Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
జనవరి 26 1950 లో, భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చింది. దానికి గుర్తు గా రిపబ్లిక్ డే జరుపుకుంటారు. భారత గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు.
మొన్న ఆగష్టు లో జాతీయ జెండా లు, ఓ నాలుగు చిన్నవి అయినా కొని ఇంట్లో పెట్టుకోండి, అని గుర్తు చేసుకున్నాము. ఢిల్లీలో జరిగే, సైనిక వేడుకలు చూడండి, టీవీల్లో.
ఆ జండాలు ఉంటే లేదా కొని, బయట అందరికీ కనపడేటట్లుగా ఇల్లు లేదా ఆఫీసు బయట పెట్టుకోవాలి. అందరికీ ఈ రోజు ప్రాముఖ్యత చెప్పాలి.
మన దేశంలో ఉన్న స్వేచ్ఛ ఎక్కడ లేదు. ఏమి చేసినా అడిగేవారు లేరు. కడుపు నిండా తిని, మన ఇంట్లో హాయిగా ఉంటున్నాము.
బయట దేశాల వార్తలు వినండి, రోజు కో పేలుడు, ఏమి జరుగుతుంది ఎవరికీ తెలీదు. బిడ్డ ఎక్కడో, భార్య ఎక్కడో, నాన్న వస్తాడో రాడో ఏమీ తెలీదు. శరణార్ధులు గా ఏ ఊరు, ఏ రాష్ట్రం, ఏ దేశం వెళ్ళాలో తెలియక, బిక్కు బిక్కు మనే బతుకులు దేశాలు ఎన్నో ఉన్నాయి. మన దేశములో, బ్రిటిష్ పాలన రోజులు సినిమాలో చూసాం కదా.
భారతమాత మరియు సొంత తల్లి దండ్రులు మీద, కనీసం కృతజ్ఞతలు అభిమానం కలిగి ఉండాలి. అది చేతలలో కనీసం 50 రూపాయల జండాతో అన్నా చూపించండి, పది మందికి చెప్పండి.
భరత మాత ఇచ్చే స్వేచ్ఛ, ఇక మనకు ప్రపంచంలో ఎక్కడా దొరకదు. కన్నతల్లి అండా అంతే కదా, బొడ్డు తెగిన రోజు గుర్తు తెచ్చుకో, వారిని విడువకు.
జాతీయ జెండాలు, గర్వంగా ఎగిరే విధంగా, అందరికీ కనపడే విధంగా, నేను నా దేశము ను ప్రేమించుచున్నాను , ఈ స్వేచ్ఛ ఇచ్చినందుకు కృతజ్ఞతలు కలిగి ఉంటాను అని , గణతంత్ర దిన శుభాకాంక్షలు దేశానికి దేశ ప్రజలకు తెలియ చేద్దాం, అలవాటు చేద్దాం.
దేశ రాజ్యాంగాన్ని గౌరవించు, అది మనల్ని కాపాడుతుంది. మన అవకాశం కోసం రాజ్యాంగం ను అవమానిస్తే మోసం చేస్తే, అదే మనల్ని శిక్షిస్తుంది. రాజ్యాంగ శిక్షలు తప్పించుకున్న వారు, దేవుని శిక్షలు ఎటూ తప్పించుకోలేరు కదా , మన కళ్ళు ఎదురు ఎన్నో చూశాము.
ఎన్నికల్లో, రాజ్యాంగ బద్దమై, మంచి వారిని ఎన్నుకుందాం. మాయా మోస నాయకుల మాటలు ఎల్లప్పుడూ నమ్మి మోసపోతూ , మన తర్వాత తరాలను చీకట్లో కి నెట్టిన పాపం మనదే సుమా.
జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం. చిన్నారి మహాలక్ష్మి అంశలకు శుభాకాంక్షలు.
Sri, Telugu ,
10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2092 General Articles and views 1,836,381; 104 తత్వాలు (Tatvaalu) and views 221,518
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments