్ఞతలు లో, పోటీలు?
అబ్బే అవేమీ వద్దు అండి, తేలికగా కొత్త స్వామి లేదా బాబా లేదా గురువు వచ్చారు అంట, మన భాష అయినా కాకపోయినా, నిజమైనా మరియు కల్పితం అయినా, వ్యాపారం మరియు ప్రచారం అయినా, అటే మా నిలకడ లేని మనసు మొగ్గుతుంది.
మన తాత నానమ్మ అమ్మమ్మ లు వద్దు, వారు మనతో వద్దు. వారి వాసనే వద్దు. అంతా తేలిపోయే కొత్త కావాలి.
అందరి పూజా మందిరం లేదా ఊళ్ళు చూడండి, పరాయి భాషల గురువు ల బాబాల స్వాముల, నిలువెత్తు ఫోటోలు పూలమాలలు, వార వృతాలు భజనలు.
మరి మన తెలుగు గురువు లు బ్రహ్మం, రాఘవేంద్ర మరియు వేమన ఫోటోలు మచ్చు కు కనపడవు. ఎందుకంటే తల్లి దండ్రులు, తాతలు నానమ్మ లు, మన ఇంటి పెద్దలు నే గౌరవించని నీతి కృతజ్ఞత లేని మనం, మన తెలుగు గురువు ల ప్రింట్ ఫోటోలు అయినా, ఇంట్లో లేదా పూజా మందిరంలో ఉంచుకుంటామా?
అంతమంది కి చోటు ఇచ్చిన, ప్రాపంచిక మోహ విశాల హృదయం కలిగిన మనం, మన పూజా మందిరంలో, మన తాతలు కు మన గురువు లకు (విడిగా పంపిన తెలుగు గురువు ల ఫోటో), విదేశాల్లో 50 సెంట్లు తో స్వదేశంలో 5 రూపాయల ప్రింట్ కాగితం తో నైనా, ఓ మూల ఇంట్లో గోడపై లేదా మందిరంలో చోటు ఇచ్చి, పిల్లల కు స్నేహితులు కు చూపలేమా?
ఓం నమో నారాయణాయ , ఓం శ్రీమాత్రే నమః, ఓం నమో శనీశ్వరాయనమః, ఓం నమో కరోనా గురవేనమః
జై బ్రహ్మం, జై రాఘవేంద్ర, జై వేమన
మాకు ఇంకా కృతజ్ఞతలు ప్రేమ బాధ్యత లు ఉన్నాయి మా పెద్దల మీద, మమ్మల్ని మన్నించండి, మా పతన మోహం వీడే సహాయం చేయండి అని మన దేవుళ్ళకు విన్నవించలేమా.
Sri, Telugu ,
10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2094 General Articles and views 1,837,982; 104 తత్వాలు (Tatvaalu) and views 221,651
Dt : 10-Aug-2021, Upd Dt : 10-Aug-2021, Category : General
Views : 637
( + More Social Media views ), Id : 1235
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
pass ,
marks ,
money ,
competitions ,
devotional ,
meditation ,
commitment
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments