గుడి కి వెళ్ళాలా వద్దా? వెళితేనే భక్తులమా? యధార్ధము ఏమిటి? క్రిష్ణయ్య దోస కధ - Devotional - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,885; 104 తత్వాలు (Tatvaalu) and views 225,180.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మన పెద్దలు ఒక పని చేసారు అంటే, దానిలో చాలా ముందు చూపు ఉంటుంది. మనము అర్ధము చేసుకోలేక, పాటించక, ఎగతాళి చేస్తూ, విస్మరించి పతనావస్థ దిశగా వెళుతున్నాము. గుడి అంటే, ప్రాణప్రతిష్ట చేస్తారు, విగ్రహాల కింద నవ ధాన్యాలు, శ్రీ చక్రము లాంటి చక్రాలు పెడతారు. అక్కడనుండి శక్తి ప్రసరిస్తుంది, ఇలాంటివి అందరికి తెలిసినవే. దాని గురించి కాకుండా మిగతా మాట్లాడుకుందాము.

ముందు గా కొన్ని ఉదాహరణలు చూద్దాము, గుడి కి వెళ్ళనవసరం లేదు అని. ఇది అబద్దము అయితే మీరే చెప్పండి. ప్రహ్లాదుడు, గుడికి వెళ్ళకుండానే, పసి తనములోనే, అత్యున్నతమైన భక్తిని సాధించి, దేవుని మెప్పించాడు.

అది పురాణములే అనుకున్నా, అన్నమయ్య తిరుపతి వెళ్ళకముందే, వెంకన్న పై మనసు పెట్టుకున్నారు నిలుపుకున్నారు. రామదాసు, భద్రచలం గుడి కట్టక ముందే, రామ భక్తుడు. బావాజీ వెంకన్ననే గుహకు తెప్పించుకొని పాచికలు ఆడారు.ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అంటే, మనసు ప్రధానం, అది పడే తపన ప్రధానం, మానసిక సాధన ముఖ్యం.

కాబట్టి, మనం గుడికి వెళ్ళావా లేదా అనేది కాదు ముఖ్యం. గుడికి వెళ్ళినా, మానసిక పూజ లేదా ఎదుగుదల లేనిదే నిష్ప్రయోజనం. మానసిక సాధన ఉండి వెళ్ళావా, ఫలితం అధికం. చాలా మంది, ఇంట్లో పొద్దున్నే 7 కల్లా కనీస అరగంట పూజ ముగించుకొని, పవిత్రమైన మనస్సుతో గుడికి వెళతారు, ఉదయం 9 లోపు.

ఇప్పుడు వ్యాపార, వర్గ, కుల, భాష, అధికార వ్యామోహముతో బజారుకి ఒకటి లేదా ఊరికి 4 గుడులు/ దొంగ ఆశ్రమాలు పెడుతున్నారు, దొంగ భక్తులు వారి వెంట నడచి మోస పోతూనే ఉన్నారు, వాళ్ళ గురించి కాదు ఈ వివరణ.

ఇప్పుడు మరి పెద్దలు ఎందుకు పెట్టారు గుడి సాంప్రదాయం చూద్దాము పాతకాలంలో.

1. మనసుతో కల్మషము లేకుండా, ప్రశాంత చిత్తముతో జనం లేనప్పుడు, ఉదయం లేదా
సాయత్రం భగవంతుని సన్నిధిలో కూర్చుని, ధ్యానం చేస్తే మనకు ఎంత హయిగా ఉంటుందో చాలా మందికి తెలుసు.

కానీ మనము ఎక్కువ జనము ఉన్నపుడే, తీరికగా వెళ్ళి, అందరితో కబురులు చెప్పుకొని, ఒక దండము పెట్టి విహార యాత్ర లాగ నిష్ప్రయోజనం గా టిఫిన్ భోజనం లాగించి, వస్తున్నాము. లేదా కొంపలు మునిగి పోతున్నట్టు గా క్షణం లో ఒక దండము పారేసి బయటకు పరుగెత్తుతున్నాము.

2. ఒక బీద కుటుంబము చిన్న ఇల్లు, ఒకటే గది, దేవుని గది లేదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ప్రార్ధనకు? దేవుని గది ఉంది, ఇంట్లో తగువులు అరుపులు, మనశ్శాంతికి ఎక్కడికి వెళ్ళాలి? ఇంట్లో మైల, ఎక్కడికి వెళ్ళాలి? గుడి ఏ కదా పదిలం.

3. నిజమైన భక్తులందరు, ఇంట్లో నే ఉంటే, సమాజం కలిసి ఉండేది ఎలా? కాబట్టి వాళ్ళు గుడికి వెళ్ళాలి, తీర్ధ యాత్రలు చెయ్యాలి, ఒకరినొకరు చూసి మాట్లాడుకోవాలి, కలసి మెలసి సహాయం చేసుకోవాలి, కష్ట సుఖాలు పంచుకోవాలి, లోకము తెలియాలి. అప్పుడే, సమాజం ఐకమత్యం గా ఉంటుంది, కాదంటారా?

4. అసలు దేవుడే వద్దు అనే వాళ్ళు ఉంటారు. మరి వారికి చూసే భాగ్యం కలగాలి అంటే, మరి గుడి ఉంటేనే కదా దేవుడు ఊరేగింపుగా గ్రామం / బజారు లోకి వచ్చేది?

5. ఒంటరివారు, అనాధలు వారానికి ఒకసారి ఎవరింటికి వెళ్ళి పలకరించాలి? గుడి కి వెళ్ళితే, దేవుళ్ళను పలకరించొచ్చు. మంచి మనసులు చేసే కార్యక్రమాలు/ పనులను తిలకించొచ్చు. ఆకలైతే, ప్రసాదము గరిటెడు దొరుకుతుంది. ఆ కాసేపు, అక్కడ అందరూ మన చుట్టాలే.

వ్యాపార ద్రుష్టితో కాకుండా మాములూగా ఉండే, గుడుల వలన, ఎంతో ఉపయోగము ఉండబట్టే, పెద్ద వాళ్ళు పెట్టారు. కానీ మన ఇంటి దగ్గర, మన పూజ, మన సాధన, మన ధ్యానం లేనిదే, కేవలం గుడి వలన ప్రయోజనము లేదు. స్థల పురాణం మహాత్యం ఉన్న గుడి కూడా, మంచి మనసు గల వారికి మాత్రమే పని చేస్తుంది కానీ, చెడ్డవారికి కాదు.

దీనికి ఒక కధ చెపుతారు. క్రిష్ణయ్య, పాండవులు తీర్ధయాత్రలకు వెళుతుంటే, ఒక దోసకాయ ఇచ్చి, మీతో పాటు అన్ని దేవాలయాల పూజలలో ఉంచి, తీర్ధాలలో ముంచి, నాకు తెచ్చి ఇవ్వండి అన్నారు అంట. తిరిగి వచ్చాక, వారిని దోసకాయ కోసుకొని తినమన్నారు అంట. అప్పుడు వారు అబ్బా, ఏమిటి ఈ దోసకాయ చేదుగా ఉంది అన్నారు, వద్దు అని ఊసేశారు. క్రిష్ణయ్య నవ్వుతూ, అదేమిటి తియ్యగా ఉండాలి కదా, ఇంకా చేదు గా ఉందా అన్నారు అంట. పాండవులు, ఆశ్చర్యపోతూ దండం పెట్టి, వాసుదేవా, దాని పరమార్ధము చెప్పు అన్నారు అంట.

అప్పుడు వాసుదేవుడు, అర్జునా, నేను చేదు దోసకాయనే ఇచ్చాను. మీ తీర్ధయాత్ర ఫలితముగా తీయగా వస్తుంది అని మీకిచ్చాను, కానీ రాలేదు అని మీరు అంటునారు, అన్నారు నవ్వుతూ.

వాళ్ళు స్వామీ వివరముగా చెప్పు అన్నారు నమస్కరించి. పరమాత్ముడు చిరునవ్వుతో ఇలా అన్నారు. చేదు దోసకాయను ఎన్ని క్షేత్రాలు తిప్పినా, తీపి రాలేదు అని మీరే ఒప్పుకున్నారు. అంటే, మనిషి తనకు తాను మారకుండా మంచి దోవలోనికి, ఎన్ని తీర్ధాలు తిరిగినా ఫలితం శూన్యము అని చెప్పారు.

దొంగ బాబాలను ఆశ్రమాలకు దూరంగా ఉండాలి. గుడి లో జరిగే రాజకీయాలకు అక్రమాలకు దూరంగా ఉండాలి. డబ్బు కట్టి అష్టోత్తరము కొబ్బరికాయ తో పని లేదు, నీ మనస్సునే నైవేద్యం గా పెట్టు. ఆ గుడి కార్యక్రమాలు సక్రమముగా లేకపోతే, హుండీ లో డబ్బు వేయాల్సిన పని లేదు, పది మందికి మన చేత్తో సహయం చేసినా చాలు. జంతు బలి వద్దు, అన్నం బలి చాలు.

దేవుడు ని, విగ్రహం లో చూసే ముందు, మనలో మరియు తోటి మనుషలలో దేవుని చూడడం నేర్చుకోవాలి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,885; 104 తత్వాలు (Tatvaalu) and views 225,180
Dt : 21-Jul-2019, Upd Dt : 09-Aug-2019, Category : Devotional
Views : 4328 ( + More Social Media views ), Id : 30 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : temple visit , temple devotee , temple useful info , sri krishna , pandava , dosa kaya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు